E-Paper
Advertisement

Curd Facepack: పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్ వేసుకుంటే బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు

Curd Facepack: పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్ వేసుకుంటే బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు
Advertisement

జుట్టు పొడవుగా, బలంగా పెరగాలంటే ఖరీదైన ట్రీట్‌మెంట్లు అవసరం లేదు. ఇంట్లో ఉండే పెరుగుతోనే జుట్టు పొడవుగా పెంచేలా చేయవచ్చు. పెరుగు జుట్టుకు సహజ కండిషనర్‌లా పనిచేస్తూ తల చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్, ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి తల చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి రంధ్రాలను శుభ్రం చేస్తాయి. దీంతో జుట్టు వేర్లు బలపడతాయి. తలలో రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఫలితంగా కొత్త జుట్టు పెరగడానికి అవకాశం ఉంటుంది.

పెరుగు, గుడ్డు
మీ జుట్టు బలహీనంగా, పొడిగా ఉంటే ఈ మాస్క్ ఉపయోగపడుతుంది. ఒక గుడ్డును రెండు నుంచి మూడు స్పూన్ల పెరుగుతో కలిపి తలకు పట్టాలి. 30 నిమిషాల తర్వాత మృదువైన షాంపూతో కడగాలి. గుడ్డులోని ప్రోటీన్ జుట్టుకు బలం ఇస్తుంది.

Advertisement

పెరుగు, మెంతులు
జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటే మెంతులు ఉపయోగకరంగా ఉంటుంది. మెంతులను రాత్రంతా నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి. దానిని పెరుగుతో కలిపి తలకు రాసి 40 నిమిషాల తర్వాత కడగాలి. ఇది జుట్టు వేర్లను బలపరచడంలో సహాయపడుతుంది.

పెరుగు, తేనె, ఆలివ్ ఆయిల్
జుట్టు రఫ్‌గా, చిక్కులు పడుతూ ఉంటే ఈ మిశ్రమం మంచిది. రెండు స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ తేనె, కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు రాయాలి. ఇది జుట్టుకు తేమ అందించి మెత్తగా మారుస్తుంది.

Advertisement

పెరుగు, నిమ్మరసం
మీ తలలో చుండ్రు సమస్య అధికంగా ఉంటే ఈ హెయిర్ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు రాసి 20 నిమిషాల తర్వాత కడగాలి. నిమ్మలోని విటమిన్ C తల చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

Also Read: Grain ATM: ఈ ఏటీఎం నుంచి డబ్బులు రావు.. ధాన్యం, గోధుమలు వస్తాయి

పెరుగు, అలొవెరా
తలపై ఉన్న చర్మం ఇబ్బందిగా, దురదగా ఉంటే అలొవెరా అద్బుతమైన పరిష్కారం అనే చెప్పాలి. అలొవెరా జెల్‌ను పెరుగుతో కలిపి తలకు రాయాలి. 30 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది తల చర్మానికి విశ్రాంతినిస్తుంది. జుట్టును పెంచుతుంది.

ఇక్కడ చెప్పిన మాస్క్‌లను వారంలో ఒకటి లేదా రెండు సార్లు వాడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ వేసిన తర్వాత షవర్ క్యాప్ ధరించి ఉంచితే మెరుగైన ఫలితం ఉంటుంది. చాలా వేడి నీటితో కాకుండా గోరువెచ్చని లేదా చల్లని నీటితో తలస్నానం చేయడం మంచిది. అయితే ఎవరికైనా అలర్జీ ఉంటే ముందుగా చిన్న ప్రాంతంలో పరీక్షించి తర్వాతే మొత్తం తలకు రాయాలని సూచిస్తున్నారు. అలాగే తీవ్రమైన జుట్టు సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు. ఇంట్లో సులభంగా లభించే పెరుగు జుట్టు ఆరోగ్యానికి మంచి సహజ పరిష్కారంగా ఉపయోగపడుతుంది. ఖర్చు లేకుండా, రసాయనాలు లేకుండా జుట్టును బలంగా, పొడవుగా పెంచుకోవాలనుకునేవారికి ఇవి సులభమైన మార్గాలు.

Related News

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

Big Stories

Advertisement
×