E-Paper
Advertisement

Raw Milk for Skin: ఖరీదైన క్రీములు అక్కర్లేదు.. వంటింట్లో దొరికే పదార్థంతోనే నిగనిగలాడే చర్మం మీ సొంతం!

Raw Milk for Skin: ఖరీదైన క్రీములు అక్కర్లేదు.. వంటింట్లో దొరికే పదార్థంతోనే నిగనిగలాడే చర్మం మీ సొంతం!
Advertisement

Raw Milk for Skin: మృదువైన, ప్రకాశవంతమైన చర్మం కావాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. అయితే ఆరోగ్యవంతమైన చర్మం కోసం ఖరీదైన క్రీములు, ఫేషియల్స్ మాత్రమే పరిష్కారం  అనుకోవడం తప్పు. నిజానికి మన ఇంట్లో దొరికే సులభమైన పదార్థాలతోనే చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో పచ్చి పాలలోని సహజ పోషకాలు మన చర్మాన్ని మెరిపించడంలో ఎంతలా తోడ్పడుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వృద్ధాప్య ఛాయలు ఆలస్యంగా:

విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లతో నిండిన పదార్థం పాలు. ఇందులోని విటమిన్ A చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడితే.. విటమిన్ D చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతోపాటు పాలలోని లాక్టిక్ ఆమ్లం మృత కణాలను తొలగించి, కొత్త చర్మ కణాల పునరుజ్జీవనాన్ని ప్రేరేపిస్తుంది. ఈ ప్రక్రియ చర్మాన్ని సహజంగా, కాంతివంతంగా చేయడమే కాకుండా వృద్ధాప్య ఛాయలను కూడా ఆలస్యం చేస్తుంది.

Advertisement

Also Read: అవకాడోలో దాగున్న పోషక రహస్యాలు.. గుండె, మెదడు, జీర్ణక్రియకు పూర్తి సంరక్షణ!

పాలతో ఫేస్ ప్యాక్‌లు:

ముఖ్యంగా ముఖం మెరవాలంటే పచ్చి పాలతో వేసుకునే మాస్క్‌లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీని కోసం పాలు-తేనె కలిపి ముఖానికి పూసినప్పుడు చర్మం తడి, మృదువుగా మారుతుంది. అలాగే పాలు-ఓట్స్ పేస్ట్ చర్మాన్ని సమతుల్యంగా, కాంతివంతంగా మార్చగలదు. దీనిలో కొద్దిగా లెమన్ జ్యూస్ కలిపి ఉపయోగిస్తే చర్మానికి సహజమైన బ్రైట్ లుక్ ఇస్తుంది. కానీ సున్నితమైన చర్మం కలిగిన వారికి మాత్రమే ఈ మాస్క్‌లు సురక్షితం.

సహజ పద్ధతిలో:

Advertisement

పాలతో వేసుకునే మాస్కులను సాధారణంగా వారంలో రెండుసార్లు వేసుకోవడం ముఖ్యం. ఈ మాస్క్ ద్వారా చర్మం తడిగా ఉండటమే కాకుండా, కాంతివంతంగానూ మారుతుంది. రసాయనాలు కలిపిన కాస్మొటిక్స్ వాడటం కంటే ఇంట్లోనే సహజ సిద్ధంగా చేసుకున్న ఇలాంటి మాస్క్‌లు ఉత్తమం.

ఇవి కూడా ముఖ్యమే:

ఇకపోతే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మిల్క్ మాస్క్‌తో పాటు శరీరానికి సరిపడ నీరు తాగడం, ఆల్కహాల్, సిగరెట్‌కు దూరంగా ఉండటం కూడా ముఖ్యమే. అలాగే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర మన శరీరానికి ఎంతో అవసరం. అప్పుడే ఆరోగ్యకరమైన చర్మాన్ని సొంతం చేసుకోగలరు.

Also Read: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫెయిల్ అవుతోందా? మీరు చేస్తున్న ఈ ఐదు తప్పులే కారణం కావచ్చు!

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×