E-Paper
Advertisement

Garlic Rice Recipe: మిగిలిపోయిన అన్నంతో గార్లిక్ ఫ్రైడ్ రైస్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపించే రుచి!

Garlic Rice Recipe: మిగిలిపోయిన అన్నంతో గార్లిక్ ఫ్రైడ్ రైస్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపించే రుచి!
Advertisement

Garlic Rice Recipe: సాధారణంగా ఆహారం విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన ఇష్టం ఉంటుంది. కొందరు స్పైసీ ఫుడ్స్‌ను ఇష్టపడితే.. మరికొందరు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీలను ఇష్టపడుతుంటారు. మరికొందరు రోజూ బిర్యానీలు తినాలనుకుంటుంటే.. ఇంకొందరు వెజ్‌లోనే డిఫ్రెంట్ రెసిపీలను కోరుకుంటుంటారు. ఈ క్రమంలో ఇంట్లోనే.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో కేవలం 10 నిమిషాల్లో రెడీ చేసుకోగల ‘గార్లిక్ ఫ్రైడ్ రైస్’ను సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.

గార్లిక్ రైస్‌ తయారీకి ఎలాంటి ఘాటైన మసాలాలు అవసరం లేదు. మన వంటింట్లో ఉండే పదార్థాలతోనే లొట్టలేసుకుని తినేలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. వెల్లుల్లి వాసన, క్రంచీ మసాలా పౌడర్ కాంబినేషన్ ఈ రైస్‌కు అద్భుతమైన రుచిని ఇస్తాయి. ఇక దీనిని పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టపడి తినేస్తారు.

Advertisement

Also Read: ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్లీ మళ్లీ తినాలనిపించే కొబ్బరి దోశ.. పిల్లల నుంచి పెద్దల వరకు ఫేవరేట్!

ఎలా చేసుకోవాలంటే?

ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి.. అందులో మీకు కావాల్సినంత శనగపప్పు, కందిపప్పు, వేరుశనగలు, మిరియాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాలను ఇవన్నీ దోరగా వచ్చే వేపుకోవాలి. ముఖ్యంగా వెల్లుల్లిని కాస్త క్రిస్పీగా వేయించుకోవడం మర్చిపోవద్దు. ఈ పదార్థాలను మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా మిక్సీ చేసుకోవడం వల్ల, రైస్ తింటున్నప్పుడు ప్రతి ముక్కలో వెల్లుల్లి ఫ్లేవర్ తగ్గులుతుంది. అదే నూనెలో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసి, ముందే రెడీగా ఉంచుకున్న మసాలా పౌడర్‌ను కలిపితే ఘుమఘుమలాడే క్రిస్పీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెడీ.

Advertisement

ముఖ్యంగా గార్లిక్ రైస్ పర్ఫెక్ట్‌గా రావాలంటే.. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని.. పొడి పొడిగా చేసుకోవాలి. ఒకవేళ ముద్దలుగా ఉంటే.. చేతితో విడగొట్టుకోవాలి. అప్పుడే మీరు అనుకున్న టేస్టీగా వెల్లులి రైస్ కుదురుతుంది. రుచి విషయంలో గార్లిక్ రైస్ ఏమాత్రం బిర్యానీకి తీసిపోదు. పైగా ఈ ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లేవారికి లంచ్ బాక్సులోకి ఈ రెసిపీ చక్కగా సెట్ అయిపోతుంది. పైన చెప్పిన ఫార్మేట్‌లో ఒక్కసారి ట్రై చేసి తిని చూడండి.. టేస్ట్‌ను అస్సలు మర్చిపోరు.

Also Read: రోజూ 2 వెల్లుల్లి రెబ్బలు తింటే ఏమవుతుంది? ఈ లాభాలు తెలిస్తే వద్దన్నా తినేస్తారు!

 

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×