E-Paper
Advertisement

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!
Advertisement

Mahindra XUV 3XO Sales: మహీంద్రా నుంచి వచ్చిన పాపులర్ కాంపాక్ట్ SUV XUV 3XO మరో కీలక మైలురాయిని అందుకుంది. దేశీయ మార్కెట్లో ఈ మోడల్‌ కు సంబంధించిన మొత్తం హోల్‌ సేల్ అమ్మకాలు 5 లక్షల యూనిట్లను దాటాయి. ఇందులో పాత XUV300, కొత్త XUV 3XO, ఎలక్ట్రిక్ వెర్షన్ XUV 3XO EV అమ్మకాలు కూడా ఉన్నాయి.

5 లక్షలు దాటిన అమ్మకాలు.. ఎగుమతుల్లోనూ సత్తా!

అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 2019 నుంచి సెప్టెంబర్ 2026 వరకు మహీంద్రా XUV300, XUV 3XO, XUV 3XO EV మోడళ్ల దేశీయ హోల్‌సేల్ అమ్మకాలు కలిపి 5,05,590 యూనిట్లకు చేరాయి. వీటితో పాటు మరో 37,000 యూనిట్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేశారు. 2024లో XUV300 స్థానంలో అప్‌ డేట్ చేసిన XUV 3XOను మహీంద్రా తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ మోడల్ అమ్మకాలు మరింత జోష్ అందుకున్నాయి. 2026 జనవరిలో XUV 3XO EVను కూడా పరిచయం చేయడంతో కస్టమర్లకు ఎలక్ట్రిక్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.

గత 11 నెలల్లోనే లక్ష యూనిట్ల అమ్మకాలు

Advertisement

మహీంద్రా XUV300, XUV 3XO సిరీస్‌కు అక్టోబర్ 2025లో అత్యధిక నెలవారీ అమ్మకాలు నమోదయ్యాయి. ఆ నెలలో 12,237 యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో ఈ SUV సిరీస్ 4 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ఆ తర్వాత కేవలం 11 నెలల్లోనే మరో లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయి. FY2025లో 1,00,923 యూనిట్లు అమ్మగా,  FY2026లో అమ్మకాలు 1,03,341 యూనిట్లకు చేరాయి. అంటే, ఏడాదికి 2 శాతం అదనంగా సేల్స్ అయ్యాయి. ఇక FY2027 మొదటి ఆరు నెలల్లోనే 52,851 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 44,400 యూనిట్లతో పోలిస్తే 19 శాతం వృద్ధి సాధించింది.

CNG వెర్షన్‌తో మరింత డిమాండ్ వచ్చే అవకాశం!

XUV 3XOకు త్వరలో CNG ఆప్షన్ కూడా కీలకంగా మారనుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ నిర్వహణ ఖర్చులు కోరుకునే కస్టమర్లు CNG వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలని మహీంద్రా భావిస్తోంది. ICE, EV, CNG వెర్షన్లతో కలిపి FY2027లో సుమారు 1.25 లక్షల యూనిట్ల అమ్మకాలు సాధించే అవకాశం ఉందని అంచనా.

ధర, ఇంజిన్ వివరాలు..

Advertisement

మహీంద్రా XUV 3XO ధరలు రూ.7.79 లక్షల నుంచి రూ.15.04 లక్షల వరకు ఉన్నాయి. ఇందులో 111hp సామర్థ్యంతో కూడిన 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 131hp టర్బో పెట్రోల్ ఇంజిన్, 117hp 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. XUV 3XO EV ధరలు రూ.13.89 లక్షల నుంచి రూ.14.96 లక్షల వరకు ఉన్నాయి. ఇందులో 39.4kWh బ్యాటరీ ప్యాక్, 150hp ఎలక్ట్రిక్ మోటార్ అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 351 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.

Read Also: మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

Tags

Related News

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×