సాయంత్రం అయితే చాలు ఏదైనా క్రిస్పీగా తినాలనిపిస్తుంది. టీతో పాటూ వేడి వేడి పకోడాలు ఉంటే ఎంత బాగుంటుందో చెప్పక్కర్లేదు. సాధారణంగా ఉల్లిపాయ పకోడా తింటూ ఉంటాము. కానీ కొంచెం ప్రత్యేకంగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే స్నాక్ చేయాలనుకుంటే ఎగ్ పకోడా చేసుకోండి. ఇది బయట దొరకడం చాలా కష్టం. కాబట్టి ఇంట్లో శుచిగా చేసుకోండి.
ఎగ్ పకోడా రెసిపీకి కావలసిన పదార్థాలు
కోడిగుడ్లు – మూడు
శెనగపిండి – ఒక కప్పు
బియ్యపు పిండి – రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ – ఒకట పచ్చిమిర్చి – రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీస్పూన్
కారం పొడి – ఒక టీస్పూన్
ధనియాల పొడి – అర టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
కరివేపాకులు – గుప్పెడు
కొత్తిమీర – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా
బేకింగ్ సోడా – చిటికెడు
నూనె – డీప్ ఫ్రై వేయించడానికి సరిపడా
Also read: Mushroom Masala: చపాతీతో ఇలా మష్రూమ్ మసాలా కూర చేసుకున్నారంటే రెండు రోటీలు ఎక్కువ తింటారు
ఎగ్ పకోడీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
1. ముందుగా ఒక గిన్నెలో మూడు గుడ్లను పగలగొట్టి బాగా కొట్టాలి. తెల్లసొన, పచ్చసొన కలిసేలా స్పూన్ లేదా విస్క్‌తో బాగా కలపాలి.
2. ఇప్పుడు శెనగపిండి, బియ్యపు పిండి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. అందులో కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి.
3. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా జోడించాలి.
4. ఇప్పుడు గుడ్లను కొట్టి ఈ పిండిలో నెమ్మదిగా పోస్తూ కలపాలి.ఈ మిశ్రమం మరీ మందంగా కాకుండా, అలాగని పలుచగా కాకుండా మధ్యస్థంగా ఉండాలి.
5. అవసరమైతే కొద్దిగా నీరు కలపవచ్చు. చివరగా చిటికెడు బేకింగ్ సోడా వేసి మళ్లీ కలపాలి.
6. ఒక కళాయి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి మధ్యస్థ మంటపై వేడి చేయాలి.
7. నూనె బాగా వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా పిండిని నూనెలో వేసి చూడాలి.
8. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా నూనెలో వేయాలి. బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
9. పకోడాలు బంగారు రంగులో క్రిస్పీగా అయ్యాక వాటిని తీసి టిష్యూ పేపర్ మీద పెట్టాలి. అదనపు నూనె తొలగిపోతుంది.
Aslo read: Curd Facepack: పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్ వేసుకుంటే బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు
వేడిగా ఉన్న ఎగ్ పకోడాలను టమాటో సాస్, పుదీనా చట్నీ లేదా ఉల్లి సలాడ్‌తో సర్వ్ చేయవచ్చు. వీటిని వేడిగా తింటే అదిరిపోతాయి. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. టీ లేదా కాఫీతో కలిసి తింటే మరింత రుచిగా ఉంటుంది. వర్షాకాలంలో ఈ స్నాక్ ప్రత్యేకంగా నచ్చుతుంది.