E-Paper
Advertisement

Warm Rice Vs Cold Rice: అన్నం వండిన వెంటనే తింటున్నారా? అయితే ఈ షాకింగ్ హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి !

Warm Rice Vs Cold Rice: అన్నం వండిన వెంటనే తింటున్నారా? అయితే ఈ షాకింగ్ హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి !
Advertisement

Warm Rice Vs Cold Rice: సాధారణంగా మనలో చాలా మంది వేడి వేడి అన్నం తినడానికే ఇష్టపడతారు. అయితే.. ఆరోగ్య పరంగా చూస్తే వేడి అన్నం కంటే చల్లని అన్నం లేదా చల్లారిన అన్నం ఆరోగ్యానికి.. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు మెరుగైన ప్రయోజనాలను అందిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇంతకీ వేడి అన్నం తింటే మంచిదా లేదా చల్లార్చిన అన్నం తింటే మంచిదా అనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. చల్లని అన్నం: గట్ హెల్త్‌కు ‘వరం’:

వండిన అన్నాన్ని చల్లబరిచినప్పుడు (ముఖ్యంగా 8-12 గంటలు లేదా రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు).. అందులోని సాధారణ పిండి పదార్థం “రెసిస్టెంట్ స్టార్చ్” గా మారుతుంది.

Advertisement

ప్రీబయోటిక్ ప్రయోజనాలు: రెసిస్టెంట్ స్టార్చ్ చిన్న ప్రేగులలో జీర్ణం కాకుండా నేరుగా పెద్ద పేగులకు చేరుతుంది. అక్కడ ఇది మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా పేగుల ఆరోగ్యం మెరుగు పడుతుంది.

చక్కెర స్థాయిల నియంత్రణ: వేడి అన్నం తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. కానీ.. చల్లని అన్నంలోని రెసిస్టెంట్ స్టార్చ్ గ్లూకోజ్ విడుదలను నెమ్మదిస్తుంది. దీని వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది.

2. వేడి అన్నం: తక్షణ శక్తి కోసం:

వేడి అన్నం దాని సువాసన.. రుచి వల్ల చాలా మందికి ఇష్టమైన ఆహారం.

సులభంగా జీర్ణం: వేడి అన్నంలో స్టార్చ్ మెత్తగా ఉండటం వల్ల శరీరం దానిని త్వరగా గ్రహిస్తుంది. తక్షణ శక్తి అవసరమైన క్రీడాకారులకు లేదా బలహీనంగా ఉన్నవారికి ఇది మంచిది.

ప్రతికూలత: అయితే.. దీని వల్ల ఇన్సులిన్ స్పైక్స్ కలిగే అవకాశం ఉంటుంది, ఇది బరువు పెరగడానికి లేదా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇబ్బందిగా మారవచ్చు.

3. చల్లని అన్నం vs చద్దన్నం:

మన తెలుగు రాష్ట్రాల్లో ‘చద్దన్నం’ తినే అలవాటు చాలా కాలంగా ఉంది. రాత్రి అన్నంలో నీళ్లు, కొద్దిగా పెరుగు వేసి ఉంచితే అది ‘ఫెర్మెంటేషన్’ (పులియడం) అవుతుంది.

ఇది చల్లని అన్నం కంటే కూడా ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది. ఇందులో ఉండే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది.

Also Read: నిద్ర మధ్యలో ఎందుకు మేల్కొంటారు ? శాస్త్రవేత్తలు చెబుతున్న ఆసక్తికరమైన నిజాలు

4. జాగ్రత్తలు కూడా ముఖ్యం:

చల్లని అన్నం ఆరోగ్యకరమే అయినా.. దానిని సరిగ్గా నిల్వ చేయకపోతే ప్రమాదం ఉంది.

బాసిల్లస్ సిరియస్: వండిన అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు ఉంచితే అందులో బ్యాక్టీరియా చేరి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి.. అన్నం వండిన కాసేపటికే దానిని చల్లబరిచి ఫ్రిజ్‌లో భద్రపరచాలి.

మొత్తంగా చూస్తే.. చల్లని లేదా చల్లారిన అన్నం బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ వ్యాధిగ్రస్తులకు, గట్ హెల్త్ మెరుగు పరుచుకోవాలనుకునే వారికి అత్యుత్తమ ఎంపిక. అయితే.. మీరు చల్లని అన్నం తినలేక పోతే.. చల్లార్చిన అన్నాన్ని మళ్ళీ వేడి చేసుకుని కూడా తినవచ్చు. ఇలా చేసినా అందులోని రెసిస్టెంట్ స్టార్చ్ ప్రయోజనాలు అలాగే ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×