E-Paper
Advertisement

Simple Breakfast: ఇన్‌స్టంట్ ఆలూ ఊతప్పం రెసిపీ, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది

Simple Breakfast: ఇన్‌స్టంట్ ఆలూ ఊతప్పం రెసిపీ, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
Advertisement

ఉదయం స్కూలుకు, ఆఫీసులకు వెళ్లేందుకు త్వరగా అయిపోయే టిఫిన్ గురించే ఆలోచిస్తారు. ఒకసారి ఆలూ ఊతప్పం వండుకుని చూడండి. బంగాళాదుంపలతో చేస ఈ బ్రేక్ ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఊతప్పం చేసేందుకు ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇది పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చుతుంది.

ఆలూ ఊతప్పం రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బంగాళాదుంపలు – రెండు
రవ్వ – ఒక కప్పు
పెరుగు – అర కప్పు
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – ఒకటి
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
జీలకర్ర – అరస్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – తగినంత
నూనె – సరిపడినంత

Advertisement

తయారీ విధానం
1. ముందుగా బంగాళాదుంపల తొక్క తీసి శుభ్రంగా కడిగి తురుముకోవాలి. తురిమిన ఆలూను ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టాలి.
2. తరువాత ఉల్లిపాయను చిన్న ముక్కలుగా తరగాలి.
3. పచ్చిమిర్చిని సన్నగా తరిగి కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేయాలి.
4. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో రవ్వ వేయాలి.
5. రవ్వలో పెరుగు వేసి కలపాలి. కొద్దిగా నీరు పోసుకుంటూ ముద్దలు లేకుండా కలపాలి.
6. ఇది మరీ పల్చగా కాకుండా, అలాగని గట్టిగా కాకుండా ఉండేలా చూసుకోవాలి.
7. ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి. అలా ఉంచటం వల్ల రవ్వ కొంచెం మెత్తగా నానుతుంది.
8. రవ్వ మిశ్రమం సిద్ధమైన తరువాత తురిమిన ఆలూ, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి.
9. అవసరమైతే ఒకటి రెండు చెంచాల నీరు కలపవచ్చు.
10. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయాలి. పెనం వేడెక్కిన తరువాత కొద్దిగా నూనె రాసి ఒక గరిటె మిశ్రమాన్ని ఊతప్పం మధ్యలో వేయాలి.
11. దీన్ని చిన్న మంట మీద ఊతప్పం వేయించాలి. రెండు వైపులా బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.
12. రెండు వైపులా సమంగా కాలిన తరువాత ఊతప్పం సిద్ధమైనట్టే.

వేడి వేడి ఆలూ ఊతప్పాన్ని కొబ్బరి చట్నీతో లేదా టమాట చట్నీతో తింటే అదిరిపోతుంది. ఇష్టమైతే మీరు సాంబార్ తో కూడా తినవచ్చు. ఉదయాన్నే కాదు, సాయంత్రం లైట్ స్నాక్‌గా కూడా ఇది బాగా నచ్చుతుంది.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×