E-Paper
Advertisement

Plants without Soil: మట్టి అవసరం లేకుండా నీటిలోనే ఈ మొక్కలను సులువుగా పెంచేయండి

Plants without Soil: మట్టి అవసరం లేకుండా నీటిలోనే ఈ మొక్కలను సులువుగా పెంచేయండి
Advertisement

ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. అయితే మట్టి, స్థలం, సమయం వంటి సమస్యల వల్ల చాలా మంది గార్డెనింగ్‌కు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారికి ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న పద్ధతి నీటిలోనే మొక్కలు పెంచడం. ఈ పద్ధతిని హైడ్రోపోనిక్స్ అంటారు. ఇందులో మట్టి అవసరం లేకుండా, నీటిలోనే మొక్కలకు అవసరమైన పోషకాలు అందించి పెంచుతారు. ఇది చాలా సులభం కావడంతో పాటు ఇంటిని అందంగా మార్చే మంచి ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.

మనీ ప్లాంట్ తో పాటూ ఇవి
నీటిలో పెరిగే మొక్కల్లో మనీ ప్లాంట్, లక్కీ బాంబూ, స్పైడర్ ప్లాంట్ వంటి మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా మనీ ప్లాంట్ చిన్న కొమ్మను కట్ చేసి నీటిలో పెడితే త్వరగా వేర్లు పెరుగుతాయి. లక్కీ బాంబూ గ్లాస్ బాటిల్‌లో నీటితో పెడితే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. స్పైడర్ ప్లాంట్‌లో వచ్చే చిన్న మొక్కలను నీటిలో పెడితే అవి సులభంగా పెరుగుతాయి. ఇవన్నీ ఎక్కువ కేర్ అవసరం లేకుండా బాగా పెరిగే మొక్కలు కావడం ప్రత్యేకత.

Advertisement

Also read: Low BP: మీ బీపీ పడిపోతే వెంటనే కనిపించే లక్షణాలు ఇవే, వెంటనే ఏం చేయాలంటే?

ఈ మొక్కలు
అలాగే పీస్ లిల్లీ, ఫిలోడెండ్రాన్, కోలియస్, ఇంగ్లీష్ ఐవి వంటి మొక్కలు కూడా నీటిలో పెంచుకోవచ్చు. పీస్ లిల్లీ తెల్లని పూలతో ఇంటికి అందాన్ని తెస్తుంది. ఫిలోడెండ్రాన్ ఆకులు ఆకర్షణీయంగా ఉండి ఇండోర్ ప్లాంట్‌గా బాగా ఉపయోగపడుతుంది. కోలియస్ రంగురంగుల ఆకులతో ఇంటికి కొత్త లుక్ ఇస్తుంది. ఇంగ్లీష్ ఐవి వేలాడేలా పెరిగి డెకరేషన్‌కు చాలా బాగుంటుంది. ఈ మొక్కలు ఇంట్లో చిన్న స్థలంలో కూడా సులభంగా పెంచుకోవచ్చు. ఇక్కడ చెప్పిన మొక్కలన్నీ నర్సరీలో సులువుగా దొరికేవే.

Advertisement

Also read: Beetroot Stains: బీట్‌రూట్ కట్ చేస్తే చేతులు, బట్టలపై ఎర్ర మరకలు పడుతున్నాయా? ఇలా వదిలించేసుకోండి

ఈ జాగ్రత్తలు
ఇలాంటి నీటి మొక్కలను పెంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నీటిని వారానికి ఒకసారి మార్చడం చాలా అవసరం. అలాగే ప్రత్యక్ష సూర్యకాంతి కాకుండా మోస్తరు వెలుతురు ఉండే చోట పెట్టాలి. కొన్నిసార్లు లిక్విడ్ ఫర్టిలైజర్ వేయడం వల్ల మొక్కలు ఇంకా బాగా పెరుగుతాయి. మొత్తంగా చూసుకుంటే, మట్టి లేకుండా కూడా ఇంట్లో అందమైన మొక్కలు పెంచుకోవచ్చు. తక్కువ శ్రమతో ఇంటిని గ్రీన్‌గా, అందంగా మార్చుకోవాలనుకునే వారికి ఇది మంచి పరిష్కారం.

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×