E-Paper
Advertisement

Himachal Pradesh Fire: విషాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు బలి.. నిద్రలోనే కబళించిన మంటలు!

Himachal Pradesh Fire: విషాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు బలి.. నిద్రలోనే కబళించిన మంటలు!
Advertisement

Himachal Pradesh Fire: హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న‌ ఒక హృదయవిదారక ఘటనలొ ఓ కుటుంబం ఆగ్నికి ఆహూతయింది. సిర్మౌర్ జిల్లా నోహ్రాధర్ తహసీల్ పరిధిలోని మారుమూల తలంగ్నా గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన వారు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘోరం జరగింది. ఈ ఘ‌ట‌న‌ ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

మంటలను గమనించిన గ్రామస్థులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినప్పటికీ, అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శీతాకాలం కావడంతో చలి కోసం పొయ్యిని వెలిగించి వదిలేయడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటల సమయంలో మోహన్ సింగ్ అనే వ్యక్తి నివాసంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంట్లోని ‘చూలా’ (సాంప్రదాయ వంట పొయ్యి) నుండి మంటలు వ్యాపించడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటలు అంటుకున్న సమయంలో ఇంట్లో ఏడుగురు నిద్రిస్తుండగా, గాఢ నిద్రలో ఉన్న వారు బయటపడే లోపే మంటలు ఇంటిని పూర్తిగా చుట్టుముట్టాయి.

ఈ ప్రమాదంలో మరణించిన వారిని రాజ్‌గఢ్‌లోని తప్రోలికి చెందిన నరేష్, అతని భార్య త్రిప్త, చౌపాల్‌లోని కుమ్డా గ్రామానికి చెందిన కవిత మరియు ఆమె ముగ్గురు చిన్న పిల్లలు సారిక, కృతిక, కృతిక్‌లుగా గుర్తించారు. కవిత భర్త లోకేందర్ (42) ఒక్కడే ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతని పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Read Also: Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాన్-ట్రాక్టర్ ఢీ, స్పాట్‌ లో 15 మంది

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×