E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu: అట్టర్ ఫ్లాప్ అయిన బిగ్ బాస్ 9 తెలుగు.. దారుణంగా గ్రాండ్ ఫినాలే రేటింగ్!

Bigg Boss 9 Telugu: అట్టర్ ఫ్లాప్ అయిన బిగ్ బాస్ 9 తెలుగు.. దారుణంగా గ్రాండ్ ఫినాలే రేటింగ్!
Advertisement

Bigg Boss 9 Telugu: బుల్లి తెరపై ప్రసారమయ్యే రియాలిటీ షోలలో బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అన్ని భాషలలో కూడా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో ఈ కార్యక్రమం ఇప్పటికే 19 సీజన్లను పూర్తి చేసుకోగా , తెలుగులో 9 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల తొమ్మిదవ సీజన్ ఎంతో ఘనంగా పూర్తి అయింది. తొమ్మిదవ సీజన్లో భాగంగా కామన్ మ్యాన్ క్యాటగిరిలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల విజేతగా బయటకు వచ్చారు. తనూజ రన్నర్ గా నిలిచారు. ఈసారి ఈ కార్యక్రమాన్ని సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

విజేతగా నిలిచిన కామన్ మ్యాన్..

డబుల్ ఎంటర్టైన్మెంట్ డబుల్ హౌస్ అంటూ ఈ రియాలిటీ షో పట్ల భారీగా అంచనాలు పెంచారు. ఇక కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం అగ్నిపరీక్ష అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడంతో ఈసారి బిగ్ బాస్ సీజన్ మరో లెవెల్ లో ఉంటుందని అందరూ భావించారు కానీ ఎప్పటిలాగే ఈసారి కూడా ఈ కార్యక్రమం అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిందని చెప్పాలి. డిసెంబర్ 21వ తేదీ ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఎంతో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేసినప్పటికీ దారుణమైన రేటింగ్ సొంతం చేసుకుందని చెప్పాలి.

దారుణమైన రేటింగ్స్..

Advertisement

బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలే రేటింగ్ విషయానికి వస్తే ఈ కార్యక్రమం అర్బన్ ఏరియాలో కేవలం 6.14 రేటింగ్స్ సొంతం చేసుకుంది. ఇక అర్బన్+ రూరల్ ఏరియాలో కలిపి 3.06 రేటింగ్ కైవసం చేసుకుందని తెలుస్తోంది. ఇదివరకు ఏ సీజన్లో కూడా లేనివిధంగా ఈ సీజన్ అత్యంత తక్కువ రేటింగ్ సొంతం చేసుకోవడంతో ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ గా ముగిసిందనే చెప్పాలి. ఇక ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్లు కూడా ప్రేక్షకులకు ఎక్కువ భాగం తెలియని వారే ఉండటం గమనార్హం. ఇలా ప్రతి సీజన్ కు సరికొత్తగా ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నప్పటికీ ప్రేక్షకులలో మాత్రం అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేకపోతోంది.

హోస్ట్ గా నాగార్జున…

Advertisement

ఇక బిగ్ బాస్ 9 పూర్తి కావడంతో మరికొద్ది నెలలలో సీజన్ 10 కి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమ మూడవ సీజన్ నుంచి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. నాగార్జున ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించడం కూడా ఈ షో కి కాస్త మైనస్ అనే వాదన కూడా వినపడుతూనే ఉంది. మరి సీజన్ 9కు వచ్చిన రేటింగ్ దృష్టిలో పెట్టుకొని తదుపరి సీజన్ కు ఏదైనా మార్పులు చేస్తారా? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Madhavi Latha: సాయిబాబా దేవుడే కాదు.. మాధవీ లత వ్యాఖ్యలపై రాజుకున్న రగడ

Related News

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Big Stories

Advertisement
×