E-Paper
Advertisement

అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా ? ఈ మార్పులు తప్పనిసరి

అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా ? ఈ మార్పులు తప్పనిసరి
Advertisement

Cholesterol: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘అధిక కొలెస్ట్రాల్. శరీరంలో ‘చెడు కొలెస్ట్రాల్’పెరగడం వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండె పోటు వంటి ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తుతాయి. అయితే.. ప్రాథమిక దశలో.. ఉన్న కొలెస్ట్రాల్ సమస్యను కేవలం మన లైఫ్ స్టైల్ కొన్ని క్రమబద్ధమైన మార్పులు చేసుకోవడం ద్వారా.. సమర్థవంతంగా అదుపు చేయవచ్చు.  నిపుణుల సూచనల ప్రకారం.. కొలెస్ట్రాల్‌ను తగ్గించే 5 కీలక మార్పులు ఇప్పుడు చూద్దాం.

కోలెస్ట్రాల్ మెరుగుపరుచుకోవడానికి 5 కీలక లైఫ్ స్టైల్ మార్పులు:

Advertisement

1. గుండెకు మేలు చేసే ఆహారం తీసుకోవడం:
మనం తినే ఆహారమే మన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్ణయిస్తుంది.

శాచురేటెడ్ ఫ్యాట్స్‌ను తగ్గించండి: నాన్ వెజ్, వెన్న, నెయ్యి, అధిక కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులలో ఇవి ఎక్కువగా ఉంటాయి. వీటిని తగ్గించడం వల్ల LDL కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ట్రాన్స్ ఫ్యాట్స్‌కు దూరంగా ఉండండి: బేకరీ ఐటమ్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్స్‌లో ఇవి ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

Advertisement

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: చేపలు, వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

2. క్రమం తప్పకుండా వ్యాయామం:
శారీరక శ్రమ రక్తంలో ‘మంచి కొలెస్ట్రాల్’స్థాయిలను పెంచుతుంది. ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం, సైక్లింగ్ చేయడం లేదా ఈత కొట్టడం వంటి వ్యాయామాలు చేయాలి. వ్యాయామం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగి, రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.

3. అధిక బరువును తగ్గించుకోవడం:
అవసరానికి మించి అదనంగా ఉన్న ప్రతి కేజీ బరువు కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణమవుతుంది. చక్కెర కలిగిన డ్రింక్స్, స్వీట్లు తగ్గించి.. వాటి స్థానంలో పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించవచ్చు. చిన్న చిన్న మార్పులు అంటే.. లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కడం, ఫోన్ మాట్లాడుతూ నడవడం వంటివి కూడా కేలరీలను ఖర్చు చేయడంలో సహాయ పడతాయి.

4. ధూమపానం , మద్యపానానికి దూరం :
ధూమపానం మానేసిన కేవలం 20 నిమిషాల్లోనే రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది. ఏడాది పాటు మానేస్తే.. గుండెపోటు వచ్చే ప్రమాదం సగానికి తగ్గుతుంది. పొగతాగడం వల్ల రక్తనాళాల గోడలు దెబ్బతిని కొవ్వు త్వరగా పేరుకుపోతుంది.మద్యపానం కూడా ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను పెంచి గుండెపై ఒత్తిడి తెస్తుంది. దీనిని పూర్తిగా మానేయడం లేదా పరిమితం చేయడం శ్రేయస్కరం.

Also Read: సమ్మర్ స్పెషల్.. ఈ 6 రిఫ్రెష్ డ్రింక్స్‌తో వేసవి తాపానికి గుడ్ బై చెప్పండి!

5. పీచు పదార్థం అధికంగా ఉండే ఆహారం:
కరిగే గుణం ఉన్న పీచు పదార్థం రక్తప్రవాహంలోకి కొలెస్ట్రాల్ గ్రహించబడకుండా ఆపుతుంది. ఓట్స్, బార్లీ, బీన్స్, ఆపిల్స్ , బేరి పండ్లలో పీచు అధికంగా ఉంటుంది. రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

లైఫ్ స్టైల్ మార్పులు అనేవి ఒక రోజుతో ముగిసేవి కావు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. పైన పేర్కొన్న 5 మార్పులను మీ డైలీ లైఫ్ స్టైల్ లో భాగం చేసుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అయితే.. కేవలం లైఫ్ స్టైల్ మార్పులు మాత్రమే సరిపోకపోవచ్చు. మీ రిపోర్టుల ఆధారంగా డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూనే ఈ మార్పులను అనుసరించడం బెస్ట్.

Related News

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

చాణక్య నీతి.. ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం

Big Stories

Advertisement
×