E-Paper
Advertisement

Jonna Guggillu: డయాబెటిస్ పేషెంట్లకు వరం ఈ జొన్న గుగ్గిళ్లు.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపించే రుచి!

Jonna Guggillu: డయాబెటిస్ పేషెంట్లకు వరం ఈ జొన్న గుగ్గిళ్లు.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపించే రుచి!
Advertisement

Jonna Guggillu: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో డయాబెటిస్, అధిక బరువు అనేవి సర్వసాధారణ సమస్యలుగా మారిపోయాయి. గంటల తరబడి కూర్చుని చేసే పని వల్ల మనకు తెలియకుండానే కొవ్వు పెరిగిపోతోంది. ఇలాంటప్పుడు అన్నం కంటే సిరిధాన్యాలు తీసుకోవడం ఉత్తమం. అందులోనూ జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మంచింది. అయితే ఎప్పుడూ రొట్టెలే కాకుండా కాస్త భిన్నంగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే.. నోటికి రుచిని.. ఒంటికి బలాన్ని ఇచ్చే ఈ ‘జొన్న గుగ్గిళ్ల’ తయారు చేసుకోండి. ఇది కేవలం బరువు తగ్గడానికే కాదు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి కూడా చక్కగా పనిచేస్తుంది.

కావాల్సిన పదార్థాలు:

జొన్నలు- ఒక కప్పు (రాత్రంతా నానబెట్టినవి)
ఉల్లిపాయ – ఒకటి (చిన్నగా తరిగినవి’
పర్చిమిర్చి – సరిపడా
క్యారెట్ తురుము – అరకప్పు
పచ్చి బఠాణీలు – అర కప్పు
పోపు దినుసులు – ఆవాలు, జీలకర్ర, కరివేపాకు
అల్లం తురుము, పసుపు, కొత్తిమీర, నిమ్మరసం – కొద్దిగా

Advertisement

Also Read: హోలీ ఉత్సాహం రెట్టింపు అవ్వాలంటే.. ఈ తెలుగు సంప్రదాయ స్వీట్స్ తినాల్సిందే!

తయారీ విధానం:

రాత్రంతా నానబెట్టుకున్న జొన్నలను కుక్కర్‌లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. జొన్నలు బాగా నానితేనే తిన్నప్పుడు మెత్తగా, రుచిగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో పోపు వేయాలి. అందులోనే అల్లం తురుము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.

Advertisement

ఆ తర్వాత క్యారెట్ తురుము, పచ్చి బఠాణీలు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇవి ఉడికిన తర్వాత, ఆల్రెడీ సిద్ధం చేసుకున్న జొన్నలను వేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు కలిపి రెండు నిమిషాలు ఉంచాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి, దించే ముందు కొంచెం నిమ్మరసం పిండుకుంటే సరి. ఈ పోషకాల గనిని బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకుంటే మీ ఆరోగ్యం మీ గుప్పిట్లో ఉన్నట్లే.

Also Read: ఒక్కసారి ఈ స్టైల్లో బేల్ పూరీ తయారు చేసుకుని తింటే.. ఇక బయట అస్సలు కొనరు!

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×