lip care for summer: వేసవి కాలం రాగానే మనమంతా ఫేస్ గ్లో కోసం రకరకాల సన్‌స్క్రీన్‌లు, ఫేస్ వాష్‌లు వాడుతుంటాం కానీ.. పెదాల కేర్ తీసుకోవడం పూర్తిగా మర్చిపోతాం. ఎండ తీవ్రత, వేడి గాలుల వల్ల పెదవులపై ఉండే సెన్సిటివ్ చర్మం చాలా త్వరగా డీహైడ్రేట్ అయిపోతుంది. దీని వల్ల పెదాలు పగలడం, పొట్టు లేవడం, రంగు మారి నల్లబడటం వంటి సమస్యలు వస్తాయి. మరి ఈ సమ్మర్‌లో కూడా మీ లిప్స్ సాఫ్ట్‌గా, గులాబీ రంగులో మెరిసిపోవాలంటే ఎలాంటి సింపుల్ హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వాలో, ట్రెండీ లిప్ కేర్ టిప్స్ ఏంటో ఇప్పుడే చూసేద్దాం.
పెదాలు పగలడానికి, నల్లబడటానికి కారణాలు ఏంటి?
డీహైడ్రేషన్: శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు పెదాలు త్వరగా ఎండిపోతాయి.
సూర్య కిరణాలు : ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల పెదవులపై ‘మెలనిన్’ ఉత్పత్తి పెరిగి, అవి నల్లగా మారుతాయి.
పెదాలను నమకడం: చాలా మందికి పెదాలు ఎండిపోగానే నాలుకతో తడుపుకునే అలవాటు ఉంటుంది. లాలా జలంలో ఉండే ఎంజైమ్‌ల వల్ల లిప్స్ మరింత డ్రైగా మారిపోతాయి.
నల్లబడటం, పగుళ్లను తగ్గించే 5 సూపర్ హోమ్ రెమెడీస్:
1. కొబ్బరి నూనె లేదా నెయ్యి :
రాత్రి పడుకునే ముందు పెదవులపై కొద్దిగా స్వచ్ఛమైన కొబ్బరి నూనె లేదా పసరు నెయ్యి రాయండి. ఇవి పెదవులకు అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పని చేస్తాయి. పగుళ్లను తగ్గించి, పెదాలను రోజంతా సాఫ్ట్‌గా ఉంచుతాయి.
2. నిమ్మరసం, తేనె కాంబో :
నిమ్మరసంలో ఉండే విటమిన్ సి పెదాల నలుపుదనాన్ని తగ్గిస్తుంది. తేనె పెదాలను హైడ్రేట్‌గా ఉంచుతుంది.
ఎలా వాడాలి?: అర టీస్పూన్ తేనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని పెదవులపై రాసి 10-15 నిమిషాల తర్వాత కడిగేయండి. వారంలో మూడు సార్లు ఇలా చేస్తే మార్పు మీకే తెలుస్తుంది.
3. గులాబీ రేకులు, పచ్చి పాలు:
గులాబీ రేకులను పచ్చి పాలలో వేసి నూరి పేస్ట్‌లా చేయండి.ఈ పేస్ట్‌ను పెదవులపై రాసి మెల్లగా మసాజ్ చేయండి. ఇది పెదవుల నలుపును పోగొట్టి సహజమైన గులాబీ రంగు వచ్చేలా చేస్తుంది.
4. షుగర్ అండ్ ఆలివ్ ఆయిల్ స్క్రబ్:
పెదవులపై ఉండే డెడ్ స్కిన్ తొలగిపోవాలంటే వారానికి ఒకసారి స్క్రబ్ చేయడం ముఖ్యం. కొద్దిగా చక్కెరలో ఆలివ్ ఆయిల్ లేదా తేనె కలిపి పెదవులపై ఒక నిమిషం పాటు స్మూత్‌గా రుద్దండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.
5. కలబంద జిగురు:
అలోవెరాలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వేసవి వేడి నుంచి పెదాలకు ఉపశమనాన్ని ఇస్తాయి. తాజా కలబంద జెల్‌ను పెదవులపై రాయడం వల్ల ఎండ దెబ్బ తగ్గుతుంది.
సమ్మర్‌లో కచ్చితంగా పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు:
SPF ఉన్న లిప్ బామ్ వాడండి: ఎండలోకి వెళ్లేటప్పుడు నార్మల్ లిప్ బామ్ కాకుండా, SPF 15 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న లిప్ బామ్‌లను వాడటం వల్ల సూర్య కిరణాల నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది.
ఎక్కువ నీళ్లు తాగండి: బాడీ లోపల హైడ్రేటెడ్‌గా ఉంటేనే పెదాలు బయటకి అందంగా కనిపిస్తాయి. కాబట్టి రోజూ 3-4 లీటర్ల నీరు, మజ్జిగ లేదా కొబ్బరినీళ్లు తాగండి.
లిప్‌స్టిక్స్ తగ్గించండి: కెమికల్స్ ఎక్కువగా ఉండే మ్యాట్ లిప్‌స్టిక్స్ వేసవిలో పెదాలను మరింత డ్రైగా మారుస్తాయి. కాబట్టి ఆర్గానిక్ లేదా హైడ్రేటింగ్ లిప్ ప్రొడక్ట్స్ ఎంచుకోండి.
అందమైన చిరునవ్వుకు ఆరోగ్యకరమైన పెదాలే ముఖ్యం. ఈ సమ్మర్‌లో పెదాలు పగిలినా, నల్లబడినా టెన్షన్ పడకుండా మనం చెప్పుకున్న ఈ సింపుల్ హోమ్ హాక్స్‌ని మీ డైలీ స్కిన్ కేర్ రొటీన్‌లో భాగం చేసుకోండి. పెదాలను నాలుకతో తడపడం లాంటి అలవాట్లను పక్కన పెట్టండి. స్మార్ట్‌గా కేర్ తీసుకోండి. మీ పెదాలను ఎల్లప్పుడూ సాఫ్ట్‌గా, పింక్‌గా మెరిపించండి.