E-Paper
Advertisement

Momos and Heart: మోమోస్ అధికంగా తింటే గుండెకు ప్రమాదమా?

Momos and Heart: మోమోస్ అధికంగా తింటే గుండెకు ప్రమాదమా?

మోమోస్ అంటే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్‌గా మారాయి. వీధి బండ్లలోనైనా, రెస్టారెంట్లలోనైనా సులభంగా ఇవి దొరుకుతున్నాయి. రుచిగా ఉండటం వల్ల చాలామందికి వీటిని తినే అలవాటు ఉంది. కానీ మోమోస్ ఎక్కువగా తినడం శరీరానికి మంచిది కాదు. ముఖ్యంగా గుండె ఆరోగ్యంపై ఇవి ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అందుకే మోమోస్ అధికంగా తినకూడదని చెబుతున్నారు వైద్యులు.

గుండెకు ఎందుకు హానికరం?
చాలా చోట్ల మోమోస్‌ను మైదాతో చేస్తారు. మైదా శరీరంలో త్వరగా జీర్ణం కాదు. అది కొవ్వు పెరుగడానికి కారణం అవుతుంది. ఈ కొవ్వు ధమనుల్లో పేరుకుపోయి కొలెస్ట్రాల్ పెరగడానికి దారితీస్తుంది. కొలెస్ట్రాల్ పెరగడం అంటే గుండెపై భారం పడటమే. ఇంకా వీధి బండ్లలో చేసే మోమోస్‌లో వాడిన నూనెనే మళ్లీ వాడుతూ ఉంటారు. ఇలా వండడం ఇంకా ప్రమాదకరం. ఈ నూనెలో ఉన్న ట్రాన్స్ ఫ్యాట్స్ గుండెకు హానికరం. అందుకే బయట మోమోస్ తరచూ తింటే హార్ట్ సమస్యల ప్రమాదం ఉంటోంది.

రకరకాల మోమోస్
ఇప్పుడు మార్కెట్లో ఫ్రైడ్ మోమోస్, కుర్కురే మోమోస్, చీజ్ మోమోస్, మసాలా మిక్స్ చేసిన మోమోస్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువ నూనె, చీజ్, మసాలాలతో తయారు చేస్తారు. ఇందులో ఉన్న ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెంచుతాయి. దీనివల్ల బరువు పెరగడం, బీపీ పెరగడం, షుగర్ వంటి వాటిలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ మూడు సమస్యలు కలిసి గుండెకు మరింత ప్రమాదం కలిగిస్తాయి. వారానికి మూడు నుంచి నాలుగు సార్లు ఇలాంటి మోమోస్ తినేవారికి గుండె సమస్యల రిస్క్ ఎక్కువ.

పరిశుభ్రత కూడా ఉండదు
మోమోస్ తయారీలో చాలా చోట్ల శుభ్రత పాటించకపోవచ్చు. పాత కూరగాయలు, పాత పిండి, పాత మాంసం వాడడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ కలిగిస్తాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు శరీరం బలహీనపడి, గుండె పనితీరు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు తరచూ బయట మోమోస్ తింటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. ఇవి పరోక్షంగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

ఆరోగ్యకరంగా మోమోస్ ఎలా తినాలి?
మోమోస్ పూర్తిగా హానికరం కాదు. ఇంట్లో ఆరోగ్యకరంగా చేస్తే ఇవి మంచి స్నాక్‌గా మారుతాయి. మైదాకు బదులుగా గోధుమపిండి లేదా రాగి పిండి వాడడం, తాజా కూరగాయలు వాడడం, నూనెలో వేయించకుండా స్టీమ్‌లో వండడం మంచిది. బయట తినాల్సి వస్తే వారానికి ఒకసారి మాత్రమే తినాలి. ఫ్రైడ్ మోమోస్‌ కాకుండా స్టీమ్ మోమోస్‌ ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిది. మొత్తానికి మోమోస్ రుచిగా ఉన్నా అతిగా తింటే గుండెకు ప్రమాదం దాగి ఉంది. అందుకే మితంగా, శుభ్రంగా తయారైన మోమోస్ మాత్రమే తినడం ఉత్తమం.

Related News

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

బతికినంత కాలం రోగాల్లేకుండా ఉండాలా?.. ఈ అలవాట్లను మార్చుకోండి!

Big Stories

×