E-Paper
Advertisement

స్వీట్ షాప్ స్టైల్ జ్యూసీ బాదుషా..ఈ చిన్న టిప్స్ పాటిస్తే రుచి అద్భుతం

స్వీట్ షాప్ స్టైల్ జ్యూసీ బాదుషా..ఈ చిన్న టిప్స్ పాటిస్తే రుచి అద్భుతం
Advertisement

Juicy Badusha Recipe: మన వంటకాల్లో బాదుషాకు ఉండే క్రేజే వేరు. నోట్లో వేయగానే వెన్నలా కరిగిపోయే.. ఈ స్వీట్‌ను ఇష్టపడని వారు ఉండరు. అయితే.. చాలామంది ఇంట్లో బాదుషా చేసినప్పుడు అవి సరిగ్గా రావడం లేదని, రసం లోపలికి పీల్చుకోలేదని లేదా గట్టిగా వస్తున్నాయని ఫీలవుతుంటారు. మీరు కూడా బాదుషా చేసేటప్పుడు పర్ఫెక్ట్ టెక్స్చర్ రావాలని కోరుకుంటున్నారా? అయితే.. ఈ కింద చెప్పిన కొన్ని అద్భుతమైన టిప్స్ పాటిస్తే.. ఏమాత్రం తేడా రాకుండా అచ్చం స్వీట్ షాప్ లాంటి జ్యూసీ బాదుషాలను తయారు చేయెచ్చు.

కావలసిన పదార్థాలు:

మైదా పిండి – 2 కప్పులు

Advertisement

నెయ్యి (కరిగించనిది) -1 కప్పు

పెరుగు – 3 లేదా 4 టేబుల్ స్పూన్లు

Advertisement

చిటికెడు ఉప్ప, వంట సోడా

పంచదార – 2 కప్పులు

నూనె – వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, ఉప్పు, సోడా వేసి కలపాలి. అందులో నెయ్యి ,పెరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుతూ మెత్తని ముద్దలా కలపాలి (పిండిని గట్టిగా ప్రెస్ చేయకూడదు). ఈ పిండిని ఒక పావు గంట పాటు నాననివ్వాలి. ఆ తర్వాత సమానమైన ఉండలుగా చేసి, మధ్యలో వేలితో చిన్న రంధ్రం చేయాలి.

1. బాదుషా గుల్లగా రావడానికి మైదా పిండిని కలిపే విధానం చాలా ముఖ్యం. మైదా పిండిలో సరిపడా నెయ్యి వేసి బాగా కలపాలి. ఇక్కడ పిండిని చపాతి పిండిలా.. గట్టిగా లేదా మెత్తగా తడపకూడదు. కేవలం పిండి, నెయ్యి కలిసి ముద్దలా అయ్యేలా చూసుకోవాలి. పిండిని ఎక్కువ ఒత్తి కలపకూడదు. అలా చేస్తే బాదుషా లోపల లేయర్లు రావు.

2. బాదుషా జ్యూసీగా మారాలంటే షుగర్ సిరప్ కరెక్ట్ స్టేజ్‌లో ఉండాలి. పాకం కోసం ఒక కప్పు పంచదారకు అర కప్పు నీళ్లు పోసి మరగబెట్టాలి. దీనికి ఎలాంటి తీగ పాకం అవసరం లేదు. కేవలం పంచదార కరిగి, కొద్దిగా జిగురుగా మారితే సరి పోతుంది. పాకం మరీ గట్టిగా ఉంటే బాదుషా రసాన్ని పీల్చుకోదు, మరీ పల్చగా ఉంటే మెత్తబడిపోతాయి. పాకంలో కొద్దిగా యాలకుల పొడి, నిమ్మరసం పిండుకుంటే పాకం గడ్డకట్టకుండా ఉంటుంది.

Also Read: ఇంట్లోనే కరకరలాడే క్రిస్పీ పొటాటో బైట్స్..ఈజీగా ఇలా చేయండి!

3. బాదుషాలను ఎప్పుడూ కూడా మంట మీడియం లేదా లో ఫ్లేమ్‌లో ఉంచే వేయించాలి. నూనె మరీ ఎక్కువగా కాగిపోకూడదు. గోరు వెచ్చని నూనెలో బాదుషాలను వేయాలి. అవి నెమ్మదిగా వేగి పైకి తేలుతాయి. ఇలా చిన్న మంటపై.. వేయించడం వల్ల బాదుషా లోపలి వరకు సమానంగా కాలి గుల్లగా మారుతుంది. హై ఫ్లేమ్‌లో పెడితే పైన మాడిపోతుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది.

4. బాదుషాలు వేయించిన వెంటనే వాటిని కాస్త వేడిగా ఉన్న పంచదార పాకంలో వేయాలి. బాదుషా వేడిగా, పాకం కూడా గోరు వెచ్చగా ఉండాలి. అప్పుడే అది రసాన్ని చక్కగా పీల్చుకుంటుంది. పాకంలో వేసిన తర్వాత కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు వాటిని అలాగే వదిలేయాలి, అప్పుడే రసం లోపలి వరకు వెళ్తుంది.

చిట్కా: బాణలిలో నూనె పోసి, మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి తయారు చేసుకున్న బాదుషాలను వేయించాలి. గోధుమ రంగులోకి మారిన తర్వాత వాటిని తీసి నేరుగా పంచదార పాకంలో వేయాలి. కాసేపు నానిన తర్వాత బయటకు తీస్తే గుల్లగా, రసంతో నిండిన జ్యూసీ బాదుషాలు సిద్ధం!

Related News

కాలీఫ్లవర్‌తో ఈసారి ఇలా వేపుడు చేయండి..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!

ఇంట్లోనే కరకరలాడే క్రిస్పీ పొటాటో బైట్స్..ఈజీగా ఇలా చేయండి!

కేవలం 14 రోజుల పాటు షుగర్‌కు దూరంగా ఉంటే.. శరీరంలో జరిగే మార్పులివే!

విదేశీయులు ఇష్టపడే ఈ ఇండియన్ డిష్ పుట్టింది బ్రిటన్‌లోనే అని తెలుసా?

నచ్చిన ఆహారం తింటూ.. కిలో బరువు తగ్గాలంటే.. రోజుకు ఎన్ని అడుగులు నడవాలి?

గుంటూరు స్పెషల్ కోవా పూరీ..ఇంట్లోనే ఇలా చేస్తే స్వీట్ షాప్ టేస్ట్!

వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఈ స్టైల్‌లో చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ!

Big Stories

Advertisement
×