E-Paper
Advertisement

Loneliness: మీకు నచ్చినవాళ్లందరూ దూరం అవుతున్నారా? అయితే ఈ అలవాట్లే కారణం కావచ్చు!

Loneliness: మీకు నచ్చినవాళ్లందరూ దూరం అవుతున్నారా? అయితే ఈ అలవాట్లే కారణం కావచ్చు!
Advertisement

Loneliness: ఎప్పుడు చనిపోతామో తెలియని ఈ చిన్న జీవితంలో నలుగురితో కలిసి మెలిసి ఉంటేనే సంతోషంగా ఉండగలము అని మన పెద్దలు ఎపుడూ చెబుతుంటారు. చాలామంది తమ కష్ట సుఖాలను ఇతరులతో పంచుకోవాలి అని కోరుకోవడం సహజం. కానీ, ఇంకొందరు మాత్రం ‘నాకంటూ ఎవరూ లేరు.. లోకం నన్ను ఒంటరిని చేసేసింది’ అని తమలో తామే బాధపడుతుంటారు. అయితే, మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒంటరితనం అనేది బయట వ్యక్తుల ద్వారా అనుభవించే శిక్ష కాదు.. అది మన ఆలోచనా తీరు, మనస్తత్వం నుంచి పుట్టుకొచ్చే పరిస్థితి. మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని పనులు ఇతరులను మనకు దూరం చేస్తాయి. అవేంటంటే..

నలుగురితో కలవకపోవడం..

ఒకరు మనతో మాట్లాడకపోయినా లేదా ఒక చిన్న మాట అన్నా, దాన్ని పదే పదే తలచుకుంటూ వారు నన్ను కావాలనే అవమానించారు అని నిర్ణయానికి వచ్చేస్తారు. ఈ రకమైన నెగటివ్ ఆలోచనలు ఇతరుల పట్ల ద్వేషాన్ని పెంచి, వారితో కలవకుండా మనల్ని మనం ఒక గీత గీసుకుని ఆగిపోయేలా చేస్తాయి.

అంచనాలు పెట్టుకోవడం..

Advertisement

చుట్టూ ఉన్నవారు మనపై ఎప్పుడూ ఫోకస్ చేయాలని, అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎక్కువగా ఆశించడం. ఎదుటి వ్యక్తికి కూడా సొంత సమస్యలు, పనులు ఉంటాయని గుర్తించకపోవడం వల్ల, వారు ఒక్కసారి పలకరించకపోయినా ‘నాకు ఎవరూ లేరు’ అనే నిరాశలోకి వెళ్లిపోతుంటారు కొందరు.

Also Read: అసలు ఏంటి ఈ బ్లూ టర్మరిక్? మనకు తెలిసిన పసుపు కంటే ఇది భిన్నమైందా?

కమ్యూనికేషన్ గ్యాప్..

Advertisement

చాలామంది తమ మనసులో ఏముందో స్పష్టంగా చెప్పరు. కానీ ఎదుటివారు తమను అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. మనం నోరు విప్పి మాట్లాడనప్పుడు అవతలి వారికి మన ఇబ్బంది ఎలా తెలుస్తుంది? ఈ మౌనం మెల్లగా దూరాన్ని పెంచి, చివరికి ఒంటరితనాన్ని మిగిలుస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.

తరచూ కంప్లైంట్స్ చేయడం..

కొందరిని పలకరిస్తే చాలు.. ఎప్పుడూ తమ కష్టాలు, ఇతరుల మీద కోపాలు, సమాజం మీద అసహనాన్ని వెళ్లగక్కుతుంటారు. ఎప్పుడూ నెగటివ్‌గా మాట్లాడే వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడానికి ఎవరూ ఇష్టపడరనే విషయం తెలుసుకోవాలి. ఇలాంటి అలవాట్ల వలన ఉన్న కొద్దిమంది ఫ్రెండ్స్ కూడా దూరమవ్వచ్చు.

గతంలోనే గడిపేయడం..

ఎక్కువ మంది చేసే కామన్ మిస్టేక్ ఏమిటంటే.. గతంలో ఎవరో మోసం చేశారని లేదా బాధపెట్టారని, ఇప్పుడు కలిసే ప్రతి వ్యక్తిని అనుమానంగా చూడటం. ఈ క్రమంలో ‘అందరూ ఇంతే’ అనే ఒక ముద్ర వేసేయడం వల్ల కొత్త బంధాలు ఏర్పడవు. అందుకే గతాన్ని వదిలిపెట్టి.. ప్రస్తుతంలో జీవించడం చాలా ముఖ్యం. అప్పుడే చిన్న చిన్న సంతోషాలను మనసారా ఆస్వాదించగలము.

Also Read: ఖాళీ కడుపుతో సోడా తాగుతున్నారా? అయితే ఈ 4 ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లే!

 

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×