E-Paper
Advertisement

Coconut Dosa Recipe: ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్లీ మళ్లీ తినాలనిపించే కొబ్బరి దోశ.. పిల్లల నుంచి పెద్దల వరకు ఫేవరేట్!

Coconut Dosa Recipe: ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్లీ మళ్లీ తినాలనిపించే కొబ్బరి దోశ.. పిల్లల నుంచి పెద్దల వరకు ఫేవరేట్!
Advertisement

Coconut Dosa Recipe: ఒక్కొక్కరికి ఒక్కో రకమైన దోశలు అంటే ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో అమ్మ దోశ వేస్తుంటే.. అమ్మా నాకు కరకరలాడుతూ ఉండే దోశ కావాలి లేదా క్రిస్పీ దోశ కావాలి, ఎగ్ దోశ కావాలి.. ఇలా రకరకాలుగా ఆర్డర్స్ వేస్తుంటాం. అయితే ఈసారి కాస్త డిఫ్రెంట్‌‌గా దోశ తినాలనుకుంటే.. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా, 10 నిమిషాల్లో చేసుకునేలా ఈ కొబ్బరి దోశ బెస్ట్ ఆప్షన్. ఇది నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది. దీనినే కర్ణాటకలో కాయీ దోశ అని పిలుస్తారు. పచ్చి కొబ్బరి లోని తీపి, అటుకుల మృదుత్వం కలిసిన ఈ వంటకాన్ని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ తెగ ఇష్టంతో తినేస్తారు.

రుచితో పాటు ఆరోగ్యమూ:

ఈ పచ్చి కొబ్బరి దోశతో టేస్ట్ మాత్రమే కాదండోయ్.. ఆరోగ్యపరంగానూ ఈ దోశ ఎంతగానో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. పచ్చి కొబ్బరి దోశ సౌత్ ఇండియన్స్‌కు ఎంతో ఇష్టమైన అల్పాహారం కూడా. ఆరోగ్య పరంగా చూసుకుంటే.. ఇందులో మినప్పప్పు వాడము కాబట్టి.. చాలా తేలికగా జీర్ణమవుతుంది. అలాగే కొబ్బరి లోని మంచి కొవ్వులు శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి.

Advertisement

Also Read: సిల్వర్ స్క్రీన్ నుంచి కిచెన్ వరకూ.. ధురంధర్‌తో హిట్ అయిన ‘దూద్ సోడా’ రెసిపీ ఇదే!

కొబ్బరి దోశకు కావాల్సిన పదార్థాలు:

బియ్యం – 2 కప్పులు
పచ్చి కొబ్బరి తురుము – 1 కప్పు
అటుకులు – అర కప్పు
మెంతులు – 1 టీస్పూన్

తయారు చేసుకోండిలా:

Advertisement

మొదట బియ్యం, మెంతులను 4 – 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక అటుకులను గ్రైండ్ చేయడానికి 15 నిమిషాల ముందు నానబెడితే సరిపోతుంది. తర్వాత నానబెట్టిన బియ్యం, మెంతులు, అటుకులు, కొబ్బరి తురుము కలిపి మిక్సీలో చాలా మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని 8 గంటల పాటు లేదా రాత్రంతా పులియబెట్టాలి. ఎందుకంటే.. పిండి ఎంత బాగా పులిస్తే దోశలు అంత మెత్తగా రంధ్రాలతో వస్తాయన్నమాట. ఇక మరుసటి రోజు పిండిలో తగినంత ఉప్పు కలిపి, వేడి పెనంపై మందంగా వేసుకోవాలి. అయితే దీనిని సాధారణ దోశలా పల్చగా రుద్దకూడదు. కాస్త మందంగా వేసుకుంటే సరిపోతుంది.

పిల్లల లంచ్ బాక్సులోనూ:

అలాగే ఈ కొబ్బరి దోశను కేవలం ఒక వైపు మాత్రమే కాల్చాలి. దోశపైన మూత పెట్టి ఆవిరిపై ఉడికించడం వల్ల పైన చిన్న చిన్న రంధ్రాలు పడి దూదిలా తయారవుతుంది. ఆ తర్వాత అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ లేదా మీకు ఇష్టమైన నాన్‌వెస్ కర్రీతో కలిపి తింటే.. రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ కొబ్బరి దోశలు సాయంత్రం వరకు మెత్తగా ఉంటాయి కాబట్టి.. స్కూలుకెళ్లే పిల్లలకు లంచ్ బాక్స్‌లోనూ పెట్టొచ్చు.

Also Read: సూపర్ ఫుడ్ అడవి లింగుడా.. మీ డైట్‌లో తప్పక ఉండాల్సిన శక్తివంతమైన కూరగాయ!

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×