E-Paper
Advertisement

పుచ్చకాయ కొంటున్నారా? ఈ ‘సీక్రెట్’ తెలియకపోతే మీ డబ్బులు గోవిందే!

పుచ్చకాయ కొంటున్నారా? ఈ ‘సీక్రెట్’ తెలియకపోతే మీ డబ్బులు గోవిందే!
Advertisement

Summer Fruits: సమ్మర్ వచ్చిందంటే చాలు.. మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఎర్రటి పుచ్చకాయలే .ఇక మండే ఎండల నుండి రిలాక్స్ అవడానికి పుచ్చకాయను మించిన ఆప్షన్ లేదన్నది స్పెషల్ గా చెప్పక్కర్లేదు కూడా. అయితే బయట చూడగానే పచ్చగా నిగనిగలాడే కాయను చూసి కట్ చేస్తే లోపల తెల్లగానో, చప్పగానో ఉంటే డిసప్పాయింట్ అవడమే కాదు, ఆ షాప్ అతన్ని మనసులో తిట్టుకుంటాం కూడా. సో ఈ సారి మీరు పుచ్చకాయలని కొనడానికి వెళ్తే ఈ టిప్స్ పాటించండి. పైసా వసూల్ అనిపించుకోండి.

కింద వైపున ఒక పెద్ద మచ్చ కనిపిస్తుందా..

Advertisement

మొదటగా మీరు సరిగ్గా పుచ్చకాయను తిప్పి చూస్తే మీకు కింద వైపున ఒక పెద్ద మచ్చ కనిపిస్తుంది, దీన్నే ‘ఫీల్డ్ స్పాట్’ అంటారు.ఇది గనుక ముదురు పసుపు లేదా క్రీమ్ కలర్‌లో ఉంటే, అది తీగపైనే బాగా పండిందని అర్థం, అది తేనెలా తీయగా ఉంటుంది కూడా . ఒకవేళ ఆ మచ్చ తెల్లగా ఉంటే మాత్రం అది పచ్చిగా ఉన్నప్పుడే కోసేశారని,.అలాంటి కాయలు అస్సలు రుచిగా ఉండవు అని బండ గుర్తు పెట్టేసుకోండి. అలాగే పుచ్చకాయను చేత్తో పైకి ఎత్తి చూస్తే అది దాని సైజ్ కంటే ఎక్కువ బరువుగా అనిపించాలి. ఎంత బరువు ఉంటే అందులో అంత ఎక్కువ నీటి శాతంతో ఫ్రెష్ గా ఉందని అర్థం.

also read:మల్టీస్టారర్ అంటే ముచ్చట కాదు గురూ .. పక్కా ‘బిజినెస్ కాలిక్యులేషన్’!

Advertisement

లోపల ఖాళీగా ఉన్నట్లుగా రీ సౌండ్ వస్తే..

ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ టెస్ట్ ఏంటంటే మీ వేళ్లతో పుచ్చకాయను తట్టి చూడండి. లోపల ఖాళీగా ఉన్నట్లుగా రీ సౌండ్ వస్తే అది పర్ఫెక్ట్‌గా పండినట్లు లెక్క. అలా కాకుండా మొద్దుబారినట్టుగా సౌండ్ వస్తే అది పచ్చిగా ఉండే అవకాశం ఎక్కువ.అలాగే కాయ పైన ఉండే చారలు ముదురు ఆకుపచ్చ రంగులో క్లియర్ గా ఉండాలి.

గోధుమ రంగులో సాలీడు గూడు లాంటి గుర్తులున్నాయా..

ఇక పండుపై అక్కడక్కడా గోధుమ రంగులో సాలీడు గూడు లాంటి గుర్తులు కనిపిస్తున్నాయా? అయితే అస్సలు వదలకండి! ఎందుకంటే ఆ గుర్తులు ఎంత ఎక్కువగా ఉంటే, ఆ కాయ అంత తీయగా ఉంటుందన్న మాట .ఇక చివరిగా పుచ్చకాయ తొడిమను గమనించండి.. తొడిమ పూర్తిగా ఎండిపోయి బ్రౌన్ కలర్‌లో ఉంటే అది పండిన తర్వాతే కోశారని అర్థం. అలా కాకుండా అదే తొడిమ పచ్చగా ఉంటే మాత్రం అది ఇంకా పండడానికి చాలా సమయం ఉందని గుర్తు. సో ..చదివారుగా ఇకనైనా పుచ్చకాయ కొనడానికి వెళ్ళినపుడు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.. మీరు కొనే ప్రతి పుచ్చకాయ ఎర్రగా, తీయగా ఉండటం పక్కా !

also read;భార్యాభర్తలు ఈ విషయాలు దాచారో.. మీ కాపురం కొంపకొల్లేరే!

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×