చపాతీలు, రోటీలు, బగారా రైస్, వైట్ రైస్… ఇలా దేనితో తిన్నా కూడా అదిరిపోయే కూర మష్రూమ్ మసాలా కూర. దీన్ని చాలా సులువుగా వండేయచ్చు. పిల్లలకు కూడా ఇది నచ్చుతుంది. దీన్ని ఎలా వండాలో ఇక్కడ ఇచ్చాము. దీన్ని ఫాలో అయితే చాలు… అదిరిపోయే కూర సిద్ధమైనట్టే.
మష్రూమ్ మసాలా రెసిపీకి కావలసిన పదార్థాలు:
మష్రూమ్ – 250 గ్రాములు
ఉల్లిపాయలు – రెండు
టమోటాలు – రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి – ఒకటి
కారం పొడి – ఒక టీస్పూన్
ధనియాల పొడి – ఒక టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
మిరియాల పొడి – అర టీస్పూన్
పసుపు – చిటికెడు
ఉప్పు – రుచికి సరిపడా
తాజా క్రీమ్ లేదా పాలు – 3 టేబుల్ స్పూన్లు
నూనె లేదా బటర్ – 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
Also read: Curd Facepack: పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్ వేసుకుంటే బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు
మష్రూమ్ మసాలా రెసిపీ
1. ముందుగా మష్రూమ్‌లను శుభ్రమైన నీటితో కడగాలి. ఎక్కువసేపు నీటిలో నానబెట్టకండి. తుడిచిన తర్వాత ముక్కలుగా కోయాలి.
2. ఒక కళాయిలో నూనె లేదా బటర్ వేసి వేడి చేయాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్వల్పంగా వేయించాలి.
3. తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు నెమ్మదిగా వేపాలి.
4. ఇప్పుడు టమోటా ముక్కలు లేదా పేస్ట్ వేసి బాగా కలపాలి. తరువాత పసుపు, కారం పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి.
5. నూనె పైకి కనిపించే వరకు మసాలాను వేపాలి. ఇప్పుడు కట్ చేసిన మష్రూమ్ ముక్కలు వేసి బాగా కలపాలి.
6. మొదట మష్రూమ్ నుంచి కొంత నీరు వస్తుంది. కాబట్టి మూత పెట్టి మధ్య మంటపై పది నిమిషాలు ఉడికించాలి.
7. మష్రూమ్ మెత్తగా ఉడికిన తర్వాత క్రీమ్ లేదా పాలు వేసి కలపాలి. ఇది కూరకు క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది.
8. చివరగా గరం మసాలా వేసి రెండు నుంచి మూడు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి.
9. పైన కొత్తిమీర చల్లి వేడి వేడి గా సర్వ్ చేయాలి.
Also read: Grain ATM: ఈ ఏటీఎం నుంచి డబ్బులు రావు.. ధాన్యం, గోధుమలు వస్తాయి
ఈ క్రీమీ మష్రూమ్ మసాలా రోటీ, చపాతీ, నాన్, పుల్కా లేదా వేడి అన్నంతో తింటే అదిరిపోతుంది. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకూ పెద్దలకూ ఇది బాగా నచ్చుతుంది. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో వండి చూడండి.