E-Paper
Advertisement

Akhanda 2 -Venu Swamy: అఖండ 2 వాయిదాకు కారణం నీ పూజలే… వేణు స్వామీ మీద పడ్డ బాలయ్య అభిమానులు

Akhanda 2 -Venu Swamy: అఖండ 2 వాయిదాకు కారణం నీ పూజలే… వేణు స్వామీ మీద పడ్డ బాలయ్య అభిమానులు
Advertisement

Akhanda 2 -Venu Swamy: నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రధాన పాత్రలో నటించిన అఖండ 2(Akhanda 2) సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా చివరి నిమిషంలో విడుదల వాయిదా పడింది. ఈ సినిమాకు ఫైనాన్స్ ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ విషయాలన్నింటిని బాలయ్య దగ్గర ప్రస్తావించకుండా దాచి ఉంచారని చివరి నిమిషంలో ఫైనాన్షియర్లు అడ్డుకోవడంతో ఈ సినిమా వాయిదా పడిందని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా వాయిదా పడటంతో బాలకృష్ణ అభిమానులు చిత్ర నిర్మాతలపై తీవ్రస్థాయిలో అవగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి (Venu Swamy) పట్ల కూడా మండిపడుతున్నారు.

అఖండ 2 వాయిదా.. వేణు స్వామి పై విమర్శలు..

ఇటీవల వేణు స్వామి ఒక వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన సమంత రెండో పెళ్లి గురించి ప్రస్తావిస్తూ తాను ఈ పెళ్లి గురించి ఏ మాత్రం మాట్లాడదలచుకోలేదని తెలిపారు. అంతేకాకుండా ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల కాబోతున్న ఒక స్టార్ హీరో సినిమా కోసం తాను పూజలు చేస్తున్నానని తెలిపారు అయితే ఆ హీరో ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదు. ఇలా ప్రత్యేకంగా పూజలు హోమాలు చేయడంతో కచ్చితంగా బాలకృష్ణ అఖండ 2 సినిమా కోసమే పూజలు చేశారని అభిమానులు భావించారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం వాయిదా పడటంతో బాలకృష్ణ అభిమానులు వేణు స్వామి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పూజలు చేస్తే సినిమాలు రిలీజ్ అవుతాయా?

Advertisement

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా కొంతమంది బాలకృష్ణ అభిమానులు స్పందిస్తూ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ వీడు.. ఈడితోనే మొదలయ్యింది సగం దరిద్రం.. పూజలు చేస్తే రిలీజ్ అవుతుందని ఎలా అనుకున్నావు రా ఎదవ నిర్మాతలు డబ్బులు కట్టింటే రిలీజ్ అయ్యేది అంటూ దారుణంగా వేణు స్వామి పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం వేణు స్వామి చాలా పవర్ ఫుల్ అని చెబుతూ ఉంటారు కదా.. స్వయంగా ఆయన పూజలు చేసిన ఈ సినిమా ఎందుకు రిలీజ్ కాకుండా వాయిదా పడింది అంటూ భారీగా విమర్శలు కురిపిస్తున్నారు.

Advertisement

ఇలా బాలకృష్ణ అఖండ 2 సినిమా వాయిదా పడిన నేపథ్యంలో ఈ సినిమా వాయిదా ప్రభావం వేణు స్వామి పై కూడా ఎక్కువగా ఉందని తెలుస్తుంది . మరి సోషల్ మీడియాలో వేణు స్వామి గురించి వస్తున్నటువంటి ఈ విమర్శలపై వేణు స్వామి స్పందించి అసలు విషయం తెలియచేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక అఖండ సినిమా విడుదల వాయిదాకు కేవలం ఫైనాన్స్ ఇబ్బందులేనని తెలుస్తోంది .నిర్మాతలు ఈ సినిమాను నిర్మించడం కోసం ముగ్గురు ఫైనాన్షియర్ల దగ్గర ఏకంగా మూడు రూపాయలకు పైగా వడ్డీకి డబ్బులు తెచ్చి సినిమా చేశారని అయితే ఇప్పుడు వారికి డబ్బులు చెల్లించకుండా సినిమా విడుదల చేయడానికి వీలు లేదంటూ అడ్డుకోవడంతోనే సినిమా వాయిదా పడిందని తెలుస్తుంది. మరి ఈ సమస్యను నిర్మాతలు అధిగమించి ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారో తెలియాల్సి ఉంది.

Also Read: Allu Arjun: పుష్ప2 సినిమాకు ఏడాది.. మరిచిపోలేని ప్రయాణం అంటూ బన్నీ ట్వీట్!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×