E-Paper
Advertisement

Vastu Tips: ప్రేమలో దూరం పెరుగుతోందా? మీ బంధాన్ని మళ్లీ చిగురింపజేసే ఆ ఒక్క మ్యాజికల్ గిఫ్ట్ ఇదే!

Vastu Tips: ప్రేమలో దూరం పెరుగుతోందా? మీ బంధాన్ని మళ్లీ చిగురింపజేసే ఆ ఒక్క మ్యాజికల్ గిఫ్ట్ ఇదే!
Advertisement

Vastu Tips: నిజమైన ప్రేమకు నిలకడ ఎంత ముఖ్యమో.. ఆ బంధం పదికాలాల పాటు పచ్చగా ఉండటానికి సానుకూల శక్తి కూడా అంతే అవసరం. వాస్తు శాస్త్రం ప్రకారం.. మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు మన ఆలోచనలను, అనుబంధాలను ప్రభావితం చేస్తాయట. వాటిలో లవ్ బర్డ్స్ అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇవి కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు.. భాగస్వాముల మధ్య అన్యోన్యతను పెంచే అద్భుతమైన సంకేతాలు. మీరు ప్రేమించే వ్యక్తికి వీటిని బహుమతిగా ఇవ్వడం వల్ల ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గి, అనురాగం మరింత పెరుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

పార్ట్‌నర్‌పై ఇంట్రెస్ట్ పెరగాలంటే..

ప్రేమలో ఉన్నప్పుడు కొన్నిసార్లు భాగస్వామి నుంచి ఆశించినంత అటెన్షన్ లభించకపోవచ్చు. అలాంటి సమయంలో శుక్రవారం నాడు జంట లవ్‌బర్డ్స్‌ను వారికి గిఫ్ట్‌గా ఇవ్వడం ఒక మంచి పరిహారం. వీటితో పాటు సువాసన వెదజల్లే పర్ఫ్యూమ్‌ను కూడా గిఫ్ట్‌గా ఇస్తే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. శుక్రుడు ప్రేమకు, ఆకర్షణకు కారకుడు కాబట్టి.. ఈ రోజున ఇచ్చే బహుమతులు మీ బంధంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. మీ భాగస్వామి మనసులో మీపై ఉన్న గౌరవం, ప్రేమ పెరగడానికి ఈ చిన్న ప్రయత్నం ఎంతో తోడ్పడుతుంది.

Advertisement

Also Read: పక్షులేమీ పిచ్చివి కావు.. ఆకాశంలో V షేప్‌లో ఎందుకు వెళ్తాయో తెలిస్తే.. వాటి తెలివికి ఫిదా అయిపోతారు!

పెళ్లి ఆటంకాలు తొలగిపోతాయి..

కొంతమంది ప్రేమించుకున్నప్పటికీ పెళ్లి విషయంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటుంటారు. అలాంటి వారు తమ పడకగదిలో దక్షిణం లేదా పశ్చిమ దిశలో లవ్‌బర్డ్స్ ఫొటోలను ఉంచడం వల్ల పెళ్లి ప్రయత్నాలు త్వరగా కొలిక్కి వస్తాయి. అలాగే, ఇంట్లో వాస్తు దోషాల వల్ల తరచూ గొడవలు జరుగుతుంటే.. నైరుతి దిశలో ఈ పక్షుల బొమ్మలను ఉంచడం వల్ల శాంతి నెలకొంటుంది. అయితే.. పక్షులు స్వేచ్ఛగా ఉన్న చిత్రాలను మాత్రమే వాడాలి. బోనులో బంధించినట్లు ఉండే చిత్రాలను పెడితే అవి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

దంపతుల మధ్య సఖ్యత..

Advertisement

కేవలం ప్రేమికులకే కాకుండా.. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడానికి కూడా లవ్‌బర్డ్స్ చిహ్నాలు సహాయపడతాయి. ఇవి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గడానికి, ఇంట్లో ప్రశాంతత పెరగడానికి కూడా ఈ లవ్‌బర్డ్స్ ఫొటో పనిచేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న మార్పులతో మీ వ్యక్తిగత జీవితంలో పెద్ద మార్పును చూడాలనుకుంటే.. మీ గదిలో ఒక జంట లవ్‌బర్డ్స్ బొమ్మను పెట్టుకోవడం మంచి ఆలోచన.

Also Read: కేవలం 6 గంటలే నిద్రపోతున్నారా? మీకు తెలియకుండానే ఈ ప్రాణాంతక వ్యాధులను ఆహ్వానిస్తున్నారు!

 

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×