E-Paper
Advertisement

Homemade Moisturizer: పొడి చర్మానికి గుడ్‌బై.. ఇంట్లోనే వింటర్ క్రీమ్ తయారు చేసుకోండిలా !

Homemade Moisturizer: పొడి చర్మానికి గుడ్‌బై.. ఇంట్లోనే వింటర్ క్రీమ్ తయారు చేసుకోండిలా !
Advertisement

Homemade Moisturizer: చలికాలంలో చల్లటి గాలులు, తక్కువ తేమ కారణంగా మన చర్మం చాలా త్వరగా పొడిబారుతుంది. అంతే కాకుండా చర్మంపై పగుళ్లు కూడా వస్తాయి. కొన్ని సార్లు నిర్జీవంగా మారుతుంది. చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కేవలం నీరు తాగడం మాత్రమే కాకుండా.. నాణ్యమైన మాయిశ్చరైజర్ వాడటం చాలా ముఖ్యం. మార్కెట్‌లో దొరికే వాటితో పోలిస్తే.. ఇంట్లో సహజ పదార్థాలతో తయారు చేసుకునే మాయిశ్చరైజర్‌లు సురక్షితమైనవి. అంతే కాకుండా మరింత ప్రభావవంతమైనవి.

ఇంట్లో మాయిశ్చరైజర్ తయారుచేయడానికి అద్భుతమైన పద్ధతులు:

Advertisement

1. షియా బట్టర్ & కొబ్బరి నూనె మాయిశ్చరైజర్ (పొడి చర్మానికి బెస్ట్):
ఈ మాయిశ్చరైజర్ చాలా చిక్కగా ఉండి, చర్మానికి ఎక్కువ సమయం తేమను అందిస్తుంది.

కావలసిన పదార్థాలు:
1/2 కప్పు – షియా బట్టర్

Advertisement

1/4 కప్పు – కొబ్బరి నూనె

1 చెంచా – బాదం నూనె లేదా ఆలివ్ నూనె

5-8 చుక్కలు – లావెండర్ ఆయిల్

తయారీ విధానం:
ఒక పాత్రలో షియా బట్టర్ , కొబ్బరి నూనెను తీసుకోండి. వీటిని డబుల్ బాయిలర్ పద్ధతిలో (ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి, దానిపై చిన్న గిన్నె పెట్టి వేడి చేయడం) సన్నని మంటపై పూర్తిగా కరిగించండి. గిన్నెను స్టవ్ మీద నుంచి తీసి, అందులో బాదం నూనె లేదా ఆలివ్ నూనె, ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో 20-30 నిమిషాలు ఉంచండి. మిశ్రమం కాస్త గట్టిపడి, క్రీములా మారడానికి సిద్ధంగా ఉండాలి. గట్టిపడిన మిశ్రమాన్ని బయటికి తీసి.. హ్యాండ్ బ్లెండర్ లేదా స్పూన్ సహాయంతో 5-10 నిమిషాలు బాగా గిలకొట్టండి. ఇది మెత్తని, తెల్లని క్రీములా మారుతుంది. ఈ క్రీమ్‌ను గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోండి. ఇది సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద 2-3 నెలల వరకు తాజాగా ఉంటుంది.

2. అలోవెరా & గ్లిజరిన్ జెల్ :
ఇది తేలికైన మాయిశ్చరైజర్. ఇది జిడ్డుగా లేకుండా చర్మానికి తక్షణమే తేమను అందిస్తుంది.

కావలసిన పదార్థాలు:
1/2 కప్పు – స్వచ్ఛమైన కలబంద గుజ్జు/జెల్

2 చెంచాలు – గ్లిజరిన్

1 చెంచా – రోజ్ వాటర్

1/2 చెంచా – విటమిన్ ఇ ఆయిల్

తయారీ విధానం:
ఒక శుభ్రమైన పాత్రలో కలబంద జెల్, గ్లిజరిన్, రోజ్ వాటర్ , విటమిన్ ఇ ఆయిల్‌ను తీసుకోండి. ఈ పదార్థాలన్నింటినీ, జెల్ నునుపుగా అయ్యేవరకు స్పూన్ సహాయంతో లేదా చిన్న విస్క్ సహాయంతో మెల్లగా కలపండి.ఈ మిశ్రమాన్ని ఒక పంప్ బాటిల్ లేదా చిన్న డబ్బాలో నింపి, ఫ్రిజ్‌లో నిల్వ చేయండి. ఇది చల్లగా ఉన్నప్పుడు రాసుకుంటే మరింత మంచి అనుభూతిని ఇస్తుంది. అంతే కాకుండా ఇది 2-3 వారాల వరకు నిల్వ ఉంటుంది.

మాయిశ్చరైజర్ వాడే విధానం:
ప్రతిరోజూ ఉదయం, రాత్రి నిద్రపోయే ముందు మాయిశ్చరైజర్ వాడాలి. స్నానం చేసిన వెంటనే, చర్మం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ అప్లై చేస్తే.. తేమ చర్మంలో ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. ముఖంతో పాటు, మోచేతులు, మోకాళ్లు, పాదాలకు తప్పకుండా రాసుకోవాలి. ఈ హోమ్ మేడ్ మాయిశ్చరైజర్లను ఉపయోగించడం ద్వారా మీరు చలికాలంలో కూడా మృదువైన, కాంతివంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×