E-Paper
Advertisement

Ramayan 2 Movie: వారణాసి ఎఫెక్ట్.. అయోమయంలో రణబీర్ కపూర్ రామాయణ 2..

Ramayan 2 Movie: వారణాసి ఎఫెక్ట్.. అయోమయంలో రణబీర్ కపూర్ రామాయణ 2..
Advertisement

Ramayan 2 Movie: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు రామాయణ ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే రామాయణం నేపథ్యంలో మరొక సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్(Ranbir Kapoor),సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న రామాయణ(Ramayana) సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు. ఇక రెండో భాగం కూడా 2027 దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు.

ఆలస్యంగా రామాయణ 2 షూటింగ్?

ఇకపోతే రామాయణ పార్ట్ వన్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ పనులను జరుపుకుంటున్నట్లు సమాచారం. పార్ట్ 1 అనుకున్న విధంగానే 2026 లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే పార్ట్ 2 విషయంలోనే నిర్మాతలు అయోమయంలో పడ్డారని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుందని సమాచారం. ఇలా రామాయణ పార్ట్ 2 ఆలస్యం అవ్వడానికి కారణం లేకపోలేదు. మహేష్ బాబు(Mahesh Babu) నటిస్తున్న వారణాసి (Varanasi)సినిమానే అందుకు కారణమని తెలుస్తుంది.

రాముడి పాత్రలో మహేష్ బాబు..

Advertisement

మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించబోతున్నట్టు రాజమౌళి తెలియజేశారు. ఇక ఈ సినిమాని కూడా 2027వ సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయాన్ని కూడా తెలిపారు. ఇలా వారణాసి సినిమా అనుకున్న విధంగానే విడుదల అయితే ఈ ప్రభావం రామాయణ 2 పై పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చిత్ర బృందం భావిస్తున్నారు అందుకే ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యంగా జరుపుకోవాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది.

వారణాసి 2027 సమ్మర్ విడుదల..

Advertisement

ఇక రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న వారణాసి సినిమా 2027 కు కచ్చితంగా విడుదల అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పనులను కూడా కొంత భాగం పూర్తి చేసినట్టు సమాచారం. ఇలా రాజమౌళి శరవేగంగా షూటింగ్ పనులను నిర్వహిస్తూ 2027 సమ్మర్ కు ఈ సినిమాని తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని రాజమౌళి గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో రామాయణ 2 వెనకడుగు వేస్తున్నారని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా రాముడికి సంబంధించినవి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక రామాయణ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే .ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో ప్రముఖ నటుడు యశ్ నటించబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: AK 64: అజిత్ కుమార్ Ak 64 అప్డేట్..షూటింగ్ ఎప్పుడో చెప్పేసిన డైరెక్టర్!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×