E-Paper
Advertisement

Furniture Cleaning: ఎంత రుద్దినా ఫర్నిచర్‌పై మరకలు పోవట్లేదా? ఈ సింపుల్ ట్రిక్స్‌ను ఓసారి ట్రై చేయండి!

Furniture Cleaning: ఎంత రుద్దినా ఫర్నిచర్‌పై మరకలు పోవట్లేదా? ఈ సింపుల్ ట్రిక్స్‌ను ఓసారి ట్రై చేయండి!
Advertisement

Furniture Cleaning: చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఫర్నిచర్‌పై రకరకాల మరకలు పడుతూనే ఉంటాయి. ఆడుకుంటున్న పిల్లల్ని ఎంత వద్దన్నా ఆగరు కాబట్టి.. కొన్నిసార్లు జిడ్డు మరకలు కూడా పడుతుంటాయి. అలాగని ఆ మరకల్ని సరిగా శుభ్రం చేయకపోతే ఫర్నిచర్‌ లుక్ పోవడమే కాకుండా.. చూడటానికి మురికిగానూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంట్లోని ఫర్నిచర్‌ను సులభమైన పద్ధతుల్లో క్లీన్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

అన్ని విధాలా పని చేస్తుంది:

డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు, గ్లాసులు పెట్టడం వలన నీటి మరకలు ఏర్పడుతుంటాయి. వీటిని సింపుల్‌గా తొలగించాలంటే టూత్‌పేస్ట్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. దీని కోసం కొద్దిగా టూత్‌పేస్టుని తీసుకుని దానిని నీటితో పలుచగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని డైనింగ్ టేబుల్‌ మీదున్న మరకల మీద రాసి కొన్ని నిమిషాల తర్వాత మెత్తని వస్త్రంతో తుడిచేయాలి. ఈ పద్ధతి కేవలం డైనింగ్ టేబుల్ మీద మాత్రమే కాదు.. కిటికీలు, తలుపులపై పడిన నీటిచుక్కల మరకల్ని తొలగించడంలోనూ పని చేస్తుంది.

నిమిషాల్లో మరక మాయం:

Advertisement

ముఖ్యంగా ఫర్నిచర్‌పై ఏర్పడే మరకలు నీటి వలనే ఏర్పడుతుంటాయి. వాటిని తొలగించడానికి ఫర్నిచర్ వ్యాక్స్‌ని ఉపయోగించవచ్చని చెబుతున్నారు నిపుణులు. దీని కోసం కొద్దిగా ఫర్నిచర్ వ్యాక్స్‌ని తీసుకొని మరకపై రాసి మెత్తని వస్త్రంతో తుడిచేస్తే సరి. అలాగే ఉడ్‌తో చేసిన ఫర్నిచర్‌పై ఏర్పడిన మరకను లిక్విడ్ బ్లీచ్‌తో పోగొట్టవచ్చు. దీనికోసం టూత్‌బ్రష్‌ను లిక్విడ్ బ్లీచ్‌లో ముంచి మరకపై నిదానంగా రుద్దాలి. కాసేపటి తర్వాత మెత్తటి పొడి వస్త్రం తీసుకుని మరకల్ని తుడిస్తే ఇట్టే పోతుందట.

ఇలా కూడా చేయొచ్చు:

* అరచెంచా వెనిగర్‌ని ఒక కప్పు చల్లటి నీటిలో కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో శుభ్రమైన వస్త్రాన్ని ముంచి మరకపై తుడిస్తే పోతుంది.
* కాస్త గోరువెచ్చని నీటిలో ఏదైనా సబ్బు కలిపి తుడిచినా ఫర్నిచర్‌పై ఉన్న మరకలు చాలావరకు పోతుందట.
* కొద్దిగా ఉప్పు, సరిపడ ఆలివ్ ఆయిల్‌ తీసుకుని ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫర్నిచర్‌పై ఉన్న మరక మీద రాసి కొంత సమయం తర్వాత తుడవాలి.
* పెట్రోలియం జెల్లీని మరకపై రాసి మరుసటి రోజు వస్త్రంతో తుడిచినా.. మరక వదిలిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

 

 

Related News

హైబ్రిడ్ ఫిట్‌నెస్ అంటే ఏంటి? స్టామినా, బలం రెండూ పెంచే కొత్త వర్కౌట్స్

ప్రేమలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా పొసిసివ్

కిచెన్‌లో మీరు చేసే ఈ 9 తప్పుల వల్లే వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు..

పిల్లలు బొటనవేలు ఎందుకు చీకు తుంటారు? ఈ అలవాటు మాన్పించేందుకు ఈజీ టిప్స్ hi

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

Big Stories

Advertisement
×