E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్ ను చంపేస్తానన్న రేఖ 

Brahmamudi Serial Today Episode May 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్ ను చంపేస్తానన్న రేఖ 
Advertisement

Brahmamudi serial today Episode: లక్కీ కోపంగా రాజు దగ్గరకు వెళ్లి చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా..? అంటూ ఫైర్‌ అవుతుంటాడు. నేను ఐశ్వర్యకు డబ్బులిచ్చి దగ్గర అవ్వాలనుకుంటే.. నాకన్నా ముందే నువ్వు వెళ్లి ఆ ఇంట్లో సెటల్‌ అయిపోయావా..? అంటూ తిడుతుంటే.. అరేయ్‌ మామ ఇప్పుడు నేను వెళ్లాను. తర్వాత టైం చూసి నిన్ను ఆ ఇంట్లోకి తీసుకెళ్తాను. అప్పుడు ఐశ్వర్యతో సినిమాకు వెళ్లి లైన్‌లో పెట్టుకోవచ్చు. అంటూ రాజు చెప్పగానే.. లక్కీ హ్యాపీగా ఫీలవుతాడు. నాకు ఈ ఆలోచనే రాలేదు మావ అంటూ వెళ్లిపోతాడు.

అప్పుడే రాజుకు డాక్టర్‌ ఫోన్‌ చేసి బిల్స్‌ ఇంకా పే చేయలేదు.. ఎప్పుడు పే చేస్తారు అని అడగ్గానే.. రాజు నాకు రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదు వచ్చాక పే చేస్తాను అని చెప్పగానే.. డాక్టర్‌ అంటే ఈరోజు చేస్తారా..? అని అడుగుతాడు. అంటే అది కొంచెం టైం పడుతుందని రాజు చెప్పగానే.. డాక్టర్‌ ఐసీయూలో ఉన్న పేషెంట్‌కు ట్రీట్‌మెంట్ చేయాలంటే డబ్బులు కట్టకపోతే ఎలా చెప్పండి అని డాక్టర్‌ చెప్పగానే.. రాజు అదేం లేదు డాక్టర్‌ ఒక వన్‌ వీక్‌లో కట్టేస్తాను అనగానే.. వన్‌ వీక్‌లో డబ్బులు కట్టకపోతే పేషెంట్‌కు ట్రీట్‌మెంట్‌ ఆపేస్తాను.. మీరు పేషెంట్‌ను తీసుకుని వెళ్లాల్సి వస్తుంది అంటూ కాల్ కట్‌ చేయడగానే. రాజు ఆలోచనలో పడిపోతాడు.

Advertisement

శృతి దగ్గర నుంచి ఇంటికి వెళ్లిన అపర్ణ కోపంగా రేఖను పిలుస్తుంది. దీంతో రేఖ కోపంగా ఎందుకు అంతలా అరుస్తున్నావు అనగానే.. అపర్ణ కోపంగా నువ్వు చేస్తున్నదేంటి..? అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు.. అని అడగ్గానే.. రేఖ ఏంటి నీ మనవరాలికి పెళ్లి అయిపోగానే.. నోరు లేస్తుంది అనగానే.. అపర్ణ మరింత కోపంగా నువ్వు చేస్తున్న పనులకు పట్టరాని కోపం వస్తుంది. నువ్వు చేస్తున్న పనులకు చెప్పే వాళ్లు లేరని అడ్డూ అదుపు లేకుండా పోయింది అంటూ తిడుతుంటే.. రేఖ కోపంగా అసలు ఇప్పుడు ఏమైంది..? అని అడగ్గానే.. అపర్ణ కోపంగా ఇప్పటి వరకు కంపెనీలోని ఎంప్లాయిస్‌కు శాలరీ ఎందుకు ఇవ్వలేదు అంటూ అడగ్గానే.. అందరూ షాక్‌ అవుతారు. రేఖ ఉలిక్కిపడి లేస్తుంది. భూషణ్‌ భయంగా మనసులో విషయం తెలిసిపోయిందా..? అనుకుంటాడు.

ఇంతలో ఇందు వచ్చి నాన్నమ్మ ఏంటి నువ్వు అనేది.. కంపెనీ ఎంప్లాయిస్‌కు ఇంకా జీతాలు ఇవ్వలేదా అంటూ అడగ్గానే.. అవును అంటుంది అపర్ణ దీంతో ఆ విషయం నీకెలా తెలుసు అని సుభాష్‌ అడగ్గానే.. ఇందాక మన ఆఫీసు ఎంప్లాయి కలిసి చెప్పారు.. అసలు కంపెనీ మా చేతుల్లో ఉన్నప్పుడు ఏ విషయంలో ఉద్యోగులను ఇబ్బంది పెట్టిందే లేదు.. నువ్వెందుకు జీతాలు వెయ్యలేదు.. ఫస్ట్‌కే వేయాలి కదా… అంటూ అపర్ణ నిలదీస్తుంది.  దీంతో రేఖ ఆ డబ్బులు నా అవసరాల కోసం వాడుకోలేదు.. మీరు ఈ ఆవేశం తగ్గించుకుంటే మీకే కాదు మీ భర్తకు కూడా చాలా మంచిది అంటూ రేఖ వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ఇందు అపర్ణను తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత అపర్ణ, ఇందు, సుభాష్‌ రూంలో కూర్చుని ఆఫీసు విషయాలు గురించి మాట్లాడుకుంటారు. శాలరీ టైంకు ఇవ్వకపోతే మిడిల్‌ క్లాస్‌ వాళ్ల జీవితాలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అంటూ అపర్ణ ఎమోషనల్ అవుతుంది. నీ కళ్ల ముందు ఇదంతా జరుగుతున్నా చూస్తూ ఉండిపోయావు.. అదే నీ స్థానంలో మీ అమ్మ ఉండి ఉంటే నీలాగా మౌనంగా ఉండేది కాదు. కంపెనీ బాధ్యతలు చేపట్టేది. ఆ రేఖను ఎదిరించేది.. తనను నమ్ముకున్న వాళ్లకు అండగా నిలబడేది అంటూ అపర్ణ చెప్తుంటే.. ఇందు మాత్రం నువ్వు చెప్తుంటే.. మా అమ్మ చేసి ఉండేదేమో కానీ నేను చేయలేను నాన్నమ్మ అని చెప్పగానే..

అపర్ణ ఎందుకు చేయలేవు.. మీ అమ్మ లాగే నీకు తెగువ, ధైర్యం ఉన్నాయి. మీ అమ్మలాగే కంపెనీని హ్యాండిల్ చేసేంత నాలెడ్జ్‌ కూడా నీకు ఉంది. కానీ భయం అనే తెర నిన్ను కమ్ముకుంది. ఒక్కసారి ఆ తెర తీసి చూడు. నీ శక్తి సామార్థ్యాలు నీకు తెలుస్తాయి. ఆ రేఖకు భయపడి కంపెనీని అధఃపాతాళానికి తీసుకెళ్తావో లేదా కంపెనీని అభివృద్ది పథంలోకి తీసుకెళ్తావో నువ్వే ఆలోచించుకో.. నీ చేతుల్లోనే నీ భవిష్యత్తు, కంపెనీ భవిష్యత్తు, ఎంతో మంది జీవితాల భవిష్యత్తు ఉంది అది గుర్తు పెట్టుకుని ఆలోచించుకో అంటూ అపర్ణ తన మాటలతో ఇందును మోటివేట్‌ చేస్తుంది. ఇందు ఆలోచిస్తుంది.

చలపతి రాజు గురించి ఆలోచిస్తూ.. బాధపడుతుంటే.. లక్ష్మీ వచ్చి ఓదారుస్తుంది. చలపతి మాత్రం నన్ను ఓదారుస్తున్నావు కానీ నీకు బాధ లేదా..? అని అడగ్గానే.. ఎందుకు లేదు ఉంది కానీ మనం బాధపడుతూ ఉంటే ఎలా అంటూ చెప్పగానే.. ఎలాగైనా వాడిని ఆ రేఖ కంట పడకుండా కాపాడుకోవాలి అని డిసైడ్‌ అవుతారు.

మరోవైపు రాజు మాత్రం ఏవేవో లెక్కలు వేస్తుంటాడు. అప్పుడు వచ్చిన ఇందుతో ఇదిగో ఈ రెండు రోజుల నా పేమెంట్‌ లెక్కలు సరి చూసుకుని నాకు డబ్బులు ఇవ్వు అని అడగ్గానే.. ఎంతివ్వాలి అని ఇందు అడిగితే మొత్తం ఇరవై వేలు అంటూ రాజు చెప్పగానే.. ఇందు మాత్రం లేనిపోని పెనాల్టీలు చెప్పి రాజుకు డబ్బులు ఇవ్వనని మెలిక పెడుతుంది. దీంతో రాజు షాక్‌ అవుతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Big Stories

Advertisement
×