E-Paper
Advertisement

ఇంట్లోనే కరకరలాడే క్రిస్పీ పొటాటో బైట్స్..ఈజీగా ఇలా చేయండి!

ఇంట్లోనే కరకరలాడే క్రిస్పీ పొటాటో బైట్స్..ఈజీగా ఇలా చేయండి!
Advertisement

Crispy Potato Bites: సండే ఈవినింగ్ లేదా వర్షాకాలంలో.. ఇంట్లో కూర్చుని టీ తాగుతుంటే, నోటికి రుచిగా ఏదైనా క్రంచీగా తినాలనిపించడం చాలా కామన్. బయట స్ట్రీట్ ఫుడ్స్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి, మన ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైన స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. బంగాళదుంపలతో చేసే రెసిపీలు ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా ఈ ‘క్రిస్పీ పొటాటో బైట్స్’ రెసిపీ చాలా తక్కువ సమయంలో ఎంతో రుచిగా తయారవుతుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం.

1. పొటాటో బైట్స్‌కి కావలసిన పదార్థాలు :

బంగాళదుంపలు (ఉడికించినవి) – 4 లేదా 5

Advertisement

బియ్యం పిండి లేదా కార్న్‌ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్లు

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్

Advertisement

కారం – 1 స్పూన్ ( రుచికి సరిపడా)

పసుపు – చిటికెడు

గరం మసాలా – అర స్పూన్

కొత్తిమీర తరుగు – కొద్దిగా

ఉప్పు – తగినంత

నూనె – వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

2. ముందుగా ఉడికించిన బంగాళదుంపలను పొట్టు తీసి, ఎక్కడా ఉండలు లేకుండా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి . ఇప్పుడు ఈ మ్యాష్ చేసిన బంగాళదుంప మిశ్రమంలో బియ్యం పిండి లేదా కార్న్‌ఫ్లోర్ వేయాలి. బియ్యం పిండి వేయడం వల్ల బైట్స్ చాలా క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. దీన్ని చపాతి పిండి ముద్దలా కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువగా పోయాల్సిన అవసరం లేదు, బంగాళదుంపలోని తేమ సరిపోతుంది.

3. కలిపి పెట్టుకున్న పిండి ముద్దను కొద్దిగా తీసుకొని, చేతిపై పొడవుగా రోల్ చేసుకోవాలి (సిలిండర్ షేప్). ఆ తర్వాత ఒక చాకు సహాయంతో .. మీకు నచ్చిన చిన్న చిన్న సైజు బైట్స్‌లా కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్ లేదా క్యూబ్ షేప్‌లో.. కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ సిద్ధం చేసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. కావాలనుకుంటే వీటిని ఒక 10 నిమిషాలు ఫ్రిజ్‌లో పెడితే నూనెలో వేసేటప్పుడు విడిపోకుండా మరింత బాగా వస్తాయి.

Also Read: లేటెస్ట్ అప్‌డేట్..మొబైల్ ఫోన్లలో ఏఐ ‘ఆస్క్ యూట్యూబ్’ ఫీచర్ లాంచ్!

4. ఇప్పుడు బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. తయారు చేసుకున్న పొటాటో బైట్స్‌ను నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ (బంగారు రంగు) వచ్చే వరకు వేయించాలి. వీటిని మధ్యమధ్యలో గరిటెతో మెల్లగా కలుపుతూ ఉండాలి, అప్పుడే అన్ని వైపులా సమానంగా వేగుతాయి. చక్కటి క్రిస్పీ టెక్చర్స్ రాగానే వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి.

అంతే! ఎంతో రుచికరమైన, కరకర లాడే హోంమేడ్ క్రిస్పీ పొటాటో బైట్స్ రెడీ అయిపోయాయి. వీటిని టొమాటో కెచప్, మైనానీస్ లేదా గ్రీన్ చట్నీతో.. వేడి వేడిగా తింటే ఆ రుచి వేరే లెవెల్‌లో ఉంటుంది. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసిపెడితే ప్లేట్ క్షణాల్లో ఖాళీ అయిపోతుంది.

Related News

కాలీఫ్లవర్‌తో ఈసారి ఇలా వేపుడు చేయండి..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!

స్వీట్ షాప్ స్టైల్ జ్యూసీ బాదుషా..ఈ చిన్న టిప్స్ పాటిస్తే రుచి అద్భుతం

కేవలం 14 రోజుల పాటు షుగర్‌కు దూరంగా ఉంటే.. శరీరంలో జరిగే మార్పులివే!

విదేశీయులు ఇష్టపడే ఈ ఇండియన్ డిష్ పుట్టింది బ్రిటన్‌లోనే అని తెలుసా?

నచ్చిన ఆహారం తింటూ.. కిలో బరువు తగ్గాలంటే.. రోజుకు ఎన్ని అడుగులు నడవాలి?

గుంటూరు స్పెషల్ కోవా పూరీ..ఇంట్లోనే ఇలా చేస్తే స్వీట్ షాప్ టేస్ట్!

వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఈ స్టైల్‌లో చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ!

Big Stories

Advertisement
×