E-Paper
Advertisement

మల్టీస్టారర్ అంటే ముచ్చట కాదు గురూ .. పక్కా ‘బిజినెస్ కాలిక్యులేషన్’!

మల్టీస్టారర్ అంటే ముచ్చట కాదు గురూ .. పక్కా ‘బిజినెస్ కాలిక్యులేషన్’!
Advertisement

Tollywood Multistarrer: ఒకప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు కనిపిస్తే వెండితెరపై కలిసి కనిపిస్తే కళ్ళప్పగించేవారు అభిమానులు. ఇక మేకర్స్ కూడా వారిని ఎంటర్ టైన్ చేయడానికి అలానే ఆడపా దడపా అలానే ప్లాన్ చేసేవారు.ఇక ఇప్పుడు కూడా అలాగే ఇద్దరు స్టార్ హీరోల కాంబోలో సినిమాల్ని తీస్తున్నారు కూడా. కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటో తెలుసా..అపుడు ఆడియన్స్ కి మేకర్స్ బిగ్ సర్ ప్రైజ్ గా ప్లాన్ చేస్తే ఇపుడు అదొక పక్కా బిజినెస్ గా ప్లాన్ చేయడం విశేషం.ఒకరకంగా ఇది ట్రెండ్ కాదు.. మార్కెట్ డిమాండ్. ఇది యాక్సిడెంటల్ కాదు.. ఆడియన్స్ అప్‌గ్రేడ్.
అవును ..వందల కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు, ఒకవేళ సినిమా తేడా కొడితే ప్రొడ్యూసర్లు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. సో… ఇక్కడ పుట్టుకొచ్చిందే ఈ తెలివైన స్ట్రాటజీ.. అదే ‘రిస్క్ షేరింగ్’.

ప్రభాస్ ఉండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఎందుకు?

Advertisement

ఈ కాలంలో అసలే భారీ బడ్జెట్లు ..ఒకడే హీరో అయితే ఫుల్ రిస్క్ .అదే మల్టీ స్టారర్ అయిందనుకోండి రిస్క్ లో ….మార్కెట్ డబుల్..హైప్ ట్రిపుల్. మీరెప్పుడైనా ఆలోచించారా ఆల్రెడీ’కల్కి 2898 AD’లో ప్రభాస్ ఉండనే ఉన్నాడు, మరి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఎందుకు? వారి ప్లేసులలో అంతగా క్రేజ్ లేని సైడ్ యాక్టర్లని క్యాస్ట్ చేయోచ్చుగా.ఎందుకంటే అది నార్త్ ఆడియన్స్‌కి ఒక ఎమోషనల్ కనెక్ట్. అలాగే ‘సలార్’లో ప్రభాస్‌కి ఫ్రెండ్ గా నీల్ సెట్ చేసింది ఎవర్ని?పృథ్వీరాజ్ సుకుమారన్ ని .. అంటే మలయాళ మార్కెట్‌ను బుట్టలో వేసుకోవడానికి వేసిన నీల్ మామ వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ అన్నమాట. ఇక్కడ ఒకే టికెట్ మీద అన్ని భాషల ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడమే ఈ స్ట్రాటజీ వెనుకున్న అసలు సీక్రెట్.

కోట్లలో ఫ్రీ పబ్లిసిటీ తెచ్చే పక్కా టెక్నిక్

Advertisement

అయితే కొన్నిసార్లు సినిమా మొత్తం ఈ స్టార్ హీరోలు ఉండక్కర్లేదు.. కేవలం ఒక ఐదు నిమిషాల ఎంట్రీ చాలు సినిమాని ఓ రేంజ్ లో పెట్టెయ్యడానికి. ‘విక్రమ్’ క్లైమాక్స్‌లో సూర్య ‘రోలెక్స్’ గా కనిపించినపుడు ,దళపతి విజయ్ లియో సినిమాలో కార్తీ ఢిల్లీ క్యారెక్టర్ వాయిస్ వినిపించినప్పుడు థియేటర్లు ఎలా దద్దరిల్లిపోయాయో కొత్తగా చెప్పక్కర్లేదు .ఇక కల్కి సినిమాలో దుల్కర్ , విజయ్ దేవరకొండలు జస్ట్ అలా మెరిసినా.. అది సోషల్ మీడియాలో పెద్ద టాపిక్ అయిపోయింది.ఇక ‘జైలర్’లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యామియోలు కనిపించేది 5 నిమిషాలే అయినా వారి ఎంట్రీలకి ఆడిటోరియం లు ఎంతలా దద్దరిల్లాయో తెలిసిందే.సోఈ గెస్ట్ రోల్స్ తో ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేయడమె కాదు ఆడియన్స్ నుండి సినిమాకి కోట్లలో ఫ్రీ పబ్లిసిటీ తెచ్చే పక్కా టెక్నిక్ అన్నమాట

also read:Dhurandhar 2 box office: దురంధర్2 ధాటికి రికార్డులన్నీ గాలిలో కలవాల్సిందేనా?

కథలో దమ్ము లేకపోతే ఫ్యాన్స్ కూడా

అయితే లాభాలే కాదండోయ్ ..అంతకు మించిన తిరకాసులు కూడా ఉన్నాయ్.కేవలం బిజినెస్ కోసమే స్టార్లను కలిపితే.. కథ కాస్తా ‘కమర్షియల్ కిచిడీ’ అయిపోయే ప్రమాదం చాలా ఉంది.ఇక కంటెంట్ లో దమ్ము లేకపోతే.. ఇద్దరు స్టార్ల ఇమేజ్ కూడా సినిమాని కాపాడలేదు మరి. ‘ఆచార్య’ సినిమానే తీసుకోండి.చిరు, చరణ్ లాంటి తండ్రీకొడుకులు కలిసినా.. కథలో దమ్ము లేకపోతే ఫ్యాన్స్ కూడా సినిమాని కాపాడలేకపోయారు.

ఒకప్పుడు సోషల్ మీడియాలో యుద్ధాలు

ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే వీళ్ళు ఒకప్పుడు సోషల్ మీడియాలో యుద్ధాలు చేసుకునే వీళ్లు.. కాని ఇప్పుడు ,..మల్టీస్టారర్ వస్తుందంటే చాలు రూట్ మారుస్తున్నారు.RRR లో ఎన్టీఆర్, చరణ్‌లను చూసినప్పుడు మనందరికీ అర్థమైంది అదే..ఇక మన శంకర వరప్రసాద్ గారు లో చిరు తో వెంకీ మామ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.సో ఇప్పుడు ఇద్దరూ కలిస్తే అది సినిమా మించిన సెలెబ్రేషన్ అన్నమాట.

ఇప్పటికే చిన్న చిన్న కథలైతే మొబైల్‌లోనే లాగించేస్తున్నారు ఆడియన్స్ . సో అలాంటి వారిని బయటికి రప్పించాలంటే.. ఆ ‘బిగ్ స్క్రీన్ మ్యాజిక్’ కావాలి.మరి అలాంటి టాప్ స్టార్స్ స్క్రీన్ మీద కలిసి కనిపిస్తే… వచ్చే ఆ కిక్కే వేరు!
అయితే ఈ కాంబోలని సరిగ్గా వాడితే రికార్డులు బద్దలవుతాయి.. లేదంటే మాత్రం బడ్జెట్లు తలకిందులవుతాయని స్పెషల్ గా చెప్పర్లేదనుకుంటా !

also read:గ్లింప్స్‌లో డేట్లు, గ్రౌండ్‌లో షూటింగ్‌లు! క్వాలిటీ పేరుతో మేకర్స్ వాయిదాల డ్రామా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×