E-Paper
Advertisement

Plants: శీతాకాలంలో ఇంటిని వెచ్చగా ఉంచే ఈ ఐదు మొక్కల గురించి తెలుసా?

Plants: శీతాకాలంలో ఇంటిని వెచ్చగా ఉంచే ఈ ఐదు మొక్కల గురించి తెలుసా?
Advertisement

Plants: చలికాలం మొదలైంది.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండోర్ వాతావరణాన్ని వెచ్చగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. దీని కోసం ఇంట్లో కొన్ని మొక్కలను పెంచమని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఇంటి వాతావరణాన్ని వెచ్చగా మార్చే మొక్కలు సానుకూలంగానే కాదు ఇంటి అందాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అంతేకాదు.. గాలిలో తేమ స్థాయిలు పెరిగే కొద్దీ ఇంటిని సంరక్షించడంలో కొన్ని మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేథ్యంలో ఇంటిలోని తేమ వాతావరణాన్ని పీల్చేసే కొన్ని మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తేమను పీల్చేసే పీస్ లిల్లి:

ఈ ఇండోర్ ప్లాంట్ తేమతో కూడిన వాతావరణంలోనూ ఎంతో చక్కగా పెరుగుతుంది. అంతేకాదు.. ఈ మొక్క వాతావరణం నుండి తేమను గ్రహిస్తుంది. దీంతో ఇంటిని వెచ్చగా ఉంచడానికి ఎంతగానో దోహదపడుతుంది. అలాగే పీస్ లిల్లీ యొక్క తెల్లటి పువ్వులు ఇంట్లో ప్రశాంతతను నెలకొల్పుతుంది. అయితే, పీస్ లిల్లీ మొక్కలను ప్రత్యక్ష సూర్యకాంతి నుండి దూరంగా ఉంచాలి. లేదంటే.. వేడికి మొక్క వాడిపోయే ప్రమాదం ఉంది. ఈ మొక్క కుండలోని నేలను తేమగా ఉంచండి. అదే సమయంలో నీరు నిల్వ లేకుండానూ చూసుకోవాలి.

ఉష్ణోగ్రతను పెంచే అరేకా పామ్:

Advertisement

అరెకా పామ్ మొక్క ఇంటి వాతావరణంలో చక్కగా పెరుగుతుంది. అలాగే ఈ ప్లాంట్ గది ఉష్ణోగ్రతను మెరుగుపరచడానికి, గాలిని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు.. ఈ మొక్క ఆకులు వేడిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి.. అరెకా పామ్ మొక్కను లివింగ్ రూమ్‌లో పెట్టుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

స్పైడర్ ప్లాంట్‌తో లాభాలు అనేకం:

ఈ స్పైడర్ మొక్కల వల్ల ఇంట్లో గాలి శుద్ధి కావడం, ఒత్తిడి తగ్గడం, ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొనడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి గాలిలో ఉన్న టాక్సిన్లను తొలగించడంలో ఎంతగానో సహాయపడతాయి. అలాగే స్పైడర్ ప్లాంట్ల పచ్చదనం ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ మొక్కలను పెంచడం చాలా సులభం. అంతేకాదు.. ఈ మొక్కను ఆర్థిక వృద్ధికి చిహ్నంగా కూడా భావిస్తారు.

గాలి నాణ్యతను మెరుగుపరిచే స్నేక్ ప్లాంట్:

Advertisement

ఈ మొక్క రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేసి, గాలిని శుద్ధి చేస్తుంది. ఈ మొక్కకు ప్రత్యేకంగా నీళ్లు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. స్నేక్ ప్లాంట్స్‌ను బెడ్ రూమ్ లేదా లివింగ్ రూమ్‌‌లో పెట్టుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ఈ మొక్క వల్ల ప్రశాంతమైన నిద్రను సొంతం చేసుకోవచ్చు.

ఒత్తిడిని తగ్గించే మనీ ప్లాంట్:

మనీ ప్లాంట్స్ ఇంటిలోని గాలిని శుద్ధి చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇకపోతే వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ అదృష్టాన్ని, సంపదను తెస్తుందని చెబుతారు నిపుణులు. ఇది బెంజీన్, ఫార్మాల్డిహైడ్, కార్బన్ మోనాక్సైడ్, జిలీన్ వంటి కాలుష్య కారకాలను తొలగిస్తుంది. అలాగే ఇంట్లో ఆక్సిజన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఈ మొక్కతో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత మెరుగుపడుతుంది.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×