E-Paper
Advertisement

90W ఛార్జింగ్, 50MP సోనీ కెమెరాతో Vivo V70 Lite లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

90W ఛార్జింగ్, 50MP సోనీ కెమెరాతో Vivo V70 Lite లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
Advertisement

Vivo V70 Lite: టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Vivo V70 సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ యూఏఈ మొబైల్ మార్కెట్‌లోకి వచ్చేసింది. Vivo V70 Lite పేరుతో విడుదలైన ఈ ఫోన్.. గతంలో వచ్చిన V60 Liteకు సక్సెసర్‌గా నిలవనుంది. ఇటీవల భారత్‌లో V70, V70 Elite మోడళ్లను లాంచ్ చేసిన సంస్థ, ఇప్పుడు సైలెంట్‌గా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను పరిచయం చేసింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ వివో దీనిని డిజైన్ చేసింది.

ఆకట్టుకునే డిజైన్..

ఈ Vivo V70 Lite చూడటానికి దాదాపు పాత మోడల్‌లానే ఉన్నప్పటికీ.. డిజైన్ పరంగా కొన్ని మార్పులు చేశారు. చాలా సన్నని బెజెల్స్, పంచ్ హోల్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. అలాగే దీనిలో 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. వీడియోలు చూసేటప్పుడు మంచి అనుభూతి కలుగుతుంది.

Advertisement

Also Read: గేమర్స్‌కి పండగే.. 185Hz డిస్‌ప్లే, 10,000mAh భారీ బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్త మొబైల్ వస్తోంది!

పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్:

ఈ బడ్జెట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 2.5GHz క్లాక్ స్పీడ్‌తో రన్ అవుతుంది. కాబట్టి.. రోజువారీ యూజ్‌తో పాటు గేమింగ్‌ను కూడా ఈ ఫోన్ సులువుగా హ్యాండిల్ చేయగలదు. దీనికి తోడు 12GB వరకు RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను జోడించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 సాఫ్ట్‌వేర్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది.

కెమెరా ముచ్చట్లు ఇవే:

Advertisement

కెమెరా పరంగా చూసుకుంటూ ఈ ఫోన్ వెనుక వైపు నిలువుగా అమర్చిన రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP ప్రధాన సోనీ కెమెరాతో పాటు, 8MP వైడ్ యాంగిల్ కెమెరాను ఇచ్చారు. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరాను కేటాయించారు. దీనివల్ల సోషల్ మీడియా రీల్స్, ఫొటోలు, వీడియో కాల్స్ చాలా క్లారిటీగా వస్తాయి.

ధర వివరాలు:

Vivo V70 Lite ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీనే. 6,500mAh సామర్థ్యం గల బ్యాటరీని ఇచ్చారు. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. యూఏఈ మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్ బేస్ వేరియంట్ (8GB RAM + 256GB స్టోరేజ్) ధర రూ.28,500గా ఉంది). అలాగే, దీని టాప్ వేరియంట్ (12GB RAM + 256GB స్టోరేజ్) ధర రూ.33,700గా నిర్ణయించారు. ఈ ఫోన్ ప్రస్తుతం బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Also Read: రోబోట్ క్లీనర్ నుండి స్మార్ట్ ప్లగ్ వరకు.. ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన బెస్ట్ అలెక్సా డివైజెస్!

Related News

వాట్సప్ హ్యాక్ అయిందా? వెంటనే ఇలా చేయండి.. స్కామర్లకు పిచ్చెక్కిపోద్ది!

వానలో ఆఫీస్‌కి వెళ్తున్నారా? రూ.300 లోపున్న ఈ గ్యాడ్జెట్స్ లేకపోతే.. రూ.వేలల్లో నష్టపోవాల్సిందే!

SanDisk సంచలనం.. సరికొత్త USB-C డ్రైవ్‌లు లాంచ్.. ఇక డేటా ట్రాన్స్‌ఫర్ మరింత ఈజీ!

20,000mAh బ్యాటరీ.. 67W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ నుంచి మైండ్ బ్లోయింగ్ పవర్ బ్యాంక్!

గ్రహాంతర వాసుల కోసం.. అంతరిక్షంలోకి భారతీయ పాట.. ఖగోళంలో మార్మోగుతున్న సింగర్ స్వరం!

వీఐ యూజర్లకు పండగే.. రూ. 189కే ఫ్రీ కాల్స్, డేటా.. సామాన్యులకు పర్ఫెక్ట్ ప్లాన్!

జియో బంపర్ ఆఫర్.. రూ. 175కే 10 జీబీ డేటా.. ఉచితంగా 11 ఓటీటీలు!

AC ఫ్యాన్ మోడ్.. కరెంట్ బిల్లు సగానికి తగ్గించుకునేందుకు సూపర్బ్ ట్రిక్!

Big Stories

Advertisement
×