E-Paper
Advertisement

Homemade Skin care: జపనీయుల్లాగా మీ చర్మం మెరిసిపోవాలంటే వీటిని వాడండి చాలు

Homemade Skin care: జపనీయుల్లాగా మీ చర్మం మెరిసిపోవాలంటే వీటిని వాడండి చాలు
Advertisement

జపాన్ మహిళలను చూసుంటారు… వాళ్ల చర్మం ఎప్పుడూ మృదువుగా, మెరిసేలా కనిపిస్తుంటుంది. వాళ్లు ఏ క్రీములు వాడుతున్నారు? వారి అందం రహస్యం ఏమిటి? అని మనకి అడగాలనిపిస్తుంది. కానీ మనకెవరు జపనీయులు తెలుసు? అందుకే జపాన్‌లో ఎక్కువగా వాడే 5 సహజ స్కిన్‌కేర్ పదార్థాల గురించి ఇక్కడ చెప్పాము. ఇవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి.ఎంతో మంది వాడడం మొదలుపెట్టారు.

మాచా పొడి
మాచా గురించి మీరు వినే ఉంటారు. మాచా అంటే గ్రీన్ టీ పొడి. ఇది కేవలం తాగడానికి మాత్రమే కాదు చర్మానికి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాలుష్యం నుంచి కాపాడతాయి. మొటిమలు, ఎర్రదనం, దద్దుర్లు తగ్గించడంలో సహాయపడతాయి. మాచా ఉన్న ఫేస్ ప్యాక్‌లు, క్రీములు ఇప్పుడు మార్కెట్‌లో విరివిగా దొరుకుతున్నాయి. వాటిని వాడేందుకు ప్రయత్నించండి.

Advertisement

రైస్ వాటర్
ప్రతి ఇంట్లోనూ రైస్ వాటర్ ఉంటుంది… అంటే బియ్యం కడిగిన నీరు. ఇది చాలా పాత చిట్కానే. కానీ పాటిస్తున్న వాళ్లు చాలా తక్కువ. జపాన్ మహిళలు చాలా కాలంగా దీనిని వాడుతున్నారు. బియ్యం నీటిలో ఉండే పోషకాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. చర్మం ప్రకాశవంతంగా కనిపించడానికి సహాయపడతాయి. ఇప్పుడు ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ కూడా వాడుతున్నారు. ఇది చర్మానికి ఇంకా మెరుపునిస్తుంది అంటున్నారు నిపుణులు.

Also read: Conch for Vastu: ఇంట్లో శంఖం ఉంటే ఎన్ని శుభఫలితాలో.. ఆ కష్టాలన్నీ దూరం

Advertisement

కమెల్లియా ఆయిల్
ఇది ఒక ప్రత్యేక పువ్వు విత్తనాల నుంచి తీసే నూనె. ఈ ఆయిల్ తేలికగా ఉంటుంది. చర్మంలోకి త్వరగా జీర్ణమవుతుంది. ముఖం పై అతుక్కుపోయిన భావం లేకుండా మాయిశ్చరైజ్ చేస్తుంది. పొడి చర్మం ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరం. ఇది ఆన్ లైన్లో అమ్మకానికి ఉంటుంది. కావాలంటే కొనుక్కోవచ్చు.

యుజు
ఇది జపాన్‌లో దొరికే ఒక సిట్రస్ పండు. నిమ్మకాయలాంటిదే కానీ ఇందులో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం మెరుస్తూ ఉండేందుకు సహాయపడుతుంది. డార్క్ స్పాట్స్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. యుజు ఉన్న టోనర్లు, సిరమ్స్ ఇప్పుడు బ్యూటీ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Also read: Egg Pakoda: క్రిస్పీగా మూడు గుడ్లతో ఎగ్ పకోడా ఇలా చేసేయండి, రెసిపీ ఇదిగో

సాకురా
సాకురా అంటే చెర్రీ బ్లాసమ్ పువ్వు. ఇది జపాన్‌కు ప్రత్యేకమైన పుష్పం. సాకురా ఎక్స్ట్రాక్ట్ చర్మాన్ని శాంతింపజేస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది మంచిది. చర్మం కాంతివంతంగా కనిపించేందుకు కూడా సహాయపడుతుంది.

జపాన్ స్కిన్‌కేర్‌లో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎక్కువ కాస్మోటిక్స్ వాడడం కాదు.. సహజ పదార్థాలను వాడడం. చర్మాన్ని గట్టిగా రుద్దడం, ఎక్కువ కెమికల్స్ వాడడం వాళ్లు చేయరు. బదులుగా చర్మానికి తేమను ఇచ్చే పదార్థాలను ఎంచుకుంటారు. ఇప్పుడీ జపనీస్ బ్యూటీ టిప్స్ మనదేశంలో కూడా ట్రెండ్ అవుతున్నాయి. చాలా బ్రాండ్లు తమ క్రీములు, సిరమ్స్‌లో ఈ పదార్థాలను కలుపుతున్నారు. అందంగా కనిపించడానికి ఖరీదైన ట్రీట్మెంట్లు అవసరం లేకపోవచ్చు. ఇంట్లో దొరికే పదార్థాలతోనే చర్మాన్ని మెరిపించుకోవచ్చు.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×