Vastu Tips For Money: హిందూ సంప్రదాయంల డబ్బు.. లక్ష్మీదేవి ఆశీర్వాదం, శుభ సంకేతాలు, సానుకూల శక్తితో ముడిపడి ఉంటుంది. వాస్తు శాస్త్రం ఏ రోజులలో డబ్బు ఇతరులకు ఇవ్వాలి, ఏ రోజులలో ఇవ్వకూడదు అనే దానిపై కూడా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. ప్రతి రోజు దాని స్వంత శక్తిని కలిగి ఉంటుంది. ఇది మన ఆర్థిక నిర్ణయాలు, డబ్బును ప్రభావితం చేస్తుంది. వాస్తు ప్రకారం.. డబ్బు లావాదేవీలు చేయడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. అయితే కొన్ని రోజులలో చేసే లావాదేవీలు లక్ష్మీదేవి అసంతృప్తికి కారణమవుతాయి. కాబట్టి.. డబ్బు సంబంధిత పనులకు ఏ రోజుల్లో చేస్తే మంచిది అనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్థిక లావాదేవీలకు ఏవి మంచి రోజులు ?
వాస్తు శాస్త్రం ప్రకారం.. సోమవారం, గురువారం , శుక్రవారం ఆర్థిక లావాదేవీలకు చాలా శుభప్రదమైనవి. శుక్రవారం లక్ష్మీదేవి, శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉండటం వల్ల దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. శుక్రుడు సంపద, సౌకర్యం, ఆర్థిక బలాన్ని సూచిస్తుంది. అందుకే.. శుక్రవారం నిర్వహించే ఆర్థిక లావాదేవీలు ఒకరి ఆర్థిక పరిస్థితిని స్థిరీకరించడానికి, బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
సోమవారం శివుడికి, గురువారం విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రెండు రోజుల్లో చేసే లావాదేవీలు శుభ ఫలితాలను ఇస్తాయి. అంతే కాకుండా ఆర్థిక అడ్డంకులను తొలగించడానికి కూడా ఇవి సహాయ పడతాయి.
ఈ రోజుల్లో డబ్బు లావాదేవీలు చేయడం మానుకోండి:
వాస్తు ప్రకారం.. శనివారం ఎవ్వరికీ డబ్బు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు.ఈ రోజు కర్మ, న్యాయ దేవుడిగా పరిగణించబడే శని దేవుడితో ముడిపడి ఉంది. శనివారాల్లో ఆర్థిక లావాదేవీలు ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. ఇంకా.. మంగళవారం నాడు అప్పుగా ఇవ్వడం లేదా అప్పుగా తీసుకోవడం కూడా నివారించాలి. ఎందుకంటే ఈ రోజున అప్పుగా ఇచ్చిన డబ్బు ఎక్కువ కాలం అయిన కూడా మీకు తిరిగి ఇవ్వరు.
Also Read: ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ పోవాలంటే.. ఇలా చేయండి
తేదీలను కూడా గుర్తుంచుకోండి:
కొన్ని రోజులతో పాటు.. కొన్ని తేదీలను కూడా ఆర్థిక లావాదేవీలకు అశుభకరమైనవిగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. అమావాస్య రోజున డబ్బు ఇవ్వడం తీసుకోవడం చేయకూడదు. ఈ తేదీన ఆర్థిక లావాదేవీలు ప్రతికూల శక్తిని పెంచుతాయని అంతే కాకుండా ఆర్థిక అస్థిరతకు కారణమవుతాయని నమ్ముతారు.