E-Paper
Advertisement

ప్రోటీన్ ఎక్కువైతే ప్రమాదమే! అవసరానికి మించి తింటే వచ్చే 5 షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్!

ప్రోటీన్ ఎక్కువైతే ప్రమాదమే! అవసరానికి మించి తింటే వచ్చే 5 షాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్!
Advertisement

High Protein Diet Side Effects: ఈ రోజుల్లో ఫిట్‌నెస్, మజిల్ బిల్డింగ్, వెయిట్ లాస్ అనే మాటలు బాగా వినిపిస్తున్నాయి. బరువు తగ్గాలన్నా, కండలు పెంచాలన్నా అందరూ రికమండ్ చేసేది ఒక్కటే.. అదే ‘ప్రోటీన్’. మార్కెట్లో దొరికే ప్రోటీన్ షేక్స్, చికెన్, గుడ్లు, పప్పులను డైట్‌లో విపరీతంగా పెంచేస్తున్నారు. అయితే.. ప్రోటీన్ తక్కువగా తినడం ఎంత హానికరమో.. మోతాదుకు మించి ఎక్కువగా తినడం కూడా అంతే ప్రమాదకరమని చాలా మందికి తెలియదు. అవసరానికి మించి ప్రోటీన్ తీసుకుంటే అది శరీరంలో ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందో వివరంగా తెలుసుకుందాం.

ప్రోటీన్ ఎక్కువగా తింటే వచ్చే తీవ్రమైన సమస్యలు :

Advertisement

శరీర కణాల నిర్మాణానికి, రోగనిరోధక శక్తికి ప్రోటీన్ చాలా అవసరం. కానీ, “అతి సర్వత్ర వర్జయేత్” అన్నట్లు ఏది ఎక్కువైనా అమృతం కూడా విషంగా మారుతుంది. మన అవసరానికి మించి లాంగ్-టర్మ్ హై-ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల శరీరంలోని ముఖ్య అవయవాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.

1. కిడ్నీలపై విపరీతమైన ఒత్తిడి :
మనం తిన్న ప్రోటీన్ అరిగిపోయిన తర్వాత.. అది అమినో యాసిడ్స్‌గా మారుతుంది. ఈ ప్రాసెస్‌లో ‘నైట్రోజన్’ అనే బై-ప్రొడక్ట్ (వ్యర్థం) విడుదలవుతుంది. ఈ నైట్రోజన్‌ను శరీరం నుంచి బయటకు పంపే బాధ్యత కిడ్నీలదే. మనం విపరీతంగా ప్రోటీన్ తిన్నప్పుడు, ఆ వ్యర్థాలను ఫిల్టర్ చేయడానికి కిడ్నీలు రాత్రింబవళ్లు ఓవర్‌టైమ్ పని చేయాల్సి వస్తుంది. ఇది కాలక్రమేణా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి , కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది.

Advertisement

2. విపరీతమైన డీహైడ్రేషన్ :
శరీరంలో అధికంగా ఉన్న నైట్రోజన్ , ఇతర వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపడానికి బాధ్యత వహించే క్రమంలో శరీరం ఎక్కువ మొత్తంలో నీటిని వాడుకుంటుంది. దీని వల్ల మీకు తెలియకుండానే మీ బాడీలో నీటి శాతం పడిపోతుంది. హై-ప్రోటీన్ డైట్ తీసుకునే వారు తగినంత నీరు తాగకపోతే తీవ్రమైన డీహైడ్రేషన్, తలనొప్పి, అలసట, మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

3. నోటి దుర్వాసన:
బరువు తగ్గడం కోసం చాలా మంది కార్బోహైడ్రేట్లను పూర్తిగా బంద్ చేసి, కేవలం ప్రోటీన్ మాత్రమే తింటారు. ఇలాంటప్పుడు శరీరం శక్తి కోసం కొవ్వును కరిగించడం స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్‌ను ‘కీటోసిస్’ అంటారు. ఇందులో ‘కీటోన్స్’ అనే కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల శ్వాస తీసుకునేటప్పుడు నోటి నుంచి ఒక రకమైన వింతైన దుర్వాసన వస్తుంది. బ్రష్ చేసినా కూడా ఈ స్మెల్ అంత సులభంగా పోదు.

4. బరువు పెరగడం :
చాలా మంది ప్రోటీన్ తింటే బరువు తగ్గుతాం అనుకుంటారు. ఇది కొంత వరకే నిజం. శరీరానికి రోజుకు కావలసిన క్యాలరీల కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే.. మన బాడీ ఆ అదనపు ప్రోటీన్‌ను కండరాలుగా మార్చలేదు. బదులుగా, మిగిలిపోయిన ప్రోటీన్‌ను కొవ్వు రూపంలో స్టోర్ చేస్తుంది. దీని వల్ల బరువు తగ్గాల్సింది పోయి, మరింత బరువు పెరిగే ప్రమాదం ఉంది.

5. గుండె జబ్బుల ముప్పు:
హై-ప్రోటీన్ డైట్ కోసం చాలా మంది రెడ్ మీట్ (మేక మాంసం, బీఫ్), ఫుల్-ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ , ఫ్రైడ్ చికెన్‌లను ఎక్కువగా తింటుంటారు. వీటిలో ప్రోటీన్‌తో పాటు ‘సాచురేటెడ్ ఫ్యాట్స్’ కొలెస్ట్రాల్ విపరీతంగా ఉంటాయి. ఇది రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటానికి, తద్వారా హార్ట్ ఎటాక్, పక్షవాతం వచ్చే అవకాశాలను పెంచుతుంది.

అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి?:
సాధారణ వ్యక్తులకు: ఒక సాధారణ మనిషికి తన శరీర బరువులో ప్రతి కిలోకు 0.8 గ్రాముల నుంచి 1 గ్రాము ప్రోటీన్ సరి పోతుంది. అంటే మీ బరువు 60 కిలోలు ఉంటే.. రోజుకు 48 నుంచి 60 గ్రాముల ప్రోటీన్ తింటే చాలు.

జిమ్‌కి వెళ్లేవారికి: హెవీ వెయిట్స్ ఎత్తే రన్నర్లు లేదా బాడీ బిల్డర్లకు వారి బరువులో ప్రతి కిలోకి 1.2 నుంచి 2 గ్రాముల వరకు ప్రోటీన్ అవసరం పడుతుంది.

కృత్రిమ పౌడర్లు వద్దు: సప్లిమెంట్ల కంటే పప్పులు, గుడ్లు, పాలు, మొలకెత్తిన గింజలు వంటి సహజ సిద్ధమైన ఆహారం ద్వారా ప్రోటీన్ పొందడం ఎల్లప్పుడూ సురక్షితం.

న్యూట్రిషన్ విషయంలో బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. ప్రోటీన్‌తో పాటు కార్బోహైడ్రేట్లు, గుడ్ ఫ్యాట్స్, ఫైబర్ (పీచు పదార్థం) అన్నీ సమపాళ్లలో ఉన్నప్పుడే శరీరం హెల్తీగా ఉంటుంది. ఏవైనా సప్లిమెంట్లు లేదా హై-ప్రోటీన్ డైట్ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి డైటీషియన్‌ను సంప్రదించడం మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Related News

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

ఇంట్లో కత్తి మొద్దుబారిపోయిందా? పదును పెంచడానికి న్యూస్‌పేపర్‌ ఉంటే చాలు.. ఎలాగంటే

Big Stories

Advertisement
×