E-Paper
Advertisement

హీరోగా పాయల్ ప్రియుడు.. ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్!

హీరోగా పాయల్ ప్రియుడు.. ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్!
Advertisement

Payal Rajput:ప్రముఖ హీరోయిన్ అందాల తార పాయల్ రాజ్ పుత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భీభత్సమైన నటనను ప్రదర్శించి యువత మనసు దోచుకుంది . అంతేకాదు బోల్డ్ గా ప్రదర్శించి కుర్ర కారు ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. ఒక సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇకపోతే నటిగా ఈమెకు ఇదే తొలి సినిమానా అంటే కాదు అనే చెప్పాలి. అంతకుముందు పంజాబీలో సినిమాలు, హిందీలో సీరియల్స్ చేసినా రాణి గుర్తింపు అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతోనే లభించింది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో తన నటనను ఏ విధంగా కనబరిచిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇటీవల మంగళవారం సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ ను తెలుగు తెరకు పరిచయం చేయనుంది.

తెలుగు తెరకు పరిచయం కాబోతున్న పాయల్ బాయ్ ఫ్రెండ్..

ఇకపోతే ఈమె బాయ్ ఫ్రెండ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యే వారికి సౌరబ్ ధింగ్రా పరిచయం లేని పేరు. పాయల్ తో కలిసి చేసిన ఫోటోషూట్ అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది . అలాంటి ఆయన ఇప్పుడు ‘ఫస్ట్ టైం’ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. హేమంత్ ఇప్పనపల్లి కథ,దర్శకత్వంలో వస్తున్న సినిమాకి నిర్మాతగా కూడా హేమంత్ వ్యవహరిస్తున్నారు.. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు. ఈనెల 28వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పైగా ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పాయల్ రాజ్ పుత్ రానున్నట్లు సమాచారం.

Advertisement

సినిమా విశేషాలు ఇవే..

ఇక సౌరబ్ ధింగ్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమా విషయానికొస్తే.. బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సెకండ్ హీరోగా నటిస్తుండగా.. అనిక్క విక్రమన్ హీరోయిన్ గా, శివ, మైమ్ గోపి, భూపాల్ రాజు, గాయత్రి గుప్తా, అన్నపూర్ణమ్మ , అజయ్ రత్నం, ఢీ పండు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. సూరజ్, శ్రీ వెంకట్ సంగీతాన్ని అందిస్తుండగా వేణు మురళీధర్ రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పాయల్ బాయ్ ఫ్రెండ్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ముఖ్యంగా తనను ఆదరించినట్లే సౌరబ్ ను కూడా ఆదరించాలని పాయల్ కోరుతోంది.

Advertisement

ALSO READ:డబ్బు కాదు నైతిక విలువలే ముఖ్యం.. కోట్ల రూపాయలను కాలదన్నిన మ్యూజిక్ డైరెక్టర్!

పాయల్ రాజ్ పుత్ సినిమా విశేషాలు..

పాయల్ రాజ్ పుత్ సినిమాల విషయానికి వస్తే.. పంజాబీ కామెడీ డ్రామా ఖుష్ ఖబ్రి , తమిళ స్పై థ్రిల్లర్ లీడర్, పంజాబీ థ్రిల్లర్ ది గ్రేట్ పంజాబ్ రాబరీ వంటి చిత్రాలతో పాటు వెంకటలచిమి, మంగళవారం సీక్వెల్ సినిమాలు లైన్లో ఉన్నాయి.

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×