E-Paper
Advertisement

సెట్టింగ్ స్ప్రే లేదా? అయినా పర్లేదు.. మేకప్ రోజంతా చెరిగిపోకుండా ఉండే సూపర్ ట్రిక్స్!

సెట్టింగ్ స్ప్రే లేదా? అయినా పర్లేదు.. మేకప్ రోజంతా చెరిగిపోకుండా ఉండే సూపర్ ట్రిక్స్!
Advertisement

Long lasting makeup tips: పెళ్లిళ్లు, బర్త్‌డే పార్టీలు లేదా ఆఫీస్ ఈవెంట్స్‌కి వెళ్లేటప్పుడు ఎంతో ఓపికగా మేకప్ వేసుకుంటాం. కానీ కాసేపటికే ఎండకో, లేదా చెమటకో ఆ మేకప్ ప్యాచీగా మారిపోవడం లేదా కారిపోవడం జరుగుతుంది. సాధారణంగా మేకప్ లాంగ్ లాస్టింగ్‌గా ఉండటానికి ‘సెట్టింగ్ స్ప్రే’ వాడుతుంటారు. ఒకవేళ మీ దగ్గర సెట్టింగ్ స్ప్రే అయిపోతేనో.. లేక కెమికల్స్ ఉంటాయని దాన్ని వాడటం ఇష్టం లేకపోతేనో ఏం చేయాలి? టెన్షన్ పడకండి! సెట్టింగ్ స్ప్రే అస్సలు లేకుండానే మీ మేకప్ రోజంతా ఫ్రెష్‌గా, గ్లోయింగ్‌గా ఉండేలా చేసే 5 సింపుల్ హోమ్ ట్రిక్స్ ఇప్పుడు చూద్దాం.

సెట్టింగ్ స్ప్రే లేకుండా మేకప్ ఎక్కువసేపు నిలిచేలా చేసే 5 మార్గాలు:

Advertisement

1. ఐస్ వాటర్ థెరపీ:
మేకప్ ఎక్కువసేపు నిలవాలంటే మీ చర్మం చల్లగా, రంధ్రాలు చిన్నవిగా ఉండాలి. అందుకే మేకప్ స్టార్ట్ చేయడానికి ముందే ఒక ఐస్ ముక్కను కాటన్ క్లాత్‌లో చుట్టి ముఖంపై మెల్లగా రుద్దండి. లేదా ఒక బౌల్‌లో చల్లటి నీరు, ఐస్ క్యూబ్స్ వేసి అందులో మీ ముఖాన్ని 5 నుండి 10 సెకండ్ల పాటు ముంచండి . ఇలా చేయడం వల్ల ఫేస్ పై బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి, చర్మ రంధ్రాలు ముసుకుపోతాయి. దీని వల్ల మేకప్ వేసుకున్న తర్వాత చెమట, ఆయిల్ త్వరగా బయటకు రావు. ఫలితంగా మీ మేకప్ బేస్ చాలా స్ట్రాంగ్‌గా సెట్ అవుతుంది.

2. స్కిన్ ప్రిపరేషన్ , ప్రైమర్ మస్ట్ :
చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. డైరెక్ట్‌గా ఫౌండేషన్ వేసేయడం. స్కిన్ ప్రిపరేషన్ సరిగ్గా ఉంటే.. సెట్టింగ్ స్ప్రే అవసరమే ఉండదు. ముఖాన్ని బాగా కడుక్కున్నాక ఆయిల్-ఫ్రీ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అది చర్మంలోకి ఇంకిపోయాక ఖచ్చితంగా ఒక మంచి ‘ప్రైమర్’ వాడాలి. ప్రైమర్ అనేది మీ చర్మానికి, మేకప్‌కు మధ్య ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పని చేస్తుంది. ఇది ఫేస్ పై ఉన్న ముడతలను, రంధ్రాలను కవర్ చేసి మేకప్ చర్మానికి బాగా అంటుకునేలా చేస్తుంది. మీ దగ్గర ప్రైమర్ లేకపోతే ప్యూర్ అలోవెరా జెల్‌ను కూడా ప్రైమర్‌లా వాడుకోవచ్చు.

Advertisement

3. ఐసింగ్ షుగర్ లేదా లూజ్ పౌడర్ బేకింగ్ :
సెట్టింగ్ స్ప్రేకి బెస్ట్ ఆల్టర్నేటివ్ ‘లూజ్ పౌడర్’ లేదా ‘ట్రాన్స్‌లూసెంట్ పౌడర్’. మేకప్‌లో ‘బేకింగ్’ అనే టెక్నిక్ చాలా పాపులర్. మీరు ఫౌండేషన్, కన్సీలర్ అప్లై చేసిన తర్వాత.. కళ్ల కింద, ముక్కు చుట్టూ, గడ్డం భాగంలో (ఎక్కడైతే ఆయిల్ ఎక్కువగా వస్తుందో అక్కడ) ఎక్కువ మొత్తంలో లూజ్ పౌడర్‌ను పఫ్ సహాయంతో పెట్టాలి. దాన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ టైమ్‌లో మీ ఫేస్ హీట్‌కు ఆ పౌడర్ మేకప్‌ను లాక్ చేస్తుంది. ఆ తర్వాత ఒక బ్రష్‌తో ఎక్స్‌ట్రా పౌడర్‌ను దులిపేయాలి. ఈ ట్రిక్ మేకప్‌ను అస్సలు కదలకుండా చేస్తుంది.

4. బ్లెండర్‌ను రోజ్ వాటర్‌తో తడపడం :
ఫౌండేషన్ లేదా కన్సీలర్ బ్లెండ్ చేయడానికి మనం బ్యూటీ బ్లెండర్ (స్పాంజ్) వాడుతుంటాం. సాధారణంగా దీనిని నార్మల్ వాటర్‌తో తడుపుతారు. కానీ సెట్టింగ్ స్ప్రే లేనప్పుడు, బ్యూటీ బ్లెండర్‌ను ‘రోజ్ వాటర్’ తో తడపండి. స్పాంజ్ లోని ఎక్స్‌ట్రా రోజ్ వాటర్ ని పిండేసి, ఆ తడి స్పాంజ్‌తో ఫౌండేషన్‌ను ముఖంపై టాప్ చేస్తూ బ్లెండ్ చేయాలి. రోజ్ వాటర్‌లో సహజసిద్ధమైన ఆస్ట్రింజెంట్ గుణాలు ఉంటాయి. ఇది మేకప్ చర్మానికి పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయ్యేలా చేయడమే కాకుండా, లాంగ్ లాస్టింగ్ గ్లోను ఇస్తుంది.

5. లేయరింగ్, మ్యాట్ ప్రొడక్ట్స్ వాడటం:
సెట్టింగ్ స్ప్రే లేనప్పుడు క్రీమ్ ప్రొడక్ట్స్ కంటే పౌడర్ బేస్డ్ లేదా మ్యాట్ ప్రొడక్ట్స్ ఎంచుకోవడం బుద్ధిశాలిగతనం. ఒకవేళ మీరు క్రీమ్ బ్లష్ లేదా లిక్విడ్ హైలైటర్ వాడితే, దానిపైన ఖచ్చితంగా లైట్‌గా పౌడర్ బ్లష్ లేదా పౌడర్ హైలైటర్ వేసి లేయరింగ్ చేయాలి. ఇలా క్రీమ్ ప్రొడక్ట్‌ను పౌడర్ ప్రొడక్ట్‌తో లాక్ చేయడం వల్ల మేకప్ మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఆయిలీ స్కిన్ ఉన్నవారు వాటర్-బేస్డ్ లేదా మ్యాట్ ఫౌండేషన్స్ వాడితే చెమట పట్టినా మేకప్ పాడవదు.

మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే కేవలం సెట్టింగ్ స్ప్రే ఒక్కటే మార్గం కాదు. ఈ 5 సింపుల్ హోమ్ బ్యూటీ హ్యాక్స్ ఫాలో అయితే మీ మేకప్ ఎండలో తిరిగినా.. ఫంక్షన్లలో గంటల తరబడి డ్యాన్స్ చేసినా అస్సలు చెరిగిపోదు. సహజంగానే మీ ముఖం మెరిసిపోతుంది.

Related News

దోసె పిండి కోసం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు.. 5 రకాల ఇన్‌స్టంట్ దోసె రెసిపీలు

ఆడవాళ్లకు డిప్రెషన్.. మగవాళ్లకు హార్ట్ఎటాక్ రిస్క్.. డయాబెటిస్ వెనుక ఇంత కథ ఉందా?

తప్పు జరిగితే సహించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు సూటిగా మాట్లాడుతారు

30 దాటిన ప్రతి మహిళ సప్లిమెంట్లు వాడాలా? ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే..

టిఫిన్‌ బాక్స్‌లో పిల్లలు రుచికరమైన ఆహారం కావాలంటున్నారా? 10 నిమిషాల్లో తయారు చేసే 5 టేస్టీ రెసిపీలు మీ కోసం

మొటిమలు వచ్చాయని ఆత్మవిశ్వాసం కోల్పోకండి.. పర్ఫెక్ట్ స్కిన్‌కు నిజమైన అర్థం ఇదే

ఇంట్లో చేసిన టీ రుచికరంగా లేదా? ఎక్కువ మసాలాలు లేకుండా కడక్ చాయ్ చేయడానికి సింపుల్ టిప్స్

వంట గిన్నెలు, తవాలపై జిడ్డు మొండిగా ఉందా? సింపుల్‌గా క్లీన్ చేసే చిట్కా ఇదిగో

Big Stories

Advertisement
×