E-Paper
Advertisement

Ram Charan : మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్… సీఎం రేవంత్ టీంలో గ్లోబల్ స్టార్..

Ram Charan : మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్… సీఎం రేవంత్ టీంలో గ్లోబల్ స్టార్..
Advertisement

Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్    రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఈయన సినిమాల తో ఎంత బిజీగా ఉన్నా కూడా స్పోర్ట్స్ పై ఉన్న ఆసక్తితో అప్పుడప్పుడు మ్యాచ్ ను చూసేందుకు గ్రౌండ్ కు వెళ్తారు. స్టేడియంలో ఉన్న రామ్ చరణ్ ఫోటోలు కొన్ని గతంలో  సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ గ్రౌండ్ లోకి దిగబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అవును మీరు విన్నది నిజమే.. రామ్ చరణ్, తెలంగాణ సీఏం రేవంత్ రెడ్డి కలిసి ఫుడ్ బాల్ మ్యాచ్ ఆడబోతున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. ఈ వార్త విన్న మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. స్టార్ హీరో, రాష్ట్ర ముఖ్య మంత్రి కలిసి ఆడబోతున్నారంటు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. ఈ ఫుడ్ బాల్ మ్యాచ్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

సీఏం రేవంత్ రెడ్డి టీమ్ లో రామ్ చరణ్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాల్లో తిరుగులేని మనిషి.. ప్రజల శ్రేయస్సు కోసం కీలక నిర్ణయాలను తీసుకుంటూ ప్రతిపక్షాలకు చెమటలు పట్టిస్తుంటాడు.. ఈ నేపధ్యంలో.. ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తో నిజమైన ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు.. మెస్సీని ఢీకొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సీఏం ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నెల 13న సాయంత్రం ఉప్పల్ మైదానంలో లియోనెల్ మెస్సీ టీమ్‌తో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో రేవంత్ రెడ్డి టీమ్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆడబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఇది మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఈ మ్యాచ్ లో సీఏం టీమ్ లో రామ్ చరణ్ తో పాటుగా ఇంకెవరైన సెలబ్రేటీలు ఉన్నారేమో అన్నది మరో రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది…

Advertisement

Also Read :టాలీవుడ్‌కు డిసెంబర్ శాపంగా మారిందా..? అసలేం జరుగుతుంది…

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. 

టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టేసింది.. కథల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నారు.. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీని తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. మొత్తానికి రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×