E-Paper
Advertisement

మట్టి కుండలోని నీరు ఐస్ వాటర్ మారాలా ? ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు

మట్టి కుండలోని నీరు ఐస్ వాటర్ మారాలా ? ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు
Advertisement

Clay Pot Tricks: వేసవి కాలం వచ్చిందంటే చాలు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి. దాహం తీర్చుకోవడానికి చాలా మంది ఫ్రిజ్‌లో ఉంచిన చల్లటి నీటిని తాగుతుంటారు. అయితే ఫ్రిజ్ నీరు తాత్కాలికంగా దాహం తీర్చినప్పటికీ.. ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇది గొంతు నొప్పి, జీర్ణక్రియ సమస్యలకు దారి తీస్తుంది. అందుకే మన పెద్దల కాలం నాటి మట్టి కుండ నీటిని తాగడం ఎంతో మంచిది. మట్టి కుండ నీరు సహజంగా చల్లబడటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ చాలా మంది ఇంట్లో కుండలోని నీరు సరిగ్గా చల్లగా అవ్వడం లేదని బాధపడుతుంటారు. మీ ఇంట్లోనే మట్టి కుండ నీటిని ఫ్రిజ్ లా మార్చే 3 సులువైన చిట్కాలు ఇప్పుడు చూద్దాం.

కుండలోని నీటిని చల్లగా మార్చే చిట్కాలు:

తడి జనపనార సంచి లేదా కాటన్ క్లాత్ ట్రిక్:
మట్టి కుండలోని నీరు ఎల్లప్పుడూ ఐస్ లా చల్లగా ఉండటానికి ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన , పురాతనమైన చిట్కా. ఒక కాటన్ క్లాత్ లేదా జనపనార సంచిని తీసుకుని నీటిలో పూర్తిగా తడపాలి. ఆ తడి క్లాత్‌ను మట్టి కుండ చుట్టూ గట్టిగా చుట్టాలి. రోజంతా ఆ క్లాత్ ఎండిపోకుండా మధ్యమధ్యలో దానిపై నీళ్లు చల్లుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కుండ ఉపరితలంపై బాష్పీభవన క్రియ వేగంగా జరుగుతుంది. దీని వల్ల కుండ లోపల ఉన్న నీటి ఉష్ణోగ్రత వేగంగా పడిపోయి.. నీరు ఫ్రిజ్ నీళ్ల కంటే చల్లగా మారుతుంది.

Advertisement

ఇసుక తిన్నె ఏర్పాటు చేయడం:
కుండను నేరుగా నేలపై లేదా సిమెంట్ బండలపై పెట్టడం వల్ల కింద నుంచి వేడి కుండకు తగిలి నీరు త్వరగా వేడెక్కుతుంది. దీనికి బదులుగా ఒక వెడల్పాటి ప్లాస్టిక్ లేదా ఇనుప పాత్రను తీసుకుని, అందులో ఒక రెండు అంగుళాల మందం వరకు ఇసుకను నింపాలి. ఆ ఇసుకను నీటితో బాగా తడపాలి. ఇప్పుడు ఆ తడి ఇసుకపై మీ మట్టి కుండను ఉంచాలి. ఇసుకలోని తేమ కుండ అడుగు భాగాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుతుంది. ఈ చిన్న ట్రిక్ వల్ల కుండలోని నీరు రోజంతా చల్లదనంతో, అద్భుతమైన రుచితో ఉంటుంది.

Also Read: మామిడి పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలా? ఈ టిప్స్ మీకోసమే

Advertisement

గాలి తగిలే ప్రదేశంలో కుండను ఉంచడం:
మట్టి కుండలు పనిచేసే విధానం పూర్తిగా గాలి ప్రసరణపై ఆధారపడి ఉంటుంది. కుండకు ఉండే చిన్న చిన్న రంధ్రాల గుండా నీరు కాస్త బయటకు వచ్చి ఆవిరవుతుంది. ఈ ప్రక్రియ వేగంగా జరగాలంటే.. కుండను ఇంటి మూలల్లో, చీకటి గదుల్లో పెట్టకూడదు. రూమ్‌లో గాలి బాగా ఆడే కిటికీ పక్కన లేదా ఎయిర్ కూలర్ గాలి తగిలే ప్రదేశంలో కుండను ఉంచాలి. గాలి తగలితే బాష్పీభవనం వేగంగా జరిగి, కుండలోని నీరు చాలా త్వరగా ఐస్ వాటర్ లా మారుతుంది.

మట్టి కుండ వాడేటప్పుడు చేయకూడని తప్పులు:
కొత్త కుండ తెచ్చినప్పుడు దాన్ని కనీసం 24 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. అప్పుడే దాని రంధ్రాలు తెరుచుకుంటాయి. అలాగే కుండను శుభ్రం చేయడానికి ఎప్పుడూ కెమికల్ సబ్బులు లేదా డిటర్జెంట్ లిక్విడ్స్ వాడకూడదు. అలా చేస్తే సబ్బు కెమికల్స్ కుండ రంధ్రాలను పూడ్చేస్తాయి. నీటిలో సబ్బు వాసన వస్తుంది. కేవలం గోరు వెచ్చని నీరు, కొద్దిగా బేకింగ్ సోడా లేదా రాళ్ల ఉప్పు ఉపయోగించి చేత్తో మాత్రమే కుండను లోపల, బయట క్లీన్ చేయాలి.

Related News

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

చాణక్య నీతి.. ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం

Big Stories

Advertisement
×