E-Paper
Advertisement

ఇంట్లో కూరలు లేవా? 10 నిమిషాల్లో అప్పటికప్పుడు పచ్చి పులుసు చేసేయండి!

ఇంట్లో కూరలు లేవా? 10 నిమిషాల్లో అప్పటికప్పుడు పచ్చి పులుసు చేసేయండి!
Advertisement

Pachi pulusu recipe: ఉరుకులు పరుగుల జీవితంలో.. ఉదయాన్నే లేదా మధ్యాహ్నం పూట వంట చేయడానికి.. సమయం తక్కువగా ఉన్నప్పుడు, లేదంటే.. ఫ్రిజ్‌లో కూరగాయలు అయిపోయినప్పుడు అందరికీ గుర్తు వచ్చే మొట్టమొదటి వంటకం పచ్చి పులుసు. మంటతో .. అవసరం లేకుండా, పచ్చి దినుసులతో.. అప్పటికప్పుడు తయారు చేసుకునే, ఈ పులుసు రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. క్విక్ అండ్ ఈజీ రెసిపీల లిస్ట్ దీనికి ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంది. పచ్చి పులుసును ఎంతో రుచిగా, పర్ఫెక్ట్ కొలతలతో.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

చింతపండు – నిమ్మకాయ సైజ్ అంత

Advertisement

ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినవి)

పచ్చిమిర్చి – 4 లేదా 5

Advertisement

బెల్లం – చిన్న ముక్క (రుచికి సరిపడా)

కరివేపాకు – రెమ్మ

కొత్తిమీర – కొద్దిగా

ఉప్పు – తగినంత

తాలింపు కోసం: నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, పసుపు.

తయారీ విధానం:

1. ముందుగా తీసుకున్న.. చింత పండును శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు.. పోసి నానబెట్టాలి. చింత పండు గుజ్జు మెత్తగా.. అయిన తర్వాత, దానిని బాగా పిండి చింతపండు పులుసు సిద్ధం చేసుకోవాలి. నీరు మీ అన్నం పరిమాణానికి తగినట్లుగా సరిపడా పోసుకోవాలి.

2. పచ్చి పులుసుకి అసలైన రుచిని తెచ్చేది పచ్చిమిర్చిని కాల్చడం . స్టవ్ వెలిగించి పచ్చి మిర్చిని మంటపై లేదా పెనంపై దోరగా కాల్చుకోవాలి. ఇలా కాల్చిన పచ్చి మిర్చిని ఒక గిన్నెలో వేసి, తగినంత ఉప్పు వేసి చేత్తో.. లేదా పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చి మిర్చి సువాసన పులుసులోకి దిగి అద్భుతమైన టేస్ట్ ఇస్తుంది.

3. ఇప్పుడు మెదిపిన పచ్చి మిర్చి మిశ్రమంలో.. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరి వేపాకు వేసి చేత్తో గట్టిగా కలపాలి. ఉల్లిపాయ ముక్కల నుంచి కొద్దిగా.. రసం బయటకు వచ్చేలా.. కలపడం వల్ల పులుసు మరింత రుచిగా మారుతుంది.

4. మనం ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు రసాన్ని ఈ ఉల్లి పాయ-పచ్చి మిర్చి మిశ్రమంలో పోయాలి. దీనికి రుచికి సరిపడా.. ఉప్పు, కొద్దిగా బెల్లం ముక్క కలపాలి. కొద్దిగా బెల్లం వేయడం.. వల్ల పులుసులోని పులుపు, కారం బ్యాలెన్స్ అయ్యి అద్భుతమైన తీపి-పులుపు రుచి వస్తుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును వేయాలి.

5. పచ్చి పులుసును పచ్చిగా కూడా అన్నంలోకి తినొచ్చు. కానీ చిన్న తాలింపు పెడితే.. దాని రుచి రెట్టింపు అవుతుంది. చిన్న పాన్‌లో కొద్దిగా నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, చిటికెడు ఇంగువ, పసుపు వేసి వేయించి పులుసులో కలపాలి. అంతే.. గుమగుమలాడే నోరూరించే పచ్చి పులుసు సిద్ధం!

Also Read: స్వీట్ షాప్ స్టైల్ జ్యూసీ బాదుషా..ఈ చిన్న టిప్స్ పాటిస్తే రుచి అద్భుతం

పచ్చి పులుసులో ఉడికించిన పదార్థాలు ఏవీ ఉండవు కాబట్టి, శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ నేరుగా అందుతాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా .. కాపాడటంలో, జీర్ణ క్రియను మెరుగు పరచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

ఇంట్లో కూరలు లేనప్పుడు.. లేదా వంట చేయడానికి ఓపిక లేనప్పుడు కేవలం 10 నిమిషాల్లో వేడి వేడి అన్నంలోకి.. ఈ పచ్చి పులుసు చేసుకుంటే.. ఆ తిండి తృప్తే వేరు. ఈ ట్రెడిషనల్ రెసిపీకి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంది. మరి ఈసారైనా మీ ఇంట్లో కూరలు అయిపోతే ఈ పచ్చి పులుసును కచ్చితంగా ట్రై చేయండి!

Related News

ఆడవారితో పోలిస్తే మగవాళ్ల జీవితకాలం ఎందుకు తక్కువ? సైన్స్ ఏం చెబుతోందంటే..

రోజంతా పనిచేసి అలసటగా ఉన్నా నిద్రపట్టడం లేదా? ఈ సింపుల్ చిట్కాతో సమస్యకు చెక్

10 నిమిషాల్లో ప్రొటీన్ రిచ్ శనగల తాలింపు రెసిపీ..టేస్ట్ అదుర్స్!

ముఖంపై గ్లో కోసం విటమిన్ C సీరం వాడుతున్నారా? ఈ 5 తప్పులు చేస్తే చర్మానికి నష్టామే

చాణక్య నీతి.. ప్రేమ కోసం ఈ 6 విషయాలను వదులుకుంటే చివరకు బాధపడేది మీరే

కుర్తీతో ఎలాంటి జీన్స్ వేసుకుంటే స్టైలిష్‌ ఉంటుంది? 5 బెస్ట్ కాంబినేషన్లు మీ కోసం

ఇన్‌ఫ్లుయెన్సర్‌కు లక్షల ఖరీదు చేసే గిఫ్ట్స్ పంపిస్తున్న అభిమానులు..కానీ ఫ్రీ కాదు.. కొత్త తరహా టార్చర్

Big Stories

Advertisement
×