How to get rid of lizards in apartment: కొత్తగా అపార్ట్‌మెంట్‌లోకి మారారా ? లగ్జరీ లైఫ్‌స్టైల్ బాగుంటుంది కానీ.. అకస్మాత్తుగా గోడ మీద బల్లి కనిపిస్తే గుండె జారినంత పనవుతుంది కదూ! ఎంత క్లీన్‌గా ఉంచినా ఈ అపార్ట్‌మెంట్లలో బల్లులు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాదు. అయితే.. కేవలం హోమ్ రెమెడీస్‌తోనే కాదు, పెద్ద పెద్ద లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ బిల్డర్స్ కూడా అపార్ట్‌మెంట్‌లను పెస్ట్-ఫ్రీగా ఉంచడానికి కొన్ని స్మార్ట్ పద్ధతులు వాడుతుంటారు. ఈ రోజు మనం ఇంట్లో బల్లులను ఎలా దూరం పెట్టాలో, అలాగే టాప్ బిల్డర్స్ వాడే పద్ధతులు ఏంటో తెలుసుకుందామా..
అపార్ట్‌మెంట్‌లో బల్లులను తరిమికొట్టే సూపర్ హోమ్ రెమెడీస్:
మనం ఎంత కాదన్నా అపార్ట్‌మెంట్ బాల్కనీలు, విండోస్ ద్వారా బల్లులు ఈజీగా లోపలికి వచ్చేస్తాయి. వాటికి గుడ్ బై చెప్పడానికి ఉపయోగపడే కొన్ని సూపర్ చిట్కాలు ఇవే..
ఉల్లిపాయ,వెల్లుల్లి కాంబో: బల్లులకి ఉల్లిపాయ, వెల్లుల్లి అంటే అస్సలు పడదు. వాటిలో ఉండే సల్ఫర్ వాసనకి బల్లులు పరుగెడుతుంటాయి. వీటి రసాన్ని నీళ్లలో కలిపి స్ప్రే బాటిల్‌తో బల్లులు తిరిగే చోట కొట్టండి.. రిజల్ట్ మీకే తెలుస్తుంది.
మిరియాల పొడి స్ప్రే: కొద్దిగా ఘాటైన మిరియాల పొడిని నీళ్లలో కలిపి గోడల మూలల్లో, కిటికీల దగ్గర స్ప్రే చేయండి. ఈ ఘాటుకి బల్లులు ఇటు వైపు చూడటానికి కూడా భయపడతాయి.
కోడిగుడ్డు పెంకులు: ఇది మన అమ్మమ్మల కాలం నాటి ట్రిక్ అయినా ఇప్పటికీ బాగా పని పని చేస్తుంది. కిటికీల దగ్గర కోడిగుడ్డు పెంకులు పెడితే.. అక్కడ ఏదో పెద్ద జీవి ఉందనే భయంతో బల్లులు రావు.
నాఫ్తలిన్ గోలీలు: మీ అల్మారాలు, సింక్ కింద, వార్డ్‌రోబ్స్ మూలల్లో నాఫ్తలిన్ గోలీలను ఉంచండి. వీటి వాసన బల్లులను, ఇతర కీటకాలను దరి చేరనివ్వదు.
ఐస్ కోల్డ్ వాటర్ ట్రిక్: బల్లి ఎక్కడైనా కనిపిస్తే.. దానిపై ఐస్ వాటర్ స్ప్రే చేయండి. బల్లులు కోల్డ్ బ్లడెడ్ ప్రాణులు కాబట్టి, చల్లటి నీరు పడగానే అవి కాసేపు కదల్లేవు. అప్పుడు వాటిని ఈజీగా బయట పడేయొచ్చు.
టాప్ బిల్డర్స్ ఫాలో అయ్యే ‘సీక్రెట్’ పెస్ట్ కంట్రోల్ పద్ధతులు:
పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ అపార్ట్‌మెంట్లలో వేల ఇళ్లు ఉంటాయి. మరి అక్కడ పెస్ట్స్, బల్లులు రాకుండా బిల్డర్స్ ఎలాంటి పద్ధతులు పాటిస్తారో తెలుసా?
1. కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లోనే ట్రీట్‌మెంట్ :
టాప్ బిల్డర్స్ ఇళ్లు కట్టేటప్పుడే పునాదుల్లో , గోడల జాయింట్స్‌లో స్పెషల్ కెమికల్ ట్రీట్‌మెంట్ చేస్తారు. దీని వల్ల భూమి నుంచి వచ్చే చెదలు, ఇతర పురుగులు రావు. కీటకాలు లేకపోతే వాటిని తినే బల్లులు కూడా అపార్ట్‌మెంట్ వైపు రావు.
2. ఎయిర్ కర్టెన్లు, స్మార్ట్ మెష్ డిజైన్స్ :
ఈ రోజుల్లో వస్తున్న మోడరన్ అపార్ట్‌మెంట్లలో కిటికీలకు, బాల్కనీ డోర్లకు బిల్డర్స్ ముందే హై-క్వాలిటీ నెట్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు. అంతేకాదు.. మెయిన్ లాబీ ఎంట్రన్స్‌లలో ‘ఎయిర్ కర్టెన్లు’ పెడతారు. ఇవి గాలిని ఫోర్స్‌గా కిందికి నెట్టడం వల్ల ఎలాంటి దోమలు, ఈగలు, బల్లులు లోపలికి రాలేవు.
3. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ :
టాప్ సొసైటీలలో ప్రతీ నెలా ఐపీఎం సిస్టమ్‌ను మెయింటెన్ చేస్తారు. ఇందులో కేవలం మందులు కొట్టడమే కాదు.. డ్రైనేజీ సిస్టమ్స్ క్లీన్ చేయడం, ఓపెన్ ఏరియాల్లో ఫాగింగ్ చేయడం, చెత్తను ఎప్పటికప్పుడు సైంటిఫిక్ పద్ధతిలో డిస్పోజ్ చేయడం లాంటివి ఉంటాయి.
Also Read: ప్రోటీన్ ఎక్కువైతే ప్రమాదమే! అవసరానికి మించి తింటే వచ్చే 5 షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్!
4. అల్ట్రాసోనిక్ పెస్ట్ రిపెల్లెంట్స్ :
లగ్జరీ బిల్డింగ్స్ , కామన్ ఏరియాస్‌లో బిల్డర్స్ అల్ట్రాసోనిక్ డివైజ్‌లను వాడుతున్నారు. ఇవి మనుషులకు వినపడని, కానీ బల్లులు, ఎలుకలు, పురుగులకు చికాకు కలిగించే హై-ఫ్రీక్వెన్సీ సౌండ్స్ (ధ్వని తరంగాలు) రిలీజ్ చేస్తాయి. దీంతో అవి ఆ బిల్డింగ్ వైపు కూడా రావు.
5. సీలింగ్ , గ్యాప్స్ లాకింగ్ :
పైపులైన్లు వెళ్లే దారిలో, వైరింగ్ జంక్షన్ల దగ్గర చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే బిల్డర్స్ వాటిని స్పెషల్ సిలికా జెల్ లేదా ఫోమ్ వాల్స్‌తో పూర్తిగా క్లోజ్ చేస్తారు. ఎంట్రీ పాయింట్స్ బ్లాక్ అవ్వడంతో బల్లుల ఆటలు సాగవు.
మీ అపార్ట్‌మెంట్‌లో బల్లులు లేకుండా ఉండాలంటే.. ఇల్లు ఎప్పుడూ పొడిగా, వెలుతురుతో ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇంట్లో దోమలు, చిన్న పురుగులు లేకుండా చూసుకుంటే వాటి ఆహారమైన బల్లులు ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. బిల్డర్స్ పాటించే స్మార్ట్ టెక్నిక్స్‌తో పాటు హోమ్ రెమెడీస్ పాటిస్తే.. మీ ఫ్లాట్ సూపర్ క్లీన్‌గా, ప్రశాంతంగా ఉంటుంది. సో, ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే ఈ ట్రిక్స్ ట్రై చేసి చూడండి.