E-Paper
Advertisement

Grain ATM: ఈ ఏటీఎం నుంచి డబ్బులు రావు.. ధాన్యం, గోధుమలు వస్తాయి

Grain ATM: ఈ ఏటీఎం నుంచి డబ్బులు రావు.. ధాన్యం, గోధుమలు వస్తాయి
Advertisement

దేశంలో ఆహార భద్రత కోసం కొత్త విధానం ప్రారంభమైంది. డబ్బులు తీసుకునే ఏటీఎంల మాదిరిగానే ఇప్పుడు బియ్యం, గోధుమలు కూడా యంత్రాల ద్వారా అందించాలనే ఆలోచనకు రూపం వచ్చింది. ఈ కొత్త విధానాన్ని గ్రెయిన్ ఏటీఎంగా పిలుస్తున్నారు.

గ్రెయిన్ ఏటీఎం అంటే ఏమిటి?
మనకు తెలిసిన ఏటీఎంలు డబ్బును ఇస్తాయి. అదే విధంగా గ్రెయిన్ ఏటీఎం ద్వారా రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులు బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలను పొందవచ్చు. ఈ యంత్రాలు ప్రభుత్వ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) కింద పనిచేస్తాయి. లబ్ధిదారు తన ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డును యంత్రంలో నమోదు చేస్తే, అతనికి అర్హత ఉన్న పరిమాణంలో ధాన్యం విడుదల అవుతుంది.

Advertisement

ఎక్కడ ప్రారంభమైంది?
ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా బీహార్ రాష్ట్రంలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పాట్నా నగరంలో మూడు గ్రెయిన్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో ఇవి ప్రయోగాత్మకంగా పనిచేస్తాయి. విజయవంతమైతే ఇతర జిల్లాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది.

ఎలా పనిచేస్తుంది?
లబ్ధిదారు ముందుగా యంత్రం వద్దకు వెళ్లి తన రేషన్ కార్డు లేదా ఆధార్ వివరాలు నమోదు చేస్తాడు. యంత్రం బయోమెట్రిక్ లేదా డిజిటల్ ధృవీకరణ ద్వారా వ్యక్తిని గుర్తిస్తుంది. తర్వాత అతనికి అందాల్సిన బియ్యం లేదా గోధుమ పరిమాణం స్క్రీన్‌పై కనిపిస్తుంది. అవసరమైన ఎంపికను నొక్కగానే యంత్రం కొలిచిన పరిమాణంలో ధాన్యాన్ని విడుదల చేస్తుంది. ఒక్కసారి 50 కిలోల వరకు ధాన్యం ఇవ్వగల సామర్థ్యం ఈ యంత్రాలకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Also Read: Brinjal fry: వంకాయ పొడి కూర ఎప్పుడైనా ప్రయత్నించారా? రెసిపీ ఇదిగో

ప్రస్తుతం రేషన్ షాపుల్లో కొన్నిసార్లు ఆలస్యంగా బియ్యాన్ని ఇస్తున్నారు. అది తక్కువగా ఇవ్వడం వంటివి చేస్తున్నారు. గ్రెయిన్ ఏటీఎంల ద్వారా ఈ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. యంత్రం ద్వారా కొలిచిన ధాన్యం కచ్చితమైన పరిమాణంలో అందుతుంది. అంతేకాకుండా 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఈ యంత్రాలను ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. దీంతో లబ్ధిదారులు తమకు సౌకర్యమైన సమయాల్లో ధాన్యం పొందవచ్చు.

ఈ ప్రాజెక్టు అమలులో సాంకేతిక సహకారం కూడా ఉంది. ఆధునిక డిజిటల్ వ్యవస్థలతో యంత్రాలను అనుసంధానం చేసి, లబ్ధిదారుల డేటాను నేరుగా ప్రభుత్వ సర్వర్‌లకు అనుసంధానం చేస్తారు. దీంతో పారదర్శకత పెరుగుతుంది. ఎవరు ఎంత ధాన్యం తీసుకున్నారన్న సమాచారం రికార్డ్‌లో ఉంటుంది. ఈ ఏటీఎం వల్ల కచ్చితమైన బరువులో ధాన్యం అందుతుంది. అవినీతి జరిగే అవకాశాలు తగ్గుతాయి. లబ్ధిదారులకు సమయ పరిమితి ఉండదు. రేషన్ షాపుల వద్ద క్యూలు తగ్గుతాయి పారదర్శకత పెరుగుతుంది. బీహార్‌లో ఈ ప్రయోగం విజయవంతమైతే, ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశముంది. దేశవ్యాప్తంగా రేషన్ వ్యవస్థను ఆధునికీకరించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని పరిశీలిస్తోంది.

Also read: Mutton Curry: కొత్తిమీర మటన్ ఇలా వండారంటే గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది, రెసిపీ ఇదిగో

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×