E-Paper
Advertisement

Vitamin C Serum: విటమిన్-సి సీరం వాడాలనుకుంటున్నారా? సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి !

Vitamin C Serum: విటమిన్-సి సీరం వాడాలనుకుంటున్నారా? సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి !
Advertisement

Vitamin C Serum: విటమిన్-సి సీరాన్ని ప్రస్తుతం చాలా మంది వాడుతున్నారు. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో, మచ్చలను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అయితే..సెన్సిటివ్ స్కిన్ (సున్నితమైన చర్మం) ఉన్నవారు దీనిని వాడటానికి కొంత ఆందోళన చెందుతుంటారు. విటమిన్-సి స్వభావరీత్యా కొంత ఆమ్ల గుణాన్ని కలిగి ఉండటం వల్ల సున్నితమైన చర్మంపై మంట లేదా ఎరుపు రావడం సహజం. కానీ, సరైన మోతాదులో.. సరైన రకమైన విటమిన్-సిని ఎంచుకుంటే సున్నితమైన చర్మం ఉన్నవారు కూడా దీని ప్రయోజనాలను సురక్షితంగా పొందవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి విటమిన్-సి సీరం ఎంతవరకు సురక్షితం ? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

విటమిన్-సి సెన్సిటివ్ స్కిన్‌కు సురక్షితమేనా ?
ఖచ్చితంగా సురక్షితమే.. కానీ మీరు ఎంచుకునే సీరం యొక్క ‘కాన్సంట్రేషన్’ (సాంద్రత) , ‘రకం’ మీద ఇది ఆధారపడి ఉంటుంది. విటమిన్-సి చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడటమే కాకుండా, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం దెబ్బతినకుండా చూస్తుంది.

Advertisement

సున్నితమైన చర్మం ఉన్నవారు పాటించాల్సిన 5 సూత్రాలు:
1. తక్కువ సాంద్రతతో ప్రారంభించండి : మార్కెట్లో విటమిన్-సి సీరమ్‌లు 5% నుంచి 20% వరకు లభిస్తాయి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు నేరుగా 20% వాడితే చర్మం దెబ్బతినవచ్చు. కాబట్టి.. మొదట 5% లేదా 10% తో ప్రారంభించడం ఉత్తమం. చర్మం అలవాటు పడిన తర్వాత నెమ్మదిగా సాంద్రతను పెంచవచ్చు.

2. సరైన విటమిన్-సి రకాన్ని ఎంచుకోండి: సాధారణంగా ‘ఎల్-ఆస్కార్బిక్ యాసిడ్’ అత్యంత ప్రభావవంతమైనది. కానీ ఇది సున్నితమైన చర్మంపై మంటను కలిగించవచ్చు. దీనికి బదులుగా ‘మెగ్నీషియం ఆస్కార్బైల్ ఫాస్ఫేట్’ లేదా ‘సోడియం ఆస్కార్బైల్ ఫాస్ఫేట్’ ఉన్న సీరమ్‌లను ఎంచుకోండి. ఇవి చర్మానికి తక్కువ చికాకును కలిగిస్తాయి.

Advertisement

3. ప్యాచ్ టెస్ట్ తప్పనిసరి: కొత్త సీరం వాడే ముందు చెవి వెనక భాగంలో లేదా చేతి లోపలి భాగంలో కొద్దిగా రాసి 24 గంటల పాటు గమనించండి. మంట, దురద లేదా ఎరుపు రాకపోతేనే దానిని ముఖానికి వాడండి.

4. హైడ్రేటింగ్ ఏజెంట్స్ ఉన్నవి చూడండి: విటమిన్-సితో పాటు హైలురోనిక్ యాసిడ్ లేదా విటమిన్-ఇ ఉన్న సీరమ్‌లు సున్నితమైన చర్మానికి మేలు చేస్తాయి. ఇవి చర్మానికి తేమను అందించి.. విటమిన్-సి వల్ల కలిగే స్వల్ప మంటను తగ్గిస్తాయి.

5. సన్‌స్క్రీన్ తప్పనిసరి: విటమిన్-సి రాసుకున్న తర్వాత చర్మం సూర్యరశ్మికి మరింత సెన్సిటివ్‌గా మారుతుంది. కాబట్టి, పగటిపూట విటమిన్-సి రాసుకుంటే దాని పైన ఖచ్చితంగా SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాలి.

Also Read: జుట్టు, చర్మ సౌందర్యానికి ఎండుద్రాక్షఎలా ఉపయోగపడుతుందో తెలుసా ?

ఎప్పుడు వాడకూడదు ?
మీ చర్మంపై ఇప్పటికే ఏవైనా అలర్జీలు, తీవ్రమైన మొటిమలు లేదా గాయాలు ఉంటే విటమిన్-సి వాడకపోవడమే మంచిది. అలాగే, రెటినోల్ లేదా ఇతర స్ట్రాంగ్ యాసిడ్స్ వాడుతున్నట్లయితే.. విటమిన్-సిని వాటితో కలిపి వాడకూడదు. ఒకదానిని ఉదయం, మరొకటి రాత్రి పూట వాడటం సురక్షితం.

సున్నితమైన చర్మం ఉన్నవారు విటమిన్-సిని వాడటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. కేవలం జాగ్రత్తగా ఎంచుకోవడం, తక్కువ మోతాదుతో మొదలుపెట్టడం, ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందమైన చర్మాన్ని పొందవచ్చు.

Related News

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

Big Stories

Advertisement
×