E-Paper
Advertisement

జుట్టు రాలడం ఆగడం లేదా? అవిసె గింజలు ఇలా వాడితే రిజల్ట్ పక్కా

జుట్టు రాలడం ఆగడం లేదా? అవిసె గింజలు ఇలా వాడితే  రిజల్ట్ పక్కా
Advertisement

Flaxseeds for Hair: మారిన లైఫ్ స్టైల్ , కాలుష్యం వల్ల జుట్టు పలచబడటం, చిట్లిపోవడం వంటి సమస్యలు చాలా మందికి ఎదురవుతున్నాయి. మార్కెట్లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ కంటే.. మన వంటింట్లో ఉండే అవిసె గింజలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టును వేగంగా పెరిగేలా చేస్తాయి. మరి ఈ చిన్న గింజలను జుట్టు మందం , పెరుగుదల కోసం ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం.

అవిసె గింజలు కేవలం ఆరోగ్యానికే కాదు, సౌందర్యానికి కూడా నిధి వంటివి. వీటిలో ఉండే ‘ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్’ కుదుళ్లకు తగినంత తేమను అందించి జుట్టు రాలకుండా కాపాడుతుంది. జుట్టు పెరుగుదల కోసం అవిసె గింజలను 3 రకాలుగా ఉపయోగించవచ్చు.

Advertisement

1. అవిసె గింజల హెయిర్ జెల్ :
ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతి. ఇది జుట్టుకు సహజమైన కండిషనర్‌గా పని చేస్తుంది.

తయారీ: ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లు పోసి, అందులో అర కప్పు అవిసె గింజలు వేయండి. మంటను మీడియంలో ఉంచి నీటిని మరిగించండి. నీరు తెల్లటి నురగతో జిగటగా (జెల్ లాగా) మారడం మొదలవ్వగానే స్టవ్ ఆఫ్ చేయండి.

Advertisement

వాడకం: ఆ వేడి మిశ్రమాన్ని ఒక పలచని గుడ్డలో వేసి వడకట్టండి. ఈ జెల్ చల్లారాక, జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు రాయండి. రెండు గంటల తర్వాత సాధారణ షాంపూతో కడిగేయండి. ఇది జుట్టుకు మంచి షైనింగ్ ఇవ్వడమే కాకుండా.. చిట్లిపోకుండా చూస్తుంది.

2. అవిసె గింజల నూనె మసాజ్:
మార్కెట్లో స్వచ్ఛమైన అవిసె గింజల నూనె దొరుకుతుంది. దీన్ని నేరుగా జుట్టుకు పట్టించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వారానికి రెండుసార్లు ఈ నూనెను గోరు వెచ్చగా చేసి తలకు మసాజ్ చేయండి. అరగంట తర్వాత స్నానం చేయండి. ఇది జుట్టు కుదుళ్లకు పోషణనిచ్చి కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది.

3. ఆహారంలో భాగంగా :
జుట్టు బయట నుంచి ఎంత సంరక్షణ తీసుకున్నామో.. లోపలి నుంచి కూడా అంతే పోషణ అందాలి. రోజూ ఒక స్పూన్ వేయించిన అవిసె గింజల పొడిని పెరుగులో లేదా స్మూతీస్‌లో కలుపుకుని తినండి. దీనివల్ల జుట్టుకు అవసరమైన ప్రోటీన్, విటమిన్ ఇ అందుతాయి. ఇది జుట్టు మందంగా పెరగడానికి సహాయపడుతుంది.

Also Read: వేసవిలో కెమికల్ సన్‌స్క్రీన్‌లు ఎందుకు? ప్రకృతి ఇచ్చిన ఈ ‘గంధం’ చిట్కా ట్రై చేయండి!

ఎందుకు వాడాలి? :
జుట్టు కుదుళ్లను దృఢపరుస్తుంది: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల కుదుళ్ల బలహీనతను తొలగిస్తుంది.

చుండ్రుకు చెక్: తలలో చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. దీని వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.

జుట్టు రాలడం తగ్గిస్తుంది: ఇందులోని విటమిన్-ఇ ఫ్రీ రాడికల్స్ నుంచి జుట్టును రక్షిస్తుంది.

పీహెచ్ స్థాయిని నియంత్రిస్తుంది: తలలో సహజమైన నూనెల ఉత్పత్తిని బ్యాలెన్స్ చేస్తుంది.

అవిసె గింజలు జుట్టుకు ఒక సహజమైన సూపర్ ఫుడ్. మీరు రసాయనాలతో కూడిన హెయిర్ జెల్స్‌కు బదులుగా ఇంట్లోనే అవిసె గింజల జెల్ తయారు చేసుకుని వాడితే.. కేవలం నెల రోజుల్లోనే మీ జుట్టులో మార్పును గమనించవచ్చు. క్రమం తప్పకుండా ఈ చిట్కాలు పాటిస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×