E-Paper
Advertisement

ఫ్రిజ్ లేదా? నో ప్రాబ్లం! ఈ సింపుల్ ట్రిక్స్‌తో కూరగాయలు వారమైనా ఫ్రెష్‌

ఫ్రిజ్ లేదా? నో ప్రాబ్లం! ఈ సింపుల్ ట్రిక్స్‌తో కూరగాయలు వారమైనా ఫ్రెష్‌
Advertisement

Store vegetables without fridge: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ ఉండటం సర్వసాధారణం అయిపోయింది. కూరగాయలు తేగానే వాటిని నేరుగా ఫ్రిజ్‌లో పడేస్తుంటాం. అయితే.. తరచూ పవర్ కట్స్ అవ్వడం వల్లనో, లేదా ఫ్రిజ్‌లో స్థలం లేకపోవడం వల్లనో కూరగాయలు త్వరగా కుళ్ళిపోతుంటాయి. పైగా కొన్ని రకాల కూరగాయలను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటిలోని పోషకాలు నశిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఫ్రిజ్ లేకుండానే కూరగాయలను వారం రోజుల పాటు తాజాగా.. కుళ్ళిపోకుండా నిల్వ చేసుకోవడం ఎలా? మన అమ్మమ్మల కాలం నాటి కొన్ని అద్భుతమైన, సులభమైన చిట్కాలు మీకోసం!

ఫ్రిజ్ లేకుండానే తాజాగా ఉంచుకునే 5 బెస్ట్ హ్యాక్స్:

Advertisement

1. ఆకుకూరలకు తడి కాటన్ క్లాత్ చిట్కా:
తోటకూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు కొన్న కొన్ని గంటలకే వాడిపోతాయి. వీటికి తేమ చాలా అవసరం, అలాగని ఎక్కువ నీరు ఉంటే కుళ్ళిపోతాయి.

చేయాల్సిన పని: ఆకుకూరల వేర్లను కట్ చేసి, పండిపోయిన ఆకులను ఏరివేయండి. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ నీటిలో తడిపి, బాగా పిండేయాలి. ఈ తడి గుడ్డలో ఆకుకూరలను చుట్టి గాలి ఆడే బుట్టలో ఉంచితే రెండు మూడు రోజుల వరకు అస్సలు వాడిపోవు. మధ్యమధ్యలో క్లాత్ పై కొద్దిగా నీళ్లు చల్లుతుండాలి.

Advertisement

2. టమాటోలను బోర్లా పెట్టండి:
చాలా మంది చేసే తప్పు టమాటోలను ప్లాస్టిక్ కవర్లలో ఉంచడం. దీనివల్ల అవి త్వరగా కుళ్ళిపోతాయి. టమాటోలు ఎక్కువ రోజులు గట్టిగా ఉండాలంటే వాటిని నిల్వ చేసే పద్ధతి మార్చాలి.

చేయాల్సిన పని: టమాటోల తొడిమఉండే భాగాన్ని కిందికి వచ్చేలా (బోర్లా) ఒక ప్లేట్‌లో పెట్టండి. ఇలా చేయడం వల్ల తొడిమ ద్వారా తేమ బయటకు పోకుండా ఉంటుంది. అలాగే గాలి చొరబడకుండా బాక్టీరియా చేరకుండా ఉంటుంది. వీటిని నేరుగా ఎండపడని చల్లని ప్రదేశంలో ఉంచాలి.

3. ఉల్లిపాయలు, బంగాళాదుంపలను కలిపి పెట్టొద్దు!
చాలా ఇళ్లలో ఉల్లిపాయలు, ఆలుగడ్డలను ఒకే బుట్టలో వేసి ఉంచుతారు. కానీ ఇది తప్పు. బంగాళాదుంపల నుండి ఒక రకమైన గ్యాస్ (ఇథిలీన్) విడుదలవుతుంది. ఇది ఉల్లిపాయలు త్వరగా కుళ్ళిపోయేలా లేదా మొలకలు వచ్చేలా చేస్తుంది.

చేయాల్సిన పని: ఉల్లిపాయలు, వెల్లుల్లిని బాగా గాలి ఆడే జనపనార సంచులు లేదా రంధ్రాలున్న బుట్టల్లో విడివిడిగా ఉంచాలి. బంగాళాదుంపలను చీకటిగా, చల్లగా ఉండే చోట ఉంచాలి. వీటికి అస్సలు సూర్యరశ్మి తగలకూడదు.

4. పచ్చిమిర్చి తొడిమలు తీసేయండి:
పచ్చిమిర్చి మార్కెట్ నుండి తెచ్చిన రెండు రోజులకే నల్లగా మారిపోతుంటుంది. దీనికి ప్రధాన కారణం దాని తొడిమలే.

చేయాల్సిన పని: పచ్చిమిర్చిని నిల్వ చేసే ముందు వాటి తొడిమలను (కాడలను) పూర్తిగా వలిచేయాలి. ఆ తర్వాత ఒక కాగితం (న్యూస్ పేపర్ లేదా టిష్యూ పేపర్) లో చుట్టి గాలి ఆడే డబ్బాలో లేదా బుట్టలో ఉంచితే వారం పైనే తాజాగా ఉంటాయి. కాగితం తేమను పీల్చుకుని మిర్చి పాడవ్వకుండా చూస్తుంది.

5. మట్టి కుండ లేదా ఇసుక పద్ధతి :
పూర్వ కాలంలో ఫ్రిజ్‌లు లేనప్పుడు కూరగాయలను చల్లగా ఉంచడానికి ఈ పద్ధతిని వాడేవారు. ఇది ఎండకాలంలో చాలా బాగా పని చేస్తుంది.

చేయాల్సిన పని: ఒక వెడల్పాటి మట్టి పాత్ర లేదా పళ్ళెంలో కాస్త ఇసుక పోసి, దానిని నీటితో తడపాలి. ఆ తడి ఇసుకపై క్యారెట్లు, బెండకాయలు, వంకాయలు, సొరకాయ వంటి కూరగాయలను ఉంచాలి. ఇసుకలోని చల్లదనం వల్ల కూరగాయలు అప్పుడే తోట నుంచి తెచ్చినట్లు తాజాగా ఉంటాయి.

కూరగాయలను నిల్వ చేయడానికి ప్లాస్టిక్ కవర్లను అస్సలు వాడకండి. ప్లాస్టిక్ వల్ల లోపల వేడి పుట్టి కూరగాయలు త్వరగా కుళ్ళిపోతాయి. ఎప్పుడైనా సరే గాలి ఆడే గంపలు, జనపనార సంచులు లేదా కాటన్ బ్యాగులను మాత్రమే ఉపయోగించండి. ఈ సహజమైన చిట్కాలను పాటించడం ద్వారా కూరగాయలు తాజాగా ఉండటమే కాకుండా..  కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది. ఆరోగ్యం, పొదుపు రెండూ కూడా మీ సొంతమవుతాయి.

Related News

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

ఇంట్లో కత్తి మొద్దుబారిపోయిందా? పదును పెంచడానికి న్యూస్‌పేపర్‌ ఉంటే చాలు.. ఎలాగంటే

Big Stories

Advertisement
×