E-Paper
Advertisement

Herbal Tea Benefits: కాఫీ, టీలకు బదులుగా హెర్బల్‌టీలు తాగితే.. ఇన్ని లాభాలా ?

Herbal Tea Benefits: కాఫీ, టీలకు బదులుగా హెర్బల్‌టీలు తాగితే.. ఇన్ని లాభాలా ?
Advertisement

Herbal Tea Benefits: హెర్బల్ టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇవి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధంగా పరిగణిస్తారు. సాధారణంగా మనం తాగే టీ, కాఫీలలో కెఫిన్ అధికంగా ఉంటుంది. కానీ హెర్బల్ టీలలో మాత్రం కెఫిన్ ఉండదు. ఇవి ఎండిన పువ్వులు, ఆకులు, వేర్లు, విత్తనాలతో తయారు చేస్తారు కాబట్టి వీటితో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అనేక రకాల వ్యాధులను తగ్గించడంలో కూడా హెర్బల్ టీలు ఉపయోగపడతాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హెర్బల్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

Advertisement

జీర్ణక్రియ మెరుగుదల:
హెర్బల్ టీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇవి జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడతాయి.అల్లం టీ , పుదీనా టీ వంటివి గ్యాస్ ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తాయి. ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే మాత్రం హెర్బల్ టీలను తాగడం అలవాటు చేసుకోవాలి. భోజనం చేసిన తర్వాత హెర్బల్ టీ తాగడం వల్ల త్వరగా ఆహారం జీర్ణం అవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కునే వారు హెర్బల్ టీ తాగడం చాలా మంచిది.

రోగ నిరోధక శక్తి:
తులసి, అల్లం, మునగ ఆకులతో చేసిన టీలు యాంటీ ఆక్సిడెంట్లలను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడి రోగ నిరోశక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా జలుబు, దగ్గు వంటి ఇన్ఫక్షకు గురయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. హెర్బల్ టీలు సహజ రక్షణ కవచంలాగా పనిచేస్తాయి.

Advertisement

మానసిక ప్రశాతంత, నిద్ర:
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి సర్వసాధారణం అయినప్పటికీ హెర్బల్ టీలు మీకు చాలా మేలు చేస్తాయి. చామంతి టీ మెదడును ప్రశాంతపరిచి ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా నిద్ర లేమి సమస్యలతో ఇబ్బంది పడే వారికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. రాత్రి పడుకునే ముందు వీటిని తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి కూడా ఈజీగా బయటపడవచ్చు

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×