E-Paper
Advertisement

ఐస్ రోలర్స్ నిజంగానే ముఖంపై రంధ్రాలను తగ్గిస్తాయా? డెర్మటాలజిస్ట్‌లు ఏమంటున్నారంటే?

ఐస్ రోలర్స్ నిజంగానే ముఖంపై రంధ్రాలను తగ్గిస్తాయా? డెర్మటాలజిస్ట్‌లు ఏమంటున్నారంటే?
Advertisement

Skin Care Tips: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఐస్ రోలర్స్, ఫ్రోజెన్ స్పూన్స్ వాడకం పెద్ద ట్రెండ్‌గా మారిపోయింది. వీటిని వాడటం వలన ముఖంపై రంధ్రాలు (Pores) తగ్గిపోయి, చర్మం మృదువుగా మారుతుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజముందో ప్రముఖ చర్మ నిపుణులు డాక్టర్ రూపికా సింగ్ సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు. ఆ వివరాల్లోకి వెళ్లిపోదాం రండి..

నిజంగానే రంధ్రాలు పోతాయా?

ఐస్ రోలర్స్ వాడటం వల్ల చర్మంపై రంధ్రాల పరిమాణం శాశ్వతంగా తగ్గిపోతుందని అనుకుంటే పొరపాటేనని డాక్టర్ రూపికా సింగ్ చెబుతున్నారు. ఐస్ ముఖానికి తగలగానే చర్మం కాస్త టైట్‌గా అయినట్లు అనిపిస్తుంది కానీ, రంధ్రాల అసలు సైజులో ఎలాంటి మార్పూ రాదు.

తాత్కాలిక మార్పు మాత్రమే:

Advertisement

ముఖంపై చల్లటి వస్తువులను ఉంచినప్పుడు అక్కడి రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల ముఖంపై ఉన్న వాపు, ఎరుపుదనం తగ్గి చర్మం తాత్కాలికంగా మృదువుగా కనిపిస్తుంది. కానీ చర్మం మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతకు రాగానే మునుపటి రూపంలోకి వచ్చేస్తుంది. నిజానికి చర్మ రంధ్రాలు తెరచుకోవడానికి, మూసుకోవడానికి అవేమీ కండరాలు కావు. వాటి పరిమాణం అనేది పూర్తిగా జన్యువులు, వయసు, జిడ్డు ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది.

Also Read: టీనేజర్లను నెమ్మదిగా కుంగదీస్తున్న ‘టెక్స్ట్ నెక్’ ముప్పు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నిపుణులు!

మేకప్ ముందు ఎందుకు వాడతారు?

Advertisement

ఐస్ రోలర్స్ వల్ల శాశ్వత ప్రయోజనం లేకపోయినా, మేకప్ వేసుకునే ముందు చాలామంది వీటిని ఉపయోగిస్తారు. ఉదయాన్నే ముఖంపై ఉండే ఉబ్బినట్లు ఉండే భావాన్ని తగ్గించి, చర్మాన్ని తాజాగా మార్చడానికి ఇవి చక్కగా పనిచేస్తాయి. దీనివల్ల మేకప్ వేసుకోవడానికి చర్మం అనువుగా మారుతుంది.

శాశ్వత పరిష్కార మార్గాలివే:

* చర్మ రంధ్రాలను, చర్మ ఆకృతిని నిజంగా మెరుగుపరుచుకోవాలంటే ఐస్ రోలర్స్ కంటే సరైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

* సాలిసిలిక్ యాసిడ్, రెటినాల్, నియాసినమైడ్ వంటివి చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేసి, కొల్లాజెన్‌ను పెంచుతాయి.

* అలాగే ఎండ నుంచి రక్షణ కోసం రోజూ సన్‌స్క్రీన్ వాడటం వల్ల చర్మ రంధ్రాలు పెద్దవి కాకుండా చూసుకోవచ్చు.

* ఐస్ ముక్కలను నేరుగా ముఖంపై ఎక్కువసేపు ఉంచితే చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి.. జాగ్రత్తగా వాడుతూ సరైన స్కిన్ కేర్ పాటించడమే ముఖ సౌందర్యానికి అసలైన రహస్యం.

Also Read: 30, 40 ఏళ్లకే గుండెపోటు.. ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు చేస్తున్న ఆ 4 ఘోరమైన తప్పులు ఇవే!

Related News

మగాళ్లు జేబులో దువ్వెన ఎందుకు పెట్టుకుంటారు? సైకాలజీ ప్రకారం వారి క్యారెక్టర్ ఎలాంటిదంటే..

దోసె పిండి కోసం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు.. 5 రకాల ఇన్‌స్టంట్ దోసె రెసిపీలు

ఆడవాళ్లకు డిప్రెషన్.. మగవాళ్లకు హార్ట్ఎటాక్ రిస్క్.. డయాబెటిస్ వెనుక ఇంత కథ ఉందా?

తప్పు జరిగితే సహించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు సూటిగా మాట్లాడుతారు

30 దాటిన ప్రతి మహిళ సప్లిమెంట్లు వాడాలా? ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే..

టిఫిన్‌ బాక్స్‌లో పిల్లలు రుచికరమైన ఆహారం కావాలంటున్నారా? 10 నిమిషాల్లో తయారు చేసే 5 టేస్టీ రెసిపీలు మీ కోసం

మొటిమలు వచ్చాయని ఆత్మవిశ్వాసం కోల్పోకండి.. పర్ఫెక్ట్ స్కిన్‌కు నిజమైన అర్థం ఇదే

ఇంట్లో చేసిన టీ రుచికరంగా లేదా? ఎక్కువ మసాలాలు లేకుండా కడక్ చాయ్ చేయడానికి సింపుల్ టిప్స్

Big Stories

Advertisement
×