E-Paper
Advertisement

Raviteja: రవితేజ సినిమాలో 6 మంది హీరోయిన్లు.. అసలు విషయం ఏంటంటే?

Raviteja: రవితేజ సినిమాలో 6 మంది హీరోయిన్లు.. అసలు విషయం ఏంటంటే?
Advertisement

Raviteja: మాస్ మహారాజా రవితేజ హిట్ ఫ్లాప్ సినిమాలతో పని లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక రవితేజ సంక్రాంతి పండుగ సందర్భంగా మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ కిషోర్ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వంలో రవితేజ ఆశికారంగనాథ్ కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా ద్వారా సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా ఎంతో మంచి ఆదరణ లభించింది.

రవితేజకు జోడిగా ఆరుగురు హీరోయిన్లు..

ఇదిలా ఉండగా తాజాగా రవితేజకు సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. రవితేజ తన తదుపరి సినిమాలో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించబోతున్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇలా ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలు త్వరలోనే వెల్లడి కాబోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై రవితేజ టీమ్ స్పందించారు. ఈ సందర్భంగా రవితేజ సినిమాలో ఆరుగురు హీరోయిన్లు నటించబోతున్నారని వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఈ వార్తలను ఖండించారు.

డబుల్ ధమాకా..

Advertisement

ఈ విధంగా రవితేజ టీమ్ స్పందించడంతో ఈ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది. ప్రస్తుతం రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక రవితేజ తదుపరి సినిమా గురించి ఎలాంటి అధికారక ప్రకటన ఇప్పటివరకు వెలబడలేదు అయితే ఫిలిం ఛాంబర్ లో మాత్రం డబుల్ ధమాకా అనే టైటిల్ ను పీపుల్ మీడియా నిర్మాణ సంస్థ రిజిస్టర్ చేయించారని వార్తలు బయటకు వచ్చాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే రవితేజ శ్రీ లీల మరోసారి జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

సంక్రాంతి రేసులో భర్త మహాశయులకు విజ్ఞప్తి..

Advertisement

డబుల్ ధమాకా అనే టైటిల్ రిజిస్టర్ చేయడంతో కచ్చితంగా ఈ సినిమా ధమాకా సినిమాకు సీక్వెల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అభిమానులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. ఇక రవితేజ ప్రస్తుత సినిమా విషయానికి వస్తే ఈయన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ద్వారా రాబోతున్నారు. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇటీవల మాస్ జాతర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి రవితేజ నిరాశ ఎదుర్కొన్నారు. మరి భర్త మహాశయులకు  విజ్ఞప్తి సినిమాతో నైనా హిట్ కొడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: The Raja saab: ది రాజా సాబ్ రన్ టైం లాక్.. రిస్క్ చేస్తున్న మారుతి?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×