E-Paper
Advertisement

Cardamom milk: రాత్రిపూట యాలకుల పొడి కలిపిన పాలు తాగితే మిరాకిల్ బెనిఫిట్స్

Cardamom milk: రాత్రిపూట యాలకుల పొడి కలిపిన పాలు తాగితే మిరాకిల్ బెనిఫిట్స్
Advertisement

చలికాలం మొదలైతే చాలామంది రాత్రివేళ వేడి పాలు తాగుతూ ఉంటారు ఎంతోమంది. ఇది ఆరోగ్యం కూడా. వేడి పాలు శరీరానికి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని,మంచి నిద్రను అందిస్తాయి. ఈ వేడి పాలలో కొద్దిగా యాలకులు వేసుకుంటే ఆరోగ్యానికి ఇంకా మంచి ప్రయోజనాలు దక్కుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఏలకులు మన ఇళ్లలో సాధారణంగా దొరికే మసాలాలో ఒకటి. చిన్నగా కనిపించినా ఇందులో శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు ఉన్నాయి. అందుకే వైద్య నిపుణులు రాత్రి పాలల్లో యాలకుల పొడి వేసుకోవాలని సూచిస్తున్నారు.

జీర్ణక్రియకు సహాయం
రోజంతా మనం ఏమి తిన్నా, ఏమి తాగినా రాత్రి పడుకునే ముందు జీర్ణక్రియను సరిచేసుకోవడానికి శరీరానికి కొన్ని గంటలు అవసరం. ఇందులో యాలకులు కీలక పాత్ర పోషిస్తాయి. పాలు కొద్దిగా కడుపుకు భారంగా అనిపించే అవకాశం ఉండొచ్చు. కానీ పాలను వేడిగా చేసి, అందులో రెండు మూడు యాలకులు వేసి తాగితే జీర్ణ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. యాలకులు కడుపులోని ఆమ్లాలను సర్దుబాటు చేసి, ఆహారం సులభంగా జీర్ణం అవడానికి సహాయం చేస్తాయి.

Advertisement

పొట్ట ఉబ్బరం తగ్గుతుంది
చాలామందికి భోజనం చేసిన తర్వాత పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా రాత్రి పాలు తాగితే కొందరికి ఈ సమస్యలు ఎక్కువవుతాయి. కానీ ఏలకులు ఉన్న పాలు తాగితే ఈ అసౌకర్యాలు తగ్గుతాయి. యాలకులలో ఉన్న సహజ గుణాలు కడుపు లోపల ఏర్పడే వాయువును బయటికి పంపడంలో సహాయం చేస్తాయి. దీంతో కడుపు తేలికగా అనిపిస్తుంది. రాత్రి నిద్ర కూడా సులభంగా పడుతుంది. ఆధునిక జీవనశైలిలో చాలామందికి నిద్ర సరిగా రాకపోవడం సాధారణం అయ్యింది. దాని వల్ల ఒత్తిడి, అలసట, తలనొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. రాత్రి వేడి పాలలో ఏలకులు వేసి తాగితే శరీరం ప్రశాంతంగా మారి, నిద్ర త్వరగా పడుతుంది. ఏలకుల నుంచే సువాసన మెదడుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది.ఈ రెండూ కలసి మనసును ప్రశాంతంగా మారుస్తుంది.

మలబద్ధకం సమస్య తగ్గుతుంది
రోజూ మలబద్ధకం బాధపడుతున్నవారికి యాలకులతో పాలు మంచి సహాయం చేస్తాయి. యాలకులు కడుపు లోపలి కదలికలను సరిచేస్తాయి. పాలు, యాలకులు కలవడంతో మలబద్ధకం సమస్య కొద్దికొద్దిగా తగ్గుతుంది. ముఖ్యంగా వయస్సు పైబడినవారు ఈ పద్ధతిని అనుసరించడం వల్ల ప్రయోజనం పొందుతారు. యాలకులు నోటి దుర్వాసనను తగ్గించడంలో ప్రసిద్ధి పొందాయి. రాత్రి పాలు తాగే ముందు, తాగిన తర్వాత కూడా నోటి దుర్వాసన సమస్య ఉంటే అది తగ్గుతుంది. ఏలకులలో ఉన్న సహజ గుణాలు నోటిలో వాసన రాకుండా అడ్డుకుంటుంది.

Advertisement

హార్మోన్ల సమతుల్యత
కొన్ని పరిశోధనల ప్రకారం యాలకులు శరీరంలోని సహజ హార్మోన్లను సరిచేయడంలో సహాయపడతాయని చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళలు రాత్రి యాలకుల పాలు తాగే అలవాటు పెంచుకుంటే శరీరంలో తలెత్తే చిన్న సమస్యలు సులభంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. నెలసరి సమస్యలు, ఒత్తిడి, అలసట వంటి వాటికి ఇది సహాయపడుతుంది. యాలకులు శరీరంలో రక్త ప్రవాహాన్ని సజావుగా కొనసాగించడానికి సహాయపడతాయి. రాత్రి వేడి పాలు కూడా రక్తనాళాలను సడలిస్తాయి. ఈ రెండు కలిస్తే రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఉదయం లేవగానే శరీరం తేలికగా, ఉల్లాసంగా అనిపిస్తుంది.

ఎవరు తాగకూడదు?
సాధారణంగా అందరూ రాత్రి యాలకులు కలిపిన పాలు తాగొచ్చు. అయితే చక్కెరను ఎక్కువగా వేయకపోవడం మంచిది. దాహం అధికంగా వేసే వారికి, పాలు అలెర్జీ ఉన్నవారికి ఈ పద్ధతి సరిపోదు. అలాగే శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కూడా తమ వైద్యుడిని అడిగి అలవాటు చేసుకోవడం మంచిది.

Related News

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

Big Stories

Advertisement
×