E-Paper
Advertisement

Amla Hair Dye: శాశ్వతంగా తెల్ల జుట్టును నల్లగా మార్చే పాతకాలపు చిట్కా ఇదే!

Amla Hair Dye: శాశ్వతంగా తెల్ల జుట్టును నల్లగా మార్చే పాతకాలపు చిట్కా ఇదే!
Advertisement

Amla Hair Dye: తెల్ల జుట్టును సహజసిద్ధంగా నల్లగా మార్చుకోవడానికి ఉసిరికాయ ఒక అద్భుతమైన ఔషధం. మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డైల వల్ల జుట్టు రాలడం, అలర్జీలు వంటి సమస్యలు వస్తాయి. కానీ ఉసిరికాయతో ఇంట్లోనే తయారు చేసుకునే డై వల్ల జుట్టు నల్లబడటమే కాకుండా.. దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా ఉంటుంది. ఉసిరి కాయతో సహజమైన హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
ఎండిన ఉసిరికాయ ముక్కలు లేదా పొడి: 3-4 టేబుల్ స్పూన్లు

Advertisement

కొబ్బరి నూనె: ఒక కప్పు

కరివేపాకు: ఒక గుప్పెడు

Advertisement

తయారీ విధానం (స్టెప్-బై-స్టెప్):
1. ముందుగా స్టవ్ వెలిగించి, దానిపై ఐరన్ పాన్ ఉంచండి. అందులో ఉసిరికాయ పొడి లేదా ఎండిన ముక్కలను వేయండి. చిన్న మంటపై ఉసిరికాయ పొడి ముదురు నలుపు రంగులోకి మారే వరకు వేయించాలి. పొడి మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఇది కాఫీ పొడి కంటే ముదురు రంగులోకి రావాలి.

2. పొడి నల్లగా మారిన తర్వాత.. అందులో కొబ్బరి నూనెను పోయండి. ఇందులోనే కరివేపాకు కూడా వేయవచ్చు. ఈ మిశ్రమాన్ని 10-15 నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించాలి. ఉసిరికాయలోని పోషకాలు, రంగు నూనెలోకి దిగి, నూనె చిక్కటి నలుపు రంగులోకి మారుతుంది.

3. మరిగించిన నూనెను స్టవ్ ఆపి పక్కన పెట్టండి. ఈ మిశ్రమాన్ని కనీసం 24 గంటల పాటు అదే ఇనుప బాణలిలో ఉంచాలి. దీని వల్ల ఐరన్‌ లోని గుణాలు నూనెకు పట్టి, అది సహజ డైగా మారుతుంది. మరుసటి రోజు ఈ నూనెను వడకట్టి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి.

Also Read: మందులతో పాటు ఈ 8 ఆహారాలు తీసుకుంటే.. షుగర్ లెవల్స్ మీ చేతుల్లోనే!

ఎలా ఉపయోగించాలి ?
ఈ నల్లటి నూనెను మీ జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించండి. ముఖ్యంగా తెల్ల జుట్టు ఉన్న చోట ఎక్కువ సేపు మసాజ్ చేయండి. దీనిని రాత్రంతా జుట్టుకు ఉంచుకుంటే ఫలితం ఇంకా బాగుంటుంది. మరుసటి రోజు ఉదయం కెమికల్స్ లేని కుంకుడు కాయలు లేదా మైల్డ్ షాంపూతో తల స్నానం చేయండి.

 డై వల్ల కలిగే ప్రయోజనాలు:
ఉసిరికాయలో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు మెలనిన్ ఉత్పత్తిని పెంచి జుట్టును సహజంగా నల్లగా మారుస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలడం తగ్గుతుంది. ఇది జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. ఉసిరికాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఇది జుట్టుకు మంచి మెరుపును, మృదుత్వాన్ని ఇస్తుంది. అంతే కాకుండా ఇది తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఇది కెమికల్ డై లాగా మొదటి వాడకంలోనే పూర్తి నలుపు ఇవ్వకపోవచ్చు. కానీ క్రమంగా వారానికి రెండుసార్లు చొప్పున ఒక నెల పాటు వాడితే.. మీ తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారడం మీరు గమనించవచ్చు.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×