E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అశ్విన్ మాస్టర్ ప్లాన్.. అక్షయ్ కు షాకిచ్చిన అవని.. పల్లవి పై అనుమానం..

Intinti Ramayanam Today Episode: అశ్విన్ మాస్టర్ ప్లాన్.. అక్షయ్ కు షాకిచ్చిన అవని.. పల్లవి పై అనుమానం..
Advertisement

Intinti Ramayanam Today Episode july 23rd: పల్లవి ఎలాగైనా సరే మా నాన్నని అడిగి డబ్బులు తీసుకురావాలి అని అనుకుంటుంది.. ఇక చక్రధర్ దగ్గరికి వెళ్ళిన పల్లవికి చక్రధారి ఎంతో ప్రేమగా పలకరింపుతో రమ్మని పిలుస్తాడు.. అయితే నేను వచ్చింది మీ మీద ప్రేమతో కాదు అని పల్లవి అనగానే మరి ఎందుకు వచ్చావు అని సీరియస్గా అడుగుతాడు. ఒక పది లక్షలు డబ్బులు కావాలి అని అనగానే నేను అవసరం లేదు కానీ నా డబ్బులు నీకు కావాలా అని చక్రధర్అంటాడు.. నీకు డబ్బులు ఇవ్వాలి అంటే అవినీతో దగ్గరికి వెళ్లి నువ్వు నిజం చెప్పు ఆ తర్వాత నేను 20 లక్షలు కాదు కోటి రూపాయలైనా నీకు ఇస్తానని చెప్పడంతో అవని తప్ప నేను అవసరం లేదా అని పల్లవి సీరియస్ అవుతుంది..

పల్లవికి చక్రధర్ దిమ్మతిరిగే షాక్..

పల్లవి నాకు ఫైనల్ గా డబ్బులు ఇస్తారా ఇవ్వరా అని అడుగుతుంది.. నేను ఆ డబ్బులు ఇవ్వాలి అంటే నాకు అవని నుంచి ఆమోదం వస్తేనే నేను ఇస్తాను అని అంటాడు. అవినీతో చెప్పకుండా నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరా ఏంటి? ఎందుకు ఇలా మారిపోయారు అని అడుగుతుంది పల్లవి.. అవని ఇప్పుడొచ్చింది కానీ పాతికేళ్లు పెంచిన నేను మీకు బరువైపోయినా అని అడుగుతుంది.. పల్లవి ఎంతగా అడుగుతున్నా సరే.. చక్రధర్ మాత్రం అవనికి అన్నీ తెలుసు.. కాబట్టి అవని ఏం చెప్తే నేను అదే చేస్తాను అవి నీకు చెప్పు ఒకసారి అని అంటారు.. మీకు నాకన్నా ఆ అవి నేనే ఎక్కువ కాబట్టి నేను ఎప్పటికీ మిమ్మల్ని అడగను.. నాతో మాట్లాడొద్దు అని చక్రధర్ తో గొడవపడి పల్లవి వచ్చేస్తుంది.

పల్లవికి షాకివ్వబోతున్న అశ్విన్..

Advertisement

అశ్విన్ పల్లవి డబ్బులు ఇచ్చింది కానీ నన్ను మోసం చేసింది.. దాని జీవితాన్ని నేను ఎంతగా నాశనం చేయాలనుకుంటున్నాను అంతకంటే ఎక్కువగానే దాన్ని బాధపెట్టి మరి హింసిస్తాను అని అంటాడు.. పల్లవి డబ్బులు ఇచ్చింది కదరా ఇక ఆడది కదా వదిలేయచ్చు కదా అని తన ఫ్రెండు ఎంతగా చెప్తున్నా సరే అశ్విన్ మాత్రం అస్సలు వినడు. అది ఆడదే కానీ ఆడదానివల్ల ఎన్ని యుద్ధాలు జరిగాయో నీకు తెలియదా అని అశ్విన్ అంటాడు. ఎలాగైనా సరే పల్లవి పై రివేంజ్ తీర్చుకొని తనకి చుక్కలు చూపించాలి అని అశ్విన్ అనుకుంటాడు.. తన ఫ్రెండ్ ఎంతగా చెప్తున్నా సరే పల్లవికి నెక్స్ట్ నేను చెప్పేది చేసేది అసలు ఊహించలేవు అని అశ్విన్ అంటాడు ఆ మాట వినగానే తన ఫ్రెండు షాక్ అవుతాడు.

కూతురు కోసం మీనాక్షి ఫీల్..

మీనాక్షి చక్రధర్ కి ఫోన్ చేసి మన కూతురు ఏదో సమస్యలో ఉండండి మీరు ఒకసారి కనుక్కోవచ్చు కదా అని అంటుంది.. అవును మీనాక్షి పల్లవి ఇందాకే నా దగ్గరకు వచ్చి డబ్బులు కావాలి అని అడిగింది.. నేను అవని అడిగి చెప్తాను అని చెప్పగానే నాకేం అవసరం లేదు అని వెళ్ళిపోయింది. ఎంతగా చెప్తున్నా సరే పల్లవి మాత్రం అవనికి దగ్గర కాలేక పోతుంది అదే నాకు సమస్యగా మారింది అని చక్కగా చెప్పగానే.. మీనాక్షి మీరు ఎందుకండి అవనితో చెప్తానని అన్నారు ఇప్పుడు పల్లవి ఏదో బాధలను సమస్యలను ఉంది అని నాకు అర్థం అయిపోతుంది.. మీరు అదేంటో కనుక్కొని పిలిస్తే పల్లవి చాలా సంతోషంగా ఉంటుంది అని మీనాక్షి అంటుంది. మీరు ప్రతి విషయాన్ని కూడా తర్వాత భూతద్దంలో పెట్టి చూడడం మంచిది కాదు పల్లవి కూడా మన కుదురే కాబట్టి మీరు పల్లవి నుంచి ఆలోచించండి అని మీనాక్షి చెప్తుంది. అయితే చక్రధర్ అవనికి ఆ సమస్య ఏంటో చెప్తే చాకచక్యంగా తీరుస్తుంది కదా అని అంటాడు.. నీ కూతురు పల్లవి కోసం నువ్వు ఆరాటపడుతున్నావు అని నాకు అర్థం అయిపోయింది మీనాక్షి.. కానీ పల్లవి మారాలి అంటే అవనికి అన్నీ చెప్పాల్సిందే అని చక్రధర అంటాడు.

అక్షయ్ ను ఫుడ్ తో కొట్టిన అవని..

Advertisement

అక్షయ్ సైటుకి వెళ్లి అక్కడ అన్ని పనులను చకచకా పూర్తి చేస్తూ ఉంటాడు.. మొత్తం బిల్డింగ్ గురించి మల్ల ఒకసారి అక్కడున్న ఎంప్లాయిస్ తో మాట్లాడుతూ బిజీగా ఉన్నా అక్షయ్ దగ్గరికి కమల్ వస్తాడు.. అన్నయ్య నీకోసం భోజనం తెచ్చాను మిగతా పనులన్నీ నేను చూసుకుంటాను నువ్వు ముందు వెళ్లి భోజనం చెయ్యి అని అంటాడు.. అయితే కమల్ చెప్పినట్లుగానే వెళ్లి భోజనం చేయడానికి కూర్చున్న అక్షయ్ కి ఆ బాక్స్ లో ఉన్న ఐటమ్స్ చూసి మైండ్ బ్లాక్ అవుతుంది.. బాక్స్ లో ఏ కూర ఉన్నా కూడా అది కాకరకాయకు సంబంధించినవే ఉండడంతో అక్షయ్ షాక్ అవడంతో పాటుగా అవనికి ఫోన్ చేసి అడగాలని అనుకుంటాడు.. అవినీతో వీడియో కాల్ చేసి ఎందుకు నాకు ఇష్టం లేని కూరని వండి పెట్టావు అని అంటాడు. నేను వద్దు అన్న కూడా మీరు చేశారు కాబట్టి నేను అలిగాను మీతో మాట్లాడను అందుకే కాకరకాయతోనే అన్ని రకాల వంటలు చేశాను తినేసి బాగా ఎంజాయ్ చేయండి అని అనగానే అక్షయ్ చాలా ఫీల్ అయిపోతాడు. భార్యలు అలిగితే బాధ కూడా పెరుగుతుంది అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని అనుకుంటాడు..

పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్..

పల్లవి చక్రధారిని కలిసిన తర్వాత ఇంటికి వస్తూ ఉండగా అవని పల్లవిని ఆపుతుంది.. ఏమైంది పల్లవి నీకు డబ్బులు అంత అవసరం ఏమి వచ్చింది అని అడుగుతుంది.. నువ్వు నాన్న దగ్గరికి వెళ్లి డబ్బులు అడిగావని తెలుస్తుంది.. మీ వరికి ఆ మేటర్ అప్పుడే వచ్చేసిందా..? నాన్న అన్ని కూడా చెప్పేసాడు అన్నమాట.. అసలు నీకు అంత డబ్బులు ఎందుకు అవసరం వచ్చింది అని అవని అడుగుతుంది. అయితే అస్సలు మాట వినకుండా పల్లవి నా ఇష్టం నా జీవితం అని మాట్లాడుతుంది.. ఆ మాట వినగానే అవని నువ్వు ఇంకా మారవా ఎందుకు నువ్వు ఇలానే ప్రవర్తిస్తూ ఉంటావు అని అంటుంది అవని.. ఇక పల్లవి ఎంత చెప్పినా వినదు కాబట్టి నాకు బాబు బంగారం నగలను తీసుకొని రావాలి అని పల్లవికి చెప్పగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : గురువారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

Related News

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Big Stories

Advertisement
×