E-Paper
Advertisement

సాయంత్రం వేళ వేడివేడిగా ముంబై పావ్ భాజీ.. పర్ఫెక్ట్ రుచి కోసం ఈ టిప్స్ ఫాలో అయిపోండి!

సాయంత్రం వేళ వేడివేడిగా ముంబై పావ్ భాజీ.. పర్ఫెక్ట్ రుచి కోసం ఈ టిప్స్ ఫాలో అయిపోండి!
Advertisement

Mumbai Style Pav Bhaji: ముంబై వీధుల్లో అడుగుపెడితే చాలు.. వెన్నలో వేగుతున్న పావ్ వాసన, మసాలాలతో ఉడుకుతున్న భాజీ ఘుమఘుమలు నోరూరిస్తాయి. వేడివేడి పావ్‌ను కరకరలాడేలా కాల్చి, కమ్మని కూరలో అద్దుకుని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా సాయంత్రం వేళ ఆకలిగా అనిపించినప్పుడు పావ్ భాజీ తింటే కడుపు నిండటమే కాదు.. మనసు కూడా సంతృప్తిగా ఉంటుంది. బయట దొరికే ముంబై స్టైల్ పావ్ భాజీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. కొన్ని రకాల కూరగాయలు, కొద్దిగా వెన్న, సరైన మసాలాలు ఉంటే చాలు.. హోటల్‌లో దొరికే రుచికి దగ్గరగా తయారు చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ రుచికరమైన పావ్ భాజీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి..

కావాల్సిన పదార్థాలు:

బంగాళాదుంపలు – 3
క్యారెట్ – 1
కాలీఫ్లవర్ ముక్కలు – 1 కప్పు
పచ్చి బఠాణీలు – అర కప్పు
ఉల్లిపాయలు – 2
టమోటాలు – 3
పచ్చిమిర్చి – 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
పావ్ భాజీ మసాలా – 2 టేబుల్ స్పూన్లు
కారం – అర టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్
ఉప్పు – తగినంత
వెన్న – 4 టేబుల్ స్పూన్లు
నూనె – 2 టేబుల్ స్పూన్లు
నిమ్మకాయ – 1
కొత్తిమీర తరుగు – కొద్దిగా
పావ్ బన్స్ – 8

తయారీ విధానం ఇలా:

Advertisement

బంగాళాదుంపలు, క్యారెట్, కాలీఫ్లవర్, పచ్చి బఠాణీలను కడిగి ముక్కలుగా కోసుకోవాలి. వీటిని ప్రెషర్ కుక్కర్‌లో వేసి తగినంత నీరు పోసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరి తగ్గిన తర్వాత కూరగాయలను మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక వెడల్పాటి పాన్‌లో నూనె, రెండు టేబుల్ స్పూన్ల వెన్న వేసి వేడి చేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తరిగిన టమోటాలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.

Advertisement

ఇందులో పసుపు, కారం, పావ్ భాజీ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మెదిపిన కూరగాయలను వేసి, కొద్దిగా నీరు పోసి అన్నీ కలిసేలా మెదుపుతూ ఉడికించాలి. భాజీ చిక్కగా, మసాలాల సువాసనతో తయారయ్యే వరకు ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించాలి. చివరగా వెన్న, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలపాలి.

మరో పెనంపై కొద్దిగా వెన్న వేసి పావ్ బన్స్‌ను మధ్యకు కోసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. వేడివేడి భాజీని ప్లేట్‌లో వేసి, పైన కొద్దిగా వెన్న, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయతో అలంకరించాలి. వెన్నలో కాల్చిన పావ్‌తో కలిపి వేడివేడిగా వడ్డిస్తే ముంబై స్టైల్ పావ్ భాజీ రుచి ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటుంది.

Tags

Related News

కాలీఫ్లవర్‌తో ఈసారి ఇలా వేపుడు చేయండి..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!

స్వీట్ షాప్ స్టైల్ జ్యూసీ బాదుషా..ఈ చిన్న టిప్స్ పాటిస్తే రుచి అద్భుతం

ఇంట్లోనే కరకరలాడే క్రిస్పీ పొటాటో బైట్స్..ఈజీగా ఇలా చేయండి!

కేవలం 14 రోజుల పాటు షుగర్‌కు దూరంగా ఉంటే.. శరీరంలో జరిగే మార్పులివే!

విదేశీయులు ఇష్టపడే ఈ ఇండియన్ డిష్ పుట్టింది బ్రిటన్‌లోనే అని తెలుసా?

నచ్చిన ఆహారం తింటూ.. కిలో బరువు తగ్గాలంటే.. రోజుకు ఎన్ని అడుగులు నడవాలి?

గుంటూరు స్పెషల్ కోవా పూరీ..ఇంట్లోనే ఇలా చేస్తే స్వీట్ షాప్ టేస్ట్!

Big Stories

Advertisement
×