Triumph Motorcycles New Year offer 2026: యువతను మరింతగా ఆకట్టుకునేందుకు ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ కంపెనీ అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. ఇప్పటికే పలు సంస్థలు న్యూ ఇయర్ ఆఫర్స్ ప్రకటించగా, ఇప్పుడు ఆ లిస్టులో ట్రయంఫ్ చేరింది. ప్రస్తుతం మార్కెట్ లో సత్తా చాటుతున్న ట్రయంఫ్ స్పీడ్ 400, స్పీడ్ T4 బైక్స్ మీద పరిమిత కాల న్యూ ఇయర్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ మోటార్ సైకిళ్లలో దేనినైనా కొనుగోలు చేస్తే కంపెనీ రూ. 11,500 విలువైన యాక్సెసరీలను ఉచితంగా అందిస్తోంది. ఈ మేరకు సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది.
ట్రయంఫ్ న్యూయర్ ఆఫర్ లో భాగంగా పలు యాక్సెసరీలను అందిస్తోంది. ఈ లిస్టులో ట్యాంక్ ప్యాడ్, విండ్ స్క్రీన్, కీన్ ప్యాడ్స్, లోయర్ ఇంజిన్ బార్ లు, బ్యాక్ రెస్ట్ ఉన్నాయి. ముఖ్యంగా, ట్రయంఫ్ ఆఫర్ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేదు. కానీ, ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ట్రయంఫ్ అధికారిక డీలర్ షిప్ లలో ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది.
ట్రయంఫ్ 400cc పోర్ట్ ఫోలియోలో అన్ని మోడళ్ల ధరలను పెంచుతోంది. ఈ సమయంలో కంపెనీ ఈ ఆఫర్ ను ప్రకటించడం విశేషం. స్పీడ్ 400 ధర రూ. 5,246 పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. మిగిలిన మోడళ్లు దాదాపు రూ. 2,246 నుంచి రూ. 2,461 వరకు పెరిగాయి. కొత్త సంవత్సర ఆఫర్ ధర పెరుగుదలను భర్తీ చేయడంతో పాటు షోరూమ్ లో అమ్మకాలను ప్రభావింత చేయకుండా తీసుకున్న నిర్ణయంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also: ఫ్రీ యాక్సెసరీస్, పదేళ్ల వ్యారెంటీ.. KTM బైక్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్ బ్రో!
ప్రస్తుతం స్పీడ్ 400 ధర రూ. 2.39 లక్షలు నుంచి ప్రారంభం అవుటుంది. అటు స్పీడ్ T4 ధర రూ. 1.95 లక్షల నుంచి అందుబాటులో ఉంది. ఈ రెండు బైక్‌లు ఇప్పటికీ చాలా ఆకర్షణీయమైన ప్యాకేజీలుగా కొనసాగుతున్నాయి. అటు అడ్వెంచరస్ బైక్స్ విషయానికి వస్తే, స్క్రాంబ్లర్ 400 X, XC మాంచి దూకుడు కనబరుస్తున్నారు. స్క్రాంబ్లర్ 400 X ధర రూ. 2.70 లక్షల నుంచి ప్రారంభం అయితే, స్క్రాంబ్లర్ 400 XC ధర రూ. 2.97 లక్షల నుంచి మొదలవుతుంది. అటు మరింత అందా కనిపించే థ్రక్స్టన్ 400 ధర రూ. 2.76 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఈ ధరలు అన్నీ ఎక్స్ షోరూమ్ కు అనుగుణంగా ఉన్నాయి. ఆన్ రోడ్ విషయానికి వచ్చే సరికి ధర కాస్త పెరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఈ బైక్స్ ను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
Read Also: అమ్మకాల్లో దుమ్మురేపిన MG విండ్సర్, ఆ ఘనత సాధించిన తొలి ఈవీగా గుర్తింపు!